Suryaa.co.in

Telangana

కేసీఆర్ సారూ.. మీ వెంటే ఉన్నాం!

– బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభకు 1,02,003 రూపాయలు విరాళం ప్రకటించిన ముఖరా కె గ్రామస్తులు

ముఖరా: బీఆర్ఎస్ పార్టీ 25 వ ఆవిర్భావ సభ ఖర్చుల కొరకు ముఖరా కె గ్రామస్తులు విరాళం ప్రకటించారు, కేసీఆర్ పాలనలో ముఖరా కె గ్రామంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందింది అని, కేసీఆర్ నాయకత్వంలో ముఖరా కె గ్రామం దేశం లోనే ఆదర్శ గ్రామంగా నిలిచింది అని,నాటి నుండి నేటి వరకు కేసీఆర్ వెంటే ఉన్నామని, గత 10 ఏళ్ళు కేసీఆర్ మమ్మల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపాడు అని, ఇప్పుడు మేము కేసీఆర్ కి రుణపడి ఉంటామని అందుకే కేసీఆర్ ఓరుగల్లు లో నిర్వహించే బహిరంగ సభకు విరాళం ప్రకటించారు.

గ్రామస్తులు అందరూ కలిసి 1,02,003 రూపాయలను పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ కు అందజేయాలనీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి కి 1,02,003 రూపాయలు అందజేశారు, సర్పంచ్ మీనాక్షి మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో ముఖరా కె గ్రామం దేశంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచింది అని, గ్రామాని అన్ని రంగ్గాల్లో కేసీఆర్ అభివృద్ధి చేశారని, ప్రతి ఇంటికి సంక్షేమం అందింది అని నాటి జల దృశ్యం నుండి నేటి వరకు కేసీఆర్ సారూ వెంటే ఉన్నామని మళ్ళీ కేసీఆర్ సారూ అడుగుజాడలో నడుస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గే సుభాష్, రైతులు మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE