Suryaa.co.in

National

ఇంట్లో విల్లు, బాణాలు ఉంచుకోండి..

– జిహాద్ కు గుంపు వస్తే.. కాపాడేందుకు పోలీసులు రారు
– భాజపా ఎంపీ సాక్షి మహారాజ్

హిందువులు అందరూ తమ ఇళ్లలో విల్లు, బాణాలు ఉంచుకోవాలని భాజపా ఎంపీ (ఉన్నావ్) సాక్షి మహారాజ్ కోరారు. జిహాద్ కు పాల్పడేందుకు భారీ గుంపు వస్తే కాపాడేందుకు పోలీసులు సైతం రారని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఫేస్బుక్ లో ఆదివారం ఓ పోస్ట్ పెట్టారు. కర్రలతో పరిగెత్తుకుంటూ వస్తున్న భారీ జన సమూహం చిత్రాన్ని ఉంచారు. “ఒక వేళ ఉన్నట్టుండి ఈ మూక మీ వీధికి లేదా ఇంటికి వస్తే.. అప్పుడు మిమ్మల్ని మీరు కాపా డుకునేందుకు ఏదైనా మార్గం ఉందా? లేకుంటే ఏదో ఒకటి ఏర్పాటు చేసుకోండి. మిమ్మల్ని కాపాడేందుకు పోలీసులు రారు. రక్షణ కోసం వాళ్లు కూడా ఎక్కడో ఒకచోట దాక్కుంటారు” అని పోస్ట్లో సాక్షి మహారాజ్ పేర్కొన్నారు. “ఈ మూక జిహాద్ కు పాల్పడి వెళ్లిపోయాక మాత్రమే పోలీసులు వస్తారు. విషయం విచారణ కమిటీకి చేరుతుంది. అనంతరం కొంతకాలానికి ముగుస్తుంది. కాబట్టి ఇలాంటి అతిథుల కోసం.. ప్రతి ఇంట్లో కొన్ని పెట్టెల శీతల పానీయం సీసాలు, నిజమైన విల్లు, కొన్ని బాణాలు ఉంచుకోవాలి. జైశ్రీరామ్” అని తెలిపారు.
Sakshi-Maharaj-face-book-post

LEAVE A RESPONSE