– బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో పత్తా లేరు
– మోదీ అంటే భయమా! భక్తా!?
– యూరియా కొరతపై ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీల నిరసనలో పాల్గొనని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలపై క్స్ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ట్వీట్
హైదరాబాద్: రాష్ట్ర రైతాంగానికి అవసరం మేరకు యూరియా సరఫరా చేయకుండా నిర్లక్ష్య, వివక్ష పూరిత వైఖరి ప్రదర్శిస్తోన్న మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని, మోసపూరిత వైఖరిని ఎండగడుతూ…తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో గొంతు కలిపి … పార్లమెంట్ వేదికగా తెలంగాణ రైతుల పక్షాన నిలిచిన ప్రియాంక గాంధీ కి హృదయపూర్వక ధన్యవాదాలు.
రాష్ట్ర రైతాంగ అవసరాల మేరకు యూరియా సరఫరా చేయాలని మేం లేఖల రూపంలో, విజ్ఞప్తుల రూపంలో పదే పదే కోరినా కేంద్రం స్పందించకపోవడం దారుణం.
రాష్ట్ర రైతాంగానికి అండగా నిలవాల్సిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మోదీ భజనలో బిజీగా ఉన్నారు. మన రైతుల కోసం మోదీ సర్కారు పై వత్తిడి తెచ్చేందుకు, మాతో కలిసి రావాల్సిన బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో పత్తా లేరు. గల్లీలో లొల్లి చేయడానికి ఉత్సాహం చూపే వాళ్లు… ఢిల్లీలో మోదీని ప్రశ్నించడానికి ఎందుకు భయపడుతున్నారు!? మోదీ అంటే భయమా! భక్తా!?