Suryaa.co.in

Telangana

జీసస్ స్ఫూర్తితో కేసీఆర్ పాలన

– నేడు దేశానికే తలమానికంగా తెలంగాణ
– కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రి కావాలని ఆశీర్వదించండి
– క్రైస్తవులకు కేసీఆర్ పాలనలోనే సంక్షేమం
– బిఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జి డా. దాసోజు శ్రవణ్

‘జీసస్ గురించి స్మరించుకున్న ప్రతిసారి పోరాటం, తాగ్యం, సేవ మనసులో కదులుతుంది. మన నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్లో పాలన లో కూడా ఈ మూడు కనిపిస్తాయి. తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం అహోరాత్రులు కృషి చేశారు. తన పదవులని, వయసుని త్యాగం చేశారు. సేవ విషయానికి వస్తే.. ఈవాళ తెలంగాణ భారతదేశానికి తలమానికంగా మారిందంటే అది కేసీఆర్ అందించిన సేవలు వలనే” అని డా. దాసోజు శ్రవణ్. అన్నారు బిఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జి, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరిగిన ప్రత్యేక ప్రార్ధనా దినోత్సవ వేడుకల్లో దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ..తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న సమయంలో అసలు తెలంగాణ రాదని, కేసీఆర్ వలన సాధ్యం కాదంటూ కొందరు ప్రచారం చేశారు. తర్వాత దశలో ఒకవేళ తెలంగాణ వచ్చినా పాలన రాదని, ఇక్కడ కరెంట్, నీళ్ళు ఉండవని తప్పుడు ప్రచారం చేశారు. కానీ నవ్విన నాపచేనే పండినట్లు ఈవాళ తెలంగాణ దేశానికే తలమానికంగా మారింది. ఈ రోజు దేశంలో అత్యధిక వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కరెంట్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ. దేశ జీడీపీకి అత్యధిక సహకారం అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ. కేసీఆర్ నాయత్వంలో విద్య, వైద్యం, ఉపాధి..అటు అద్భుతమైన సంక్షేమ పధకాలతో అన్ని రంగాల్లో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించింది.

కేసీఆర్ నాయకత్వంలో శాంతి ప్రజ్వరిల్లుతోంది. అన్నీ మతాల వారికి స్వేఛ్చ సమానత్వం భద్రత కల్పిస్తున్నారు. క్రీస్తు ఆదేశించిన మార్గంలో పయనిస్తూ అద్భుతమైన పాలన అందిస్తున్నారు కేసీఆర్. దశాబ్ది ఉత్సవాలు సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ మూడోసారి కూడా కేసీఆర్ ముఖ్య్యమంత్రై మనందరినీ అద్భుతంగా పాలించే ఆశీర్వాదలు మీరంతా ఇవ్వాలి” అని కోరారు.

”కేసీఆర్ గత ఎనిమిదేళ్ళుగా క్రైస్తువల కోసం అద్భుతమైన పధకాలు ప్రవేశపెటారు. కొత్త చర్చ్ లు నిర్మాణానికి లక్ష, రిపేర్ల కోసం30 వేలు కేటాయించారు. స్మశాన వాటికలకు హైదరాబద్, రంగా రెడ్డి జిల్లాలలోనే దాదాపు 42 ఎకరాలు కేటాయించారు. ఇంకా కేటాయించాల్సి వుంది. 133కోట్ల రుపాయిలతో ప్రతి ఏటా క్రిస్మస్ పండగలు నిర్వహిస్తున్నారు. ఇరవై లక్షల మందికి గిఫ్ట్స్ అందించారు. అలాగే స్వయం ఉపాధి కోసం కోట్లాది రూపాయిలు కేటాయించారు” అని తెలిపారు.

కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని, రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ భారీ మెజార్టీ తో గెలవాలని, కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని కార్యక్రమంలో పాల్గొన్న బిషప్ లు, పాస్టర్లు, క్రైస్తవ ప్రతినిధులందరూ ప్రార్ధనలు జరిపారు.

తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్స్ & పాస్టర్స్ అసోసియేషన్,(టియు సిపి ఎ ) ట్విన్ సిటీస్ పాస్టర్స్ ఫెలోషిఫ్ ఆద్వర్యంలో, టియుసిపిఎ జనరల్ సెక్రటరి సినియర్ బిఆర్ఎస్ నాయకులు గోనే సాల్మన్ రాజ్ నేతృత్వంలో నారాయణగూడ చర్చ్ లో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కె టిమొతీ (ప్రెసిడెంట్ టియుసిపిఎ) డాక్టర్ జి సామ్యుల్ (ఫస్ట్ పాస్టర్ బిసిహెచ్) టియుం కుమార్ ( కన్వీనర్ )టి. భాస్కర్, బిషప్. లాజర్ లాల్ సింగ్ నాయక్, బిషప్. ధనరాజ్ కోట, గోడి శేఖర్, టి. కుమార్, పి. మెన్నో జోయెల్, బ్రదర్ బెనోని రిచర్డ్, ప్రబోధ్ విల్సన్, సిస్టర్ హేమలత, షాలిని తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE