సూర్యాపేట పట్టణంలోని 36 వ వార్డు బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు యార్లగడ్డ రామారావు, పట్టణ ఇంజనీరింగ్ అసోసియేషన్ ట్రెజరరీ బహురోజు నాగేశ్వరచారి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు పట్టణ కేంద్రంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది..
టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగింది.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, నిరుద్యోగ భృతి , లక్ష రూపాయల రుణమాఫీ, కేజీ టు పీజీ ఉచిత విద్య ఇలాంటి కీలకమైన హామీలు ఎన్నో ఇచ్చి రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేయడం జరిగింది… సూర్యాపేటలో ప్రతి పనిలో వాటాలు తీసుకునే నాయకునికి నియోజకవర్గ ప్రజలు టాటా చెప్పడానికి సిద్ధమయ్యారు.
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్ , పట్టణ అధ్యక్షులు Md. Abid, జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర , జిల్లా నాయకులు తుక్కని మన్మధ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పలస Malsoor గౌడ్, జిల్లా నాయకులు ఆరూరి శివ , వెన్న శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు