– తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు వస్తుంది
– బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దాతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు భేటీ
ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా తో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబట్టిందని వివరించగా.. జాతీయ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగి అధికారంలోకి రావడం జరుగుతుందని, దానికోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు సమిష్టిగా పని చేయాలని ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని నడ్డా చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గణనీయంగా సర్పంచులు వార్డ్ మెంబర్లు గెలవడం పట్ల అభినందనలు తెలియజేశారు. కార్యకర్తలు కష్టపడి పనిచేసి పార్టీ విజయానికి కృషి చేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నాయని ప్రజల్లోకి వెళ్లాలని ప్రజా సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు.
బిఆర్ఎస్ కుటుంబ కలహాలు ప్రజల్లో నమ్మకం కోల్పోయింది అని, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు రాష్ట్రంలో బిజెపి వైపు ప్రజలు చూస్తున్నారు. రాజకీయపరమైన పార్టీ సంస్థాగత విషయాలపై చర్చించారు.