టీడీపీకి సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లా శాఖ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం విజయవాడలో జరిగింది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జిల్లాలో పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. అంతేకాకుండా నేతల మధ్య కొనసాగుతున్న విభేదాల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపైనా ఈ సమావేశంలో కీలక చర్చ జరిగింది.
ఇదిలా ఉంటే… ఇటీవలే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో జరిగిన జిల్లా నేతల సమావేశానికి విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని హాజరు కాని విషయం తెలిసిందే. నాడు ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఆయన ఆ సమావేశానికి హాజరు కాలేదు. తాజాగా మంగళవారం నాటి సమావేశానికి కూడా అదే కారణంతో కేశినేని నాని గైర్హాజరయ్యారు.