-కాపుల గొంతు కోసిన జగన్ రెడ్డికి ఊడిగం చేస్తున్న వైసీపీ కాపు నేతలు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు
అధికారంలోకి వచ్చిన నాటి నుండి కాపుల్ని అణచివేయడమే లక్ష్యంగా అడుగులు వేసిన జగన్ రెడ్డికి.. వైసీపీలోని కాపు నేతలు ఊడిగం చేయడం సిగ్గుచేటు. మూడున్నరేళ్ల పాలనలో కాపుల కోసం జగన్ రెడ్డి ఏం చేశారో చెప్పే ధైర్యముందా? వంగవీటి రంగాను హత్య చేయడం తప్పు లేదని వ్యాఖ్యలు చేసిన గౌతంరెడ్డికి ఫైబర్‌నెట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పోస్టింగ్ ఇచ్చారు.
రంగా హత్య కేసులో దేవినేని నెహ్రూకు సంబంధం ఉందని చెప్పి ఆయన కొడుకు దేవినేని అవినాష్‌ను పార్టీలో చేర్చుకున్నారు. స్వాతంత్య్రానికి ముందు నుండీ.. రాజంపేట ఎంపీ టికెట్‌ను బలిజలకు ఇస్తే… జగన్‌రెడ్డి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి ఇచ్చారు. మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడిపై బాంబు దాడులు చేయించారు. కోనసీమ, విశాఖ, చిత్తూరు జిల్లాలలో కాపులు, బలిజలపై అక్రమ కేసులు పెట్టించి వేధించారు. తిరుపతిలో చిరంజీవి బస చేసిన హోటల్ పై దాడి చేయించారు. తునిలో రైలు దగ్ధం చేసి.. కాపు యువతను ఇరికించారు. ఇన్ని రకాలుగా కాపుల్ని అవమానించిన జగన్ రెడ్డికి.. వైసీపీలో ఉన్న కాపు నేతలు సన్మానాలు చేయడం ఊడిగం చేయడమే.
చంద్రబాబు నాయుడు విద్య, ఉద్యోగాల్లో కాపులకిచ్చిన 5శాతం రిజర్వేషన్లు జగన రెడ్డి ఎత్తేస్తే.. నోరెత్తలేదు. చంద్రబాబు నాయుడు హయాంలో కాపుల్లోని పేద విద్యార్ధులకు విదేశీ విద్య అందిస్తే.. జగన్ రెడ్డి మొత్తాన్ని నాశనం చేశాడు. కాపు కార్పొరేషన్ ద్వారా ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు రూ.3వేల కోట్లు రుణాలుగా అందిస్తే.. జగన్ రెడ్డి మొత్తం వ్యవస్థను నిలిపివేశాడు. యువతకు స్వయం ఉపాధిని దూరం చేశాడు. ఇప్పుడు.. రాజకీయ లబ్ది కోసం కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నాడు.
అలాంటి దుర్మార్గమైన జగన్ రెడ్డిని వైసీపీలోని కాపు నేతలు వెనకేసుకురావడం, పొగడ్తలతో ముంచెత్తడం సిగ్గుచేటు. ఇప్పటికైనా వైసీపీలోని కాపు నేతలు కళ్లు తెరవండి. తడిగుడ్డతో కాపుల గొంతు కోస్తున్న జగన్ రెడ్డిని తాడేపల్లి కొంప పునాదులు బద్దలయ్యేలా.. కాపు ద్రోహంపై నిలదీద్దాం.