Suryaa.co.in

Andhra Pradesh Telangana

కేసీఆర్ – మోడీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా

ఢిల్లీ మద్యం కేసులో టీఆర్ఎస్ నాయకులు కటకటాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి
మహిళా సాధికారత గురించి కవిత మాట్లాడటం హాస్యాస్పదం
పులుకడిగిన మత్యాలు లాంటి పార్టీల మద్దతు కేసీఆర్ తీసుకుంటున్నాడు
బాబాయి హత్య కేసులో బాధ్యులు అరెస్ట్ అవుతారు
జగన్ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లాలంటే పరదాల మధ్య వెళ్తున్నాడు
పులివెందుల వెళ్లాలన్నా 1500 మంది పోలీసుల మధ్య వెళ్తున్నాడు
దొంగ ఓట్ల కోసం రాష్ట్రంలో ఒక మంత్రినే పెట్టారు
కేసీఆర్ కుటుంబానికి ఎప్పుడో ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సింది
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్

ప్రకాశం: తెలంగాణాలో 17 పార్లమెంట్ స్థానాలు మాత్రమే ఉన్నాయి.దేశంలో 543 పార్లమెంట్ స్థానాలు ఉన్న విషయం కేసీఆర్ మరిచిపోయాడు.ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగరాలని చూసినట్టు ఉంది కేసీఆర్ పరిస్థితి. దొంగ దొరికి పోతున్నప్పుడు రకరకాల విన్యాసాలు చేస్తారు.ఢిల్లీ మద్యం కేసులో టీఆర్ఎస్ నాయకులు కటకటాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఉంది.దోచుకున్న లక్ష కోట్లు ఎవరికి అప్పచెప్పాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.

పులుకడిగిన మత్యాలు లాంటి పార్టీల మద్దతు కేసీఆర్ తీసుకుంటున్నాడు. కేసీఆర్ కి మోడీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. వైసీపీ, బీజేపీ భిన్న దృవాలు.ఆ పార్టీతో కలిసేది లేదు, సమర్థించేదీ లేదు.అవినీతి కేసుల్లో జగన్ పై గతంలోనే విచారణ పూర్తై అవినీతి పరుడని జైలుకెళ్లాడు.జగన్ బాబాయి హత్య కేసులో సీబీఐ విచారణ వేగంగా జరుగుతుంది.కలుగుల్లో ఉన్న ఎలుకలు అన్ని బయటకు వచ్చాయి.బాబాయి హత్య కేసులో బాధ్యులు అరెస్ట్ అవుతారు.

జగన్ పై నాలుగేళ్లలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.సంవత్సరాల పాటూ ఓదార్పు యాత్ర, పాదయాత్ర చేసిన జగన్ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లాలంటే పరదాల మధ్య వెళ్తున్నాడు.సొంత నియోజక వర్గం పులివెందుల వెళ్లాలన్నా 1500 మంది పోలీసుల మధ్య వెళ్తున్నాడు.

జగన్ ప్రభుత్వంపై ఉద్యోగులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.టీచర్లను మద్యం షాపుల వద్ద వాడుకుని ఎన్నికల విధులకు పనికి రారని చెబుతున్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల కోసం దొంగ ఓట్లు చేర్చారు.దొంగ ఓట్ల కోసం రాష్ట్రంలో ఒక మంత్రినే పెట్టారు.ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడికి పంచాయతీరాజ్ శాఖని వదిలేసి దొంగ ఓట్ల కోసం ఆ మంత్రి వెళ్తున్నాడు. మహిళా సాధికారత గురించి కవిత మాట్లాడటం హాస్యాస్పదం.ఆస్కార్ అవార్డు పొరపాటున రాజమౌళికి వచ్చింది…కేసీఆర్ కుటుంబానికి ఎప్పుడో ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సింది.

 

LEAVE A RESPONSE