కొడుకు పేరు అజయ్ రావు
టిక్కెట్ కోసం కేటిఆర్ పేరు పెట్టాడు
రామరాజ్యం రావాలి. మోదీ రాజ్యం రావాలి
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్
ఉద్యమాల గడ్డ ఖమ్మం. చైతన్యం, పౌరుషం కలిగిన గడ్డ ఈ ఖమ్మం గడ్డ. కేసీఆర్ దొంగ దీక్షను బయటపెట్టిన చరిత్ర మీ ఖమ్మం ప్రజలది.
కేసీఆర్ పేరు దుబాయ్ శేఖర్..పేదలను దుబాయ్ తీసుకపోతనని చెప్పి మోసం చేసిన వ్యక్తి కేసీఆర్. దుబాయ్ అని బొంబాయి తీసుకుని పోయిన కేసీఆర్. కొడుకు పేరు అజయ్ రావు… టిక్కెట్ కోసం కేటిఆర్ పేరు పెట్టాడు. కొడుకు పేరును మార్చి కల్వకుంట్ల తారక రామారావు అని చెప్పి నాటకాలు ఆడే మనిషి కేసీఆర్. మోసం చేయడం బాగా తెలిసిన కేసీఆర్. ఎన్నికలు వస్తే దళిత బంధు, రుణ మాఫీ గుర్తుకు వస్తుంది. ఒక పెగ్గు వేస్తాడు దళిత బంధు…రెండు పెగ్గులు వేస్తే డబుల్ బెడ్ రూం అంటాడు. మూడు పెగ్గులు వేస్తే రుణ మాఫీ అంటాడు.
ఎన్నికలు వస్తేనే.. పేదోళ్లకు ఇండ్లు, రైతులకు రుణమాఫీ, ఉద్యోగాలు గుర్తొస్తయ్. అందుకే మీరంతా ఆలోచన చేయాలె. నరేంద్ర మోదీ నేతృత్వంలో అమిత్ షా మార్గదర్శకత్వంలో బీజేపీ అధికారంలోకి రావాలి.. రామరాజ్యం రావాలి. మోదీ రాజ్యం రావాలి. ఇందుకోసం మీరంతా సహకరించాలి.