ఢల్లీ లిక్కర్ లాబీయింగ్ కేసు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. యేడాది కాలంగా లిక్కర్ కుంభకోణంలో దేశంలో కీలక పార్టీల ప్రమేయం ఉన్నట్లు వెలుగుచూడగా యేడాది తిరక్క మునుపే తెలంగాణ బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత అరెస్టు మరువక ముందే ఏకంగా ఢల్లీ ముఖ్యమంత్రినే అరెస్టు చేయడంలో దేశంలో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. ఈ సంఘటనపై బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజని బిఆర్‌ఎస్ పార్టీ మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని నామ రూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో కేంద్రంలోని అధికార బీజేపీ వ్యవహరిస్తోందన్నారు. ఇటీవల జరిగిన జార్కండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఘటనలు రుజువు చేస్తున్నాయన్నారు. ఇందుకోసం ఈడీ, సీబీఐ, ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం పావులుగా
వాడుకుంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా పరిణమిస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వ చర్యలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపిత అరెస్ట్‌గా అభివర్ణించారు. అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకొని, అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.