Suryaa.co.in

Telangana

ఖబడ్దార్ కేసీఆర్..

-బీఆర్ఎస్ పార్టీని ‘ఫాంహౌజ్ అరెస్టు’ చేసే సమయం ఆసన్నమైంది
– కుటుంబ, అవినీతి సర్కారుకు వ్యతిరేకంగా మా పోరాటం మరింత ఉధృతం చేస్తామన్న తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి
– కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే.. అందుకే హస్తం పార్టీకి విలువైన స్థలం పార్టీ భవనం కోసం ఇచ్చింది
– తెలంగాణకు మేం ఏం చేశామో.. 3 గంటలపాటు ప్రజంటేషన్ ఇచ్చాం.. ఇప్పటి వరకు దానిపై సమాధానం లేదు
– కార్యకర్త స్థాయినుంచి.. ఇవాళ కేంద్రమంత్రిగా, 4వసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ తనకు అవకాశం కల్పించిందన్న కిషన్ రెడ్డి
– వెయ్యిమంది కేసీఆర్ లు, లక్షమంది ఒవైసీలు వచ్చినా.. వేలాది మంది రాహుల్ గాంధీలు కలిసివచ్చినా.. మోదీని ఢీకొట్టలేరు, బీజేపీని ఓడించలేరని వెల్లడి
– తెలంగాణలో జన ప్రభంజనం రానుంది. నిశ్శబ్ధ విప్లవం వస్తుంది. ఇందులో బీఆర్ఎస్, కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయమన్న కేంద్రమంత్రి
– ఆట మొదలైంది.. BRSను ఓడించాలని తెలంగాణ ప్రజలు ఫిక్స్ అయ్యారు
– అమరవీరుల ఆకాంక్షలను ప్రతిబింబించే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటే మా లక్ష్యం
– సిద్ధాంతం, దేశం కోసం పనిచేసే పార్టీ అందుకేు ప్రజలనుంచి మద్దతు ఏటేటా పెరుగుతోందన్న కిషన్ రెడ్డి

రజాకార్లను తరిమిన తెలంగాణ గడ్డఇది, నీ డబ్బు, అధికారం, పోలీసులు మా పోరాటాన్ని అపలేవు.బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అబిడ్స్ చౌరస్థాలో పాతరేసే వరకు నిద్రపోయేది లేదు.డబుల్ ఇండ్లపై అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిస్తున్నం.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ సందర్భంగా కేసీఆర్ సర్కారుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.1980లో విద్యార్థిగా ఉంటూ.. ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు బీజేపీ ఊహించలేని అవకాశాలు ఇచ్చింది..కష్టపడి పనిచేస్తే బీజేపీలో ఏదో ఒక రోజు తప్పకుండా అవకాశాలు వస్తాయి.ప్రజా సమస్యలపై ఎన్నిసార్లు అరెస్ట్ అయి.. జైళ్లకు వెళ్లినా.. అలిసిపోలేదు..మోడీ నాయకత్వాన్ని ప్రపంచం కోరుకుంటున్నది. ప్రతి కార్యకర్త అందుకు గర్వపడి, విశ్వాసంతో ముందుకు వెళ్లాల్సి ఉన్నది.

అవినీతికి వ్యతిరేకంగా, కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తున్నం.1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకొని, యావత్త తెలంగాణ పోరాడితే వచ్చిన తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం చేతిలోకి వెళ్లింది.నేను, నా తర్వాత నా కొడుకు, నా కొడుకు తర్వాత నా మనవడు రాజులుగా ఉంటారు..మీరెప్పుడూ బానిసలుగానే ఉండాలన్నట్లు చూస్తున్నారు.

యుద్ధం ప్రారంభమైంది.బాటసింగారంలో డబుల్ ఇండ్ల పరిశీలనకు వెళ్తాం అంటే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. హౌస్ అరెస్ట్ సంస్కృతి దేశంలో ఎక్కడా లేదు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను బీఆర్ఎస్ సర్కారు కాలరాస్తున్నది.మేము అందరం పోరాటాలు చేస్తేనే.. నువ్వు కుర్చీలో కూర్చున్నావ్ కేసీఆర్.పార్లమెంట్లో మా ఎంపీలు మద్దతు ఇస్తే.. నువ్వు ఖుర్చీలో కూర్చున్నవ్.

కేసీఆర్ కుటుంబాన్ని ఫామ్హౌజ్లో అరెస్ట్ చేయాల్సిన సమయం వచ్చింది. నా దగ్గర అధికారం, డబ్బు, పోలీసులు ఉన్నయని కేసీఆర్ అనుకుంటుండొచ్చు.. ఖబడ్దార్ కేసీఆర్.. రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర తెలంగాణది. ఆ విషయం మరిచిపోవద్దు. మేము మీకు, మీ కుటుంబానికి బానిసం కాదు..వేల కోట్ల రూపాయల దోపిడీ చేస్తే.. ఎవరూ మాట్లాడొద్దా?

పేదలకు ఇండ్లు ఇస్తానని ఇవ్వకుంటే.. మేం మాట్లాడొద్దా?దళితులకు మూడెకరాలు, కేజీ టు పీజీ ఏమైంది? పక్క రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు కడితే కేసీఆర్కు సోయి లేదు. కేసీఆర్కు మాత్రం.. నిజాం లెక్క భవనం కట్టుకొని బాత్రూంకు బుల్లెట్ ఫ్రూఫ్ అద్దాలు పెట్టుకున్నాడు.

బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని.. కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు పదెకరాల భూమి బీఆర్ఎస్ ఎందుకు ఇచ్చింది? రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన బిడ్డను అభ్యర్థిగా పెడితే.. కేసీఆర్ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు. మేము కాంగ్రెస్, బీఆర్ఎస్తో ఎప్పుడూ కలవలేదు.. భవిష్యత్లో కలువం. మా పోరాటం ఎప్పుడూ అవినీతి, కుటుంబ పార్టీలపైనే..

తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందనే దానిపై మూడు గంటల పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే.. దానికి ఇప్పటి వరకు సమాధానం లేదు. నేను కార్యకర్తలను కోరుతున్నా.. అడుగడుగునా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవాలి, నిలదీయాలి.1200 మంది అమరవీరుల కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం కోసం కృషి చేస్తున్నాం.

ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీల్లో దేనికి ఓటేసినా.. మూడు ముక్కల పార్టీకి వేసినట్లే. ప్రపంచంలో అతిపెద్ద పార్టీ బీజేపీ.లక్ష మంది అసదుద్దీన్ ఓవైసీలు, లక్ష మంది కేసీఆర్లు, లక్షమంది రాహుల్ గాంధీలు వచ్చినా.. 2024లో మోడీ నేతృత్వంలోని బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరు.ఈ దేశ ప్రజలు మోడీ లాంటి సమర్థనాయకత్వం కోరుకుంటున్నారు.

గతంలో ఎవరూ స్థిరంగా ప్రధానిగా లేరు.. కానీ ఇప్పుడు మోడీ నాయకత్వాన్ని ప్రపంచం కోరుకుంటున్నది.
తెలంగాణలో ఒక నిశ్శబ్ద విప్లవం రాబోతున్నది.. ఒక తుఫాను రాబోతున్నది. అది బీజేపీకి అనుకూలంగా రాబోతున్నది. సింహం ఒక అడుగు ముందుకు వేసే ముందు… రెండు అడుగులు వెనక్కి వేస్తుంది.

తెలంగాణలో బీజేపీ కూడా అంతే.. తెలంగాణలో అనేక ఏండ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఆ పార్టీ చేయని అవినీతి, కుట్ర లేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో ఇసుక, ల్యాండ్, లిక్కర్ సహా అన్ని మాఫియాలే. ఇప్పుడు రాష్ట్రంలో రావాల్సింది బీజేపీ ప్రభుత్వమే.

అధికారమును అడ్డుపెట్టుకొని రాష్ట్రాన్ని శాసించడం దేశానికి ఆదర్శమా కేసీఆర్ గారు?
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. గిరిజనులకు రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అందేలా చూస్తాం. మతపరమైన రిజర్వేషన్లను కచ్చితంగా రద్దు చేస్తాం. ఎంఐఎం మెప్పు, మోచేతి నీళ్ల కోసం మతపరమైన రిజర్వేషన్లను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రి వరదల పాలైంది.. ఇపుడు అక్కడ కుర్చీ వేసుకొని కూర్చో కేసీఆర్.తొమ్మిదేండ్లలో యూనివర్సిటీలు కళావిహీనంగా మారాయి.డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం రానున్న రోజుల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా చేయాల్సిన అవసరం ఉన్నది.

ఈ నెల 24వ తేదీన డబుల్ ఇండ్ల కోసం ధర్నాకు పిలుపునిస్తున్నం. 25న ఇందిరాపార్కులో పెద్ద ఎత్తున నిరసన చేపడుతాం. 2018 నుంచి కొత్త పెన్షన్లు రాలేదు.. పెన్షన్లు ఇచ్చే వరకు బీజేపీ పోరాటం చేస్తుంది. తొమ్మిదేండ్లుగా రేషన్కార్డులు ఇచ్చే సోయి లేదు.. సీఎం కేసీఆర్కు. ఇది దేశానికి ఆదర్శమా.?ముఖ్యమంత్రిని చేస్తానని దళితులను మోసం చేసింది దేశానికి ఆదర్శమా? తొమ్మిదేండ్లుగా గిరిజనులకు అన్యాయం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ.. 100 రోజుల్లో ప్రతి రోజూ ప్రజల పక్షాన మేము నిలబడి వారి మద్దతు కూడగడుతాం. నేను అధ్యక్షుడిని మాత్రమే.. అందరం కలిసి పోరాటం చేద్దాం..రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అబిడ్స్ చౌరస్థాలో పాతరేసే వరకు నిద్రపోయేది లేదు.

LEAVE A RESPONSE