Suryaa.co.in

National

సివిల్స్ కోచింగ్ విద్యార్థిని మృతిపై కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి

– మృతురాలు తండ్రికి కేంద్రమంత్రి ఫోన్ లో పరామర్శ

ఢిల్లీ: రాజేంద్రనగర్ లోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్‌లో వరదల కారణంగా సికింద్రాబాద్‌కు చెందిన తానియా సోని అనే 25 ఏళ్ల యువతి మృతిచెందిన ఘటనపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తానియా సోని తండ్రి విజయ్ కుమార్‌ను కిషన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భౌతికకాయం వీలైనంత త్వరగా కుటుంబసభ్యులకు అప్పగించేందుకు సంపూర్ణంగా సహకరిస్తామని తెలియజేశారు. ఢిల్లీ పోలీసులు, ఇతర అధికారులతో మాట్లాడి.. పెండింగ్లో ఉన్న అన్ని ఫార్మాలిటీస్ ను త్వరగా పూర్తిచేయడంలో చొరవతీసుకోవాలని ఢిల్లీలోని తన కార్యాలయాన్ని కిషన్ రెడ్డి ఆదేశించారు.

 

LEAVE A RESPONSE