– గౌరీ దేవి పల్లి మిషన్ భగీరథ ప్లాంట్ ను సందర్శించి పరిశీలించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
గౌరీదేవిపల్లి : కేసీఆర్ మిషన్ భగీరథ పథకం దేశానికే తలమానికం. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతనే మంచినీటి ఎద్దడికి కారణం. వనపర్తి జిల్లా, రేవల్లి మండలం, గౌరీదేవి పల్లి దగ్గర ఉన్న మిషన్ భగీరథ ప్లాంటును సందర్శించి వేసవిలో మంచినీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
మంచినీటి ఎద్దడి రాకుండా కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది.
గౌరీదేవి పల్లి మిషన్ భగీరథ పథకం ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలలో 17 నియోజకవర్గాలకు వరప్రదాయినిగా నిలిచిందని కొనియాడారు. కె.ఎల్.ఐ పథకంలో అంతర్భాగమైన ఏలూరు రిజర్వాయర్ ద్వారా నీటిని పంపింగ్ చేసి శుద్ది చేసిన మంచినీటిని ప్రజలకు అందించామని అన్నారు. దీనికి సమాంతరంగా వనపర్తికి మంచి నీళ్లను అందించే స్కీమ్ కూడా ఇక్కడే ఉందని పేర్కొన్నారు.
దేశంలోనే ప్రతిష్ఠ తెచ్చుకున్న మిషన్ భగీరథ పథకానికి నిర్వహణ సామర్థ్యం లేక కరెంట్ కోతలతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ సమర్థత వల్ల వనపర్తి జిల్లా కేంద్రంలో మరియు పలుచోట్ల నీటి ఎద్దడి ఏర్పడి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొత్త పథకాలు అమలు చేయలేకపోయినా.. గతంలో ఉన్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు.