Suryaa.co.in

Telangana

మోదీ పేరు వింటేనే కేసీఆర్ గజగజ వణుకుతడు

-బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసి కాంగ్రెస్ ఇమేజ్ ను పెంచేందుకే కేసీఆర్ కుట్ర
-అందులో భాగమే మోదీ దోస్త్ అంటూ జిమ్మిక్కులు
-కేసీఆర్ పాలనలో సర్వనాశనమైతున్న తెలంగాణ
-ట్రిపుల్ విద్యార్థుల మరణాలు ప్రభుత్వ హత్యలే
-సంక్షేమ పథకాలన్నీ మరింత మెరుగ్గా అమలు చేస్తాం
-ధరణిని బాగు చేస్తామే తప్ప రద్దు చేయబోం
-హిందుత్వ గురించి మాట్లాడి తీరుతా
-హిందూ దేవతలను కించపరుస్తుంటే చేతులు ముడుచుకోవాలా?
– డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణ అభివ్రుద్ధి సాధ్యం
– ఈనెల 22న ‘‘ఇంటింటికీ బీజేపీ’’ పేరుతో జనంలోకి వెళ్లండి
– జూబ్లిహిల్స్ మోర్చాల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు

నరేంద్రమోదీ తనకు మంచి మిత్రుడంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కొట్టిపారేశారు. నరేంద్రమోదీ పేరు వింటేనే కేసీఆర్ గజగజ వణికిపోతాడని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేననే భావన కలిగించాలని, తద్వారా తెలంగాణలో పెరుగుతున్న బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీయాలన్నదే కేసీఆర్ వ్యూహమన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ను పెంచేందుకు కేసీఆర్ నానా తంటాలు పడుతున్నారని పేర్కొన్న బండి సంజయ్ కాంగ్రెస్ ఎప్పుడో చచ్చిపోయిందని, జాకీ పెట్టి లేపినా ఆ పార్టీ లేచే పరిస్థితి లేదని చెప్పారు.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ సంయుక్త మోర్చాల సమావేశానికి బండి సంజయ్ తోపాటు కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లంకల దీపక్ రెడ్డి సహా వివిధ మోర్చాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు….

నరేంద్రమోదీ 9 ఏళ్ల పాలనను పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘‘మహజన్ సంపర్క్ అభియాన్’’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గత 16 రోజులుగా తెలంగాణలో ఈ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. నిన్న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జేపీ నడ్డా ‘‘శభాష్’’ అంటూ అభినందించారు.

ఈనెల 22న ఉదయం 7 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కార్యకర్త పోలింగ్ బూత్ వారీగా ‘‘ఇంటింటికీ బీజేపీ’’ పేరుతో ప్రచారం నిర్వహించాలి.

నరేంద్రమోదీ మంచి దోస్త్ అని కేసీఆర్ కు చెబుతున్నడు. ‘‘నీకు, మోదీకి దోస్తీ ఎక్కడిది? నువ్వు 24 గంటలు తాగుతూనే ఉంటవ్? మోదీకి ఆ అలవాటే లేదు. దేశ ప్రజలే మోదీకి కుటుంబం, తెలంగాణ ప్రజల కంటే నీ కుటుంబమే నీకు ముఖ్యం.

అవినీతి మచ్చలేని గొప్ప వ్యక్తి నరేంద్రమోదీ. అవినీతి మరక అంటకుండా అభివ్రుద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందిస్తూ పారదర్శకంగా పాలిస్తున్న మహానేత నరేంద్రమోదీ . ఆయన కేబినెట్ లో ఒక్క మంత్రిపై కూడా అవినీతి మచ్చ లేదు.

మోదీ నిజంగా నీకు దోస్త్ అయితే… రాష్ట్రానికి అనేకసార్లు వచ్చారు. ఎందుకు కలవలేదు? ఢిల్లీకి అనేకసార్లు పోయినవ్ ఎందుకు కలవలేదు? నీతి అయోగ్ మీటింగ్ జరిగితే అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరైతే… కేసీఆర్ ఎందుకు హాజరు కాలేదు. ఎందుకంటే మోదీ పేరు వింటేనే కేసీఆర్ గజగజ వణుకుతడు. మోదీ వస్తేనే ఫాంహౌజ్ కు పారిపోయిన వ్యక్తి కేసీఆర్.

ఇప్పుడు ఎన్నికలు రావడంతో కేసీఆర్ జిమ్మిక్కులు చేయాలని చూస్తున్నడు. ఎందుకంటే మోదీ పాలనలో భారత్ 10వ స్థానం నుండి 5వ స్థానానికి చేరుకుంది. 2047 నాటికి నెంబర్ వన్ కాబోతోంది. దేశ ప్రజలకు 3 కోట్ల ఇండ్లు కట్టించారు. రాష్ట్రానికి 2.5 లక్షల ఇండ్లు ఇస్తే ప్రజలకు కట్టివ్వలేదు. దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది ఉచిత రేషన్ అందిస్తున్నాం. అంతేగాకుండా టాయిలెట్లు, స్మశానవాటికలుసహా రాష్ట్రంలో జరుగుతున్న అభివ్రుద్ధికి నిధులన్న కేంద్రమే ఇస్తోంది.

రాష్ట్రంలో అమలయ్యే ఏ సంక్షేమ పథకాన్ని కూడా మేం తీసివేయం. మరింత ఉపయోగపడేలా అమలు చేస్తాం. ధరణి పోర్టల్ కేసీఆర్ కుటుంబానికే ఉపయోగపడుతోంది. అందులోని లోపాలను సరిదిద్ది రైతులందరికీ నష్టం జరగకుండా చేస్తాం.

కేసీఆర్ వచ్చాక తెలంగాణ సర్వనాశనమైంది. చివరకు విద్యార్థులు కూడా చనిపోతున్నరు. గత రెండ్రోజుల్లో బాసర ట్రిపుల్ ఐటీలో ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకోవడం కలిచివేసింది. ట్రిపుల్ ఐటీలో అన్నీ సమస్యలే. మమ్ముల్ని గాలికొదిలేస్తారా? అంటూ విద్యార్థులంతా ధర్నాలు చేస్తే… వాళ్లను బెదిరిస్తున్నరు. కేసులు పెడుతున్నారు. వాళ్ల సమస్యలను పరిష్కరించకపోవడంవల్లే ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడింది. విద్యా సంస్థలను కూడా నిర్వహించలేని చేతగాని దద్దమ్మ సర్కార్ కేసీఆర్ దే. అవి ఆత్మహత్యలు కాదు… ప్రభుత్వం చేసిన హత్యలే..

ప్రభుత్వ హత్యలను కనుమరుగు చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నరు. ప్రభుత్వం తప్పిదం ఏమీ లేదని, ఆ అమ్మాయిలే ఆత్మహత్య చేసుకున్నారనే విధంగా కుటుంబ సభ్యులపై ఒత్తిడి చేస్తున్నారు.

కేసీఆర్.. 9 ఏళ్లలో నువ్వు చేసిందేమిటి? అభివ్రుద్ధిపై ఎందుకు మాట్లాడటం లేదు. నిత్యం మోదీని తిడుతూ ఇతర రాష్ట్రాలకు పోతూ టైం పాస్ పాలిటిక్స్ చేయడం తప్ప నువ్వు సాధించేదేమిటి?

ఏ సర్వేలు చూసినా బీజేపీకే అనుకూలమని చెబుతున్నాయి. కేసీఆర్ సర్వేలోనూ ఇదే వెల్లడైంది. అందుకే బీజేపీ నేతలు, కార్యకర్తలపై నిర్బంధాలు కొనసాగిస్తున్నడు. బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ గ్రాఫ్ ను పెంచేందుకు కేసీఆర్ ఈ జిమ్మిక్కులు చేస్తున్నడు. ప్రజలెవరూ నమ్మడం లేదు.
నేను హిందుత్వ మాట్లాడాలా? వద్దా? కొంతమంది వద్దుంటున్నారు. కర్నాటకలో బీజేపీ ఓడిపోతే ఏమైందో చూస్తూనే ఉన్నం కదా. అందుకే హిందుత్వ గురించి బరాబర్ మాట్లాడతాం. హిందు దేవతలను కించపరుస్తుంటే, సరస్వతి అమ్మవార్లను నగ్నంగా చిత్రీకరిస్తే మీరంతా ఎందుకు చేతులు ముడుచుకుని కూర్చున్నారు? ఎందుకు భయపడాలి?

80 శాతం హిందువులున్న భారత్ లో రామ మందిరం నిర్మించడానికే తో ఎంతో మంది చనిపోయారట అని అంటున్నారట. రాముడు అయోధ్యలో పుట్టారనడానికి ఆధారాలేమిటని కొందరు అడుగుతున్నరు. అట్లాంటోళ్లను నేను అడుగుతున్నా… మీరు మీ అమ్మ గర్భంలో నుండి వచ్చారనడానికి ఆధారమేంది?. కరసేవకుల త్యాగం స్పూర్తితో భవ్యమైన, దివ్యమైన రామ మందిరం నిర్మిస్తున్న మహనీయుడు నరేంద్రమోదీ.

ముస్లిం మహిళలపై జరుగుతున్న వేధింపులు, కుటుంబ నియంత్రణ లేకుండా చేయడంవంటి పరిణామాలవల్ల వాళ్లు పడుతున్న బాధలను చూసిన మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేసింది. సర్జికల్ స్ట్రయిక్స్ తో భారత దేశ సత్తా చాటారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రజలకు అవసరమైన సౌకర్యాలన్నీ కల్పిస్తున్న ఘనత మోదీదే. మోదీ పాలనలో ప్రశాంతంగా దేశం ఉంటే కాంగ్రెస్ తట్టుకోలేక మోదీపై అక్కసు వెళ్లగక్కుతున్నారు.

కేసీఆర్ పాలనలో రాష్ట్రం రూ.5 లక్షల కోట్ల అప్పులపాలైంది. పొరపాటున మళ్లీ అధికారమిస్తే మరో రూ.5 లక్షల కోట్ల అప్పు చేస్తడు. కేంద్రం ఇస్తున్న నిధులను దారి మళ్లిస్తున్నడు. మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వడం లేదు. అయినా తెలంగాణను అభివ్రుద్ధి కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో క్రుషి చేస్తోంది.

ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ…
ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వరకు బండి సంజయ్ ఎక్కడికి వెళ్లినా విపరీతమైన స్పందన లభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పెరిగింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది. ఎన్నికల నాటికి సీఆర్ఎస్ (కాంగ్రెస్ రాష్ట్ర సమితి) గా మారడం ఖాయం.

కేసీఆర్ పాలనకు 9 ఏళ్లు. మోదీ పాలనకు కూడా 9 ఏళ్లు. ఇద్దరి పాలనను బేరీజు వేయండి. దేశ ప్రజలే తన కుటుంబంగా భావిస్తూ అవినీతికి మచ్చలేని పాలన చేస్తున్న వ్యక్తి నరేంద్రమోదీ. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే వ్యక్తి మోదీ. కేసీఆర్ పాలన యావత్తు అవినీతి, కుటుంబ పాలనే ధ్యేయంగా పాలన కొనసాగుతోంది. కేసీఆర్ ది 60 పర్సంట్ కరప్షన్ సర్కార్.. కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదు.

ఈ విషయాన్ని ఒక్కో మోర్చా కార్యకర్త ప్రతిరోజు మూడు ఇళ్లకు వెళ్లి ప్రచారం చేయాలి. 2024 ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లు బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయం. నీళ్లు-నిధులు-నియామకాల నినాదానికి కేసీఆర్ నీళ్లొదిలారు… బీజేపీకి అవకాశమిస్తే… ‘‘నీళ్లు-నిధులు-నియామకాలు’’ నినాదాన్ని సాకారం చేసి తీరుతాం. అట్లాగే ప్రతి ఒక్కరు బీజేపీకి మద్దతు పలుకుతూ 9090902024 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వగానే మెసేజ్ వస్తుంది.

 

LEAVE A RESPONSE