విజయవాడ:: గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో ఉన్న కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీ విధ్యార్దులు రూపొందించిన కెఎల్ శాట్ 2 ను నింగిలోకి పంపేందుకు గాను ప్రతిష్టాత్మక కార్యక్రమానికి తెరతీసిన కెఎల్ యూనివర్శిటికి చేరుకున్న ఆంధ్రప్రధేశ్ శాసన సభ ఉప సభాపతి కనుమూరి రఘు రామ కృష్ణం రాజు ని కెఎల్ ఇఎఫ్ చైర్మన్ కోనేరు సత్యనారాయణ దుశ్శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఆయనకు పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా కెఎల్ ఇఎఫ్ చైర్మన్ కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ.. తమ విద్యార్దుల ప్రతిభను వీక్షించేందుకు విచ్చేసిన ఉపసభాపతికి ధన్యవాదాలు తెలిపారు