– నిన్ను బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేరు
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్
ఈరోజు గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులపై విచక్షణారహితంగా పోలీసులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు అడుగుతోంది న్యాయంగా పరిహారం ఇవ్వమంటే లాఠీలతో, పైపులతో పోలీసుల ద్వారా కొట్టిస్తవా? కొట్టుకుంటూ…. నిర్వాసితులను పోలీసులను ఈడ్చుకుంటూ పోతారా? అసలు నిర్వాసితులు, ఆ గ్రామస్తులు చేసిన పాపమేంది? టీఆర్ఎస్ గూండాలను రైతులపైకి ఉసిగొల్పుతావా? ఇది ప్రజాస్వామ్యమా? నిరంకుశ రాజ్యమా?
కేసీఆర్ ప్రభుత్వం పగబట్టినట్లు వ్యవహరిస్తోంది. ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులకు చట్టపరంగా అందాల్సిన పరిహారం ఇవ్వకుండా వాళ్లపై దాడి చేయించడం దారుణం. మహిళలు, చిన్నపిల్లలు, వృద్దులని చూడకుండా గత 3 రోజులుగా వేటాడి వెంటాడి కొడతారా? మనం ఏ సమాజంలో బతుకుతున్నం?
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తావా?… చట్టాలను కాల రాస్తావా?.. నిన్నటి దాకా భూ నిర్వాసితులను దేవుళ్లన్నవ్.. త్యాగాలను మరవలేనన్నవ్… ప్రాజెక్టు ఉన్నంత కాలం భూ నిర్వాసితుల పేర్లను చిరస్థాయిగా ఉంటానన్న నీ మాటలేమమైనయ్..
సర్వస్వం త్యాగం చేసిన వాళ్లపై ఇంత కర్కశత్వమా? వెంటనే హుస్నాబాద్ గూడాటిపల్లె, హుస్నాబాద్ లో పోలీసు బలగాలను ఉపసంహరింపజేయాల్సిందే. లేనిపక్షంలో జరగబోయే తీవ్ర పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
కేసీఆర్ ఇగ నీ పతనం ఖాయమైపోయింది.. వినాశకాలే విపరీతబుద్ది… అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకోవడమే నీ నైజం. హుస్నాబాద్ నుండే నీ రాజకీయ సమాధి ఖాయమైంది. ఇగ నిన్ను బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేరు.. నిర్వాసితుల పక్షాన చట్ట, న్యాయ పోరాటం చేస్తాం. వారికి పూర్తి పరిహారం అందే వరకు అండగా ఉంటాం. పోలీసుల, టీఆరెస్ గూండాల దాడిలో గాయపడ్డ నిర్వాసితులను పరామర్శించేందుకు గౌరవెల్లి బయలుదేరి వెళుతున్న..