Suryaa.co.in

Telangana

బియ్యం అమ్మకం ద్వారా రూ. 4 వేల కోట్ల మేర కమీషన్ దండుకోవాలని కేసీఆర్ ప్లాన్

– కార్పొరేట్ కంపెనీలకు కిలో 4, 5 రూపాయలకి తక్కువకి అమ్మాలని సీఎం కేసీఆర్ డిసైడ్
-పౌరసరఫరాల శాఖ నిర్ణయించిన విధివిధానాలతో రైస్ మిల్లర్లకు అన్యాయం
– నిబంధనలతో రాష్ట్రంలో రైస్ మిల్లర్లు బియ్యం ఆక్షన్ లో కొనలేరు
-ఈ 4 వేల కోట్ల అవినీతి సొమ్ము 100 నియోజకవర్గాల్లో సుమారు రూ.40 కోట్లు ఖర్చు
– వడ్ల అమ్మకానికి నిర్వహించే వేలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.4 వేల కోట్ల అవినీతి
– బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి

ఎన్నికల నిధుల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం బియ్యం అమ్మకానికి పెట్టి.. కస్టమ్ మిల్లర్ల నోట్లో మట్టి కొట్టే పని చేశారని అర్వింద్ ధర్మపురి వ్యాఖ్యానించారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు కిలో 4, 5 రూపాయలకి తక్కువకి అమ్మాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారని తెలిపారు.

ఈ బియ్యం అమ్మకం ద్వారా రూ. 4 వేల కోట్ల మేర కమీషన్ దండుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్ , సంగప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో అర్వింద్ ధర్మపురి మాట్లాడిన ముఖ్యాంశాలు….

ఎన్నికల్లో డబ్బు కోసమే కేసీఆర్ ప్రభుత్వం బియ్యం అమ్ముకుంటామని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.కిలో 5 నుంచి 6 రూపాయలు తక్కువకు పెద్ద పెద్ద వ్యాపారులకు అమ్మేందుకు కల్వకుంట్ల కుటుంబ సభ్యులు ఒప్పందం చేసుకున్నారు. కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) కోసం ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని వేలం వేసేందుకు అనేక నిబంధనలు పెట్టింది.

వెయ్యికోట్ల టర్నోవర్ ఉండాలంట… రూ. 100 కోట్ల ప్రాఫిట్ ఉండాలనే నిబంధనలు పెట్టారు.మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వేలం వేయాలని నిర్ణయించింది. అయితే టెండర్‌లో పాల్గొనేందుకు పౌరసరఫరాల శాఖ నిర్ణయించిన విధివిధానాలతో రైస్ మిల్లర్లకు అన్యాయం చేస్తున్నారు.

ఎం ఎస్ పీ ధరకు బియ్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలో మిల్లర్లు సిద్దంగా ఉన్నారు.కానీ, టెండర్ల ద్వారా తమ మిల్లు సామర్థ్యం మేరకు, ధాన్యం దక్కించుకుందామనుకున్న మధ్యతరగతి మిల్లర్లకు అసలు అందులో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలతో రాష్ట్రంలో రైస్ మిల్లర్లు బియ్యం ఆక్షన్ లో కొనలేరు.

తెలంగాణలో సుమారు రెండున్నర వేలమంది ఉన్నరు. వారందరి నోట్లో మట్టికొట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రైస్ మిల్లర్లు వ్యాపారం బంద్ అయితే రైతులు రోడ్డుమీద పరిస్థితి నెలకొంది.మిల్లులను అప్ గ్రేడ్ చేసుకోమని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో చెప్పింది. వడ్ల అమ్మకానికి నిర్వహించే వేలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.4 వేల కోట్ల అవినీతికి పాల్పడుతోంది.

ఈ 4 వేల కోట్ల అవినీతి సొమ్ము 100 నియోజకవర్గాల్లో సుమారు రూ.40 కోట్లు ఖర్చు చేసి వచ్చే ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్‌‌‌‌ కుట్ర చేస్తున్నడు.రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం.. ఒక్క ఆక్షన్ కి రూ. 1000 కోట్ల స్కాం.. కోటి టన్నులు అమ్ముకునే ప్రణాళిక బీఆర్ఎస్ సర్కారుది.మంత్రి కేటీఆర్ డైరెక్షన్ లోనే బ్లాక్ మార్కెట్ దందాను పెంచుకోవడానికి కుట్ర చేస్తున్నరు.గద్దె మీద రాబంధులు అమ్ముకుంటున్నరు బియ్యం.. గాదె కింద పందికొక్కులే కల్వకుంట్ల వారికంటే నయం.

పంట కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం సుతిల్ నుంచి మార్కెటింగ్ వరకు నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో చాలాచోట్ల ధాన్యం తడిసి ముద్దయింది.వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా రాష్ట్ర సర్కారు కనీసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు.

ఎఫ్ సీఐకి గోదాంలు సరిపోవట్లేదని అబద్ధాలు చెప్తున్నరు. ఎఫ్ సీఐ 7 లక్షల మెట్రిక్ టన్నుల స్టోరేజీ కోసం అద్దె తీసుకుంటున్నమని ముందే చెప్పింది. అయినా బీఆర్ఎస్ సర్కారు ధాన్యం కొనుగోలు చేయలేదు.

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కారణంగానే వర్షాలకు ధాన్యం తడిసిపోయింది.లిక్కర్ స్కాం లు, డబ్బు లు దండుకోవడం తప్ప బీఆర్ఎస్ సర్కారు చేసిందేమీ లేదు.ఇటీవల ముక్కపంట వేయొద్దని ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెప్పింది. మరోవైపు షార్టేజ్ కారణంగా అవే ముక్కలను ఇంపోర్ట్ చేసుకోవాలని ఆ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి లోక్ సభలో చెప్పిండు.

గతంలో మరి వేస్తే ఉరేనని బెదిరించి.. రైతులను ముంచిండు. మక్క పంట బంద్ చేయించిండు. చెరుకు ఫ్యాక్టరీలను మూతపడేలా చేసిండు.మరోసారి కేసీఆర్ గెలిస్తే వ్యవసాయం బంద్ పెట్టుకోవాల్సిందే. అందుకే, మన రైస్ మిల్లర్లను, వ్యవసాయాన్ని, రైతులను కాపాడుకోవాలి.

మరోసారి కాంగ్రెస్ తమను తాము బీఆర్ఎస్ పార్టీకి తాకట్టు పెట్టుకుంటోంది: బిజెపి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్

తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక మరోసారి ఆత్మవంచనకు సిద్ధమైంది కాంగ్రెస్. మరోసారి తమను తాము బీఆర్ఎస్ పార్టీకి తాకట్టు పెట్టుకుంటోంది. బీఆర్ఎస్ పార్టీతో డీల్ చేసుకుని ముందుకెళ్తుండటమే ఇందుకు నిదర్శనం.తెలంగాణలో తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న బీఆర్ఎస్ అనైతికంగా, కుయుక్తులతో, విలువలను పాతరేసి రాజకీయ వ్యాపారానికి తెరలేపింది.

తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాయి కాబట్టే ఈ రెండు పార్టీలకు మజ్లిస్ పార్టీ మధ్యవర్తిత్వం వహిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్లు అవుతుందని ప్రజలకు అర్థమైంది.

ఈ విషయంలో నష్ట నివారణ కోసం, ఉపశమన చర్యల్లో భాగంగా.. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు.. చెవేళ్ల సభలో పూర్తి అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు విఫలయత్నం చేశారు.

కాంగ్రెసోళ్లు మనవాళ్ళే.. వాళ్ళను దయచేసి ఏమీ అనకండి, త్వరలో కాంగ్రెస్ వాళ్ళు మన పార్టీలోకి వస్తరు అని బాల్క సుమన్ వ్యాఖ్యలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓకే తాను ముక్కలని స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ అంతర్గతంగా అవగాహన కుదుర్చుకున్నాయనడానికి వీరి మాటలు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి.

ఎమ్మెల్యేలు కుక్క‌లని. ప్ర‌తిపక్షాల‌కు చెందిన వాళ్ల‌ను మ‌న పార్టీలోకి తీసుకుంటే ఇక ప్ర‌తిప‌క్షం అన్న‌ది ఉండ‌ద‌ని, దీని వ‌ల్ల బీఆర్ఎస్ పార్టీకి మేలు చేకూరుతుంద‌ని. ఇత‌ర పార్టీలో ఉంటే మ‌న‌ల్ని టార్గెట్ చేస్తార‌ని, అదే ఆ కుక్క‌ల్ని మ‌న ఇంట్లో క‌ట్టి ప‌డేస్తే మ‌న వ‌ద్ద‌నే ఉంటార‌ని పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలంగాణ ప్రజలకు ఇట్టే అర్థమైపోతుంది.

కేటీఆర్ ఇటీవల తన ప్రసంగంలో మాట్లాడుతూ బీజేపీని ఓడించడానికి బీజేపీ వ్యతిరేక కూటమితో కలిసి పోరాడుతామని, సంకీర్ణ ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషిస్తామని స్పష్టం చేశారు. మీ రెండు పార్టీల మధ్యనున్న అవగాహనకు ఇదొక ఉదాహరణ కాదా? ఎన్నికలు పూర్తయిన మరుక్షణం.. బహిరంగంగానే.. దోస్తీని ప్రదర్శించాలని ఈ రెండు పార్టీలు ఉవ్విళ్లూరడం లేదా?

బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలన్నీ ఒకేగూటి పక్షలే. బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు సయామిక్ ట్విన్స్ లాంటివి. కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి నువ్వు కొట్టినట్లు చెయ్.. నేను ఏడ్చినట్లు చేస్తా అనే అవగాహనతో కూడిన ఒప్పందంతో మరోసారి ప్రజలను మోసం చేయాలనుకుంటున్న వారి ఆటలు సాగవు. ప్రజలు గట్టి గుణపాఠం చెప్పి.. భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు నిర్ణయించుకున్నారు.

LEAVE A RESPONSE