Suryaa.co.in

Andhra Pradesh

కొడాలి నాని ఓ పేకాట బ్రోకర్.. రాజకీయాల్లో జోకర్

– టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్య ప్రకాష్

కొడాలి నాని ఓ పేకాట బ్రోకర్ అని.. రాజకీయాల్లో జోకర్ లాంటివాడని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మద్ది పట్ల సూర్య ప్రకాష్ పేర్కొన్నారు. పత్తికొండ నియోజకవర్గం యువగళం క్యాంప్ సైట్ నుండి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

గుడివాడ ప్రజలకు క్యాషియోను పరిచయం చేసిన వ్యక్తి కొడాలి నాని. కొడాలి నాని లాంటి పనికిరాని వ్యక్తులు దేశంలోనే ఉండరు. కొడాలి నానికి రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీ పెట్టిన బిక్ష. కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుడివాడలో అనేక టిడ్కో ఇళ్లను, పేదలకు పక్కా గృహాలను నిర్మించి ఇచ్చింది. కొడాలి నాని అధికారంలోకి వచ్చాక ఒక్క ఇల్లైనా పూర్తి చేశారా? గుడివాడలో కొడాలి నాని దుర్మార్గాలు అధికమయ్యాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. కొడాలి నాని రాష్ట్రానికి పట్టిన ఒక చీడపురుగు లాంటివాడు. రాత్రి చాలా పొద్దుపోయాక చంద్రబాబు నాయుడు నిమ్మకూరుకు వెళ్లినాగాని జనం అధికంగా వచ్చి ఆయనకు స్వాగతం పలికారు.

కొడాలి నాని ఈ విషయాన్ని మరిచి.. చంద్రబాబు నిద్రపోవటానికి ఇల్లు కూడా ఎవరు ఇవ్వలేదని కారుకూతలు కూశాడు. చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్లినా బస్సులోనే బస చేస్తారన్న విషయం కొడాలి నాని కి బహుశా తెలియదు కాబోలు. గుడివాడ రూపురేఖలనే మార్చేస్తానని చెప్పి నాలుగు సంవత్సరాలు గడచినా గుడివాడకు ఏమీ చేయలేకపోయారు. సన్నబియ్యం ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. టీడీపీ నాయకులను తిడుతున్నావు.

తెలుగుదేశానికి ఎవరు వెన్నుపోటు పొడిచారో కొడాలి నాని ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. మంత్రిగా ఉన్నప్పుడు తన శాఖలో ఏం జరుగుతోందో తెలుసుకోలేని వ్యక్తి కొడాలి నాని. చంద్రబాబు షూ పాలిష్ చేసి బి ఫాం తీసుకెళ్లిన వ్యక్తి కొడాలి నాని. ఇంటి ముందు రోడ్డు వేసుకోలేని కొడాలి నాని రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తాడు? ఒక ఎమ్మెల్యే, మూడు సంవత్సరాలు మంత్రి పదవి వెలగబెట్టినా ప్రజలకు ఉపయోగం శూన్యం. గుడివాడ మున్సిపాల్టీలో టీడీపీ ప్రభుత్వం 3 ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించి, పైప్ లైన్లు వేసింది. వాటి నుంచి నీటిని ప్రజలకు అందించేని దద్దమ్మ కొడాలి నాని.

గుడివాడలో వైసీపీ నాయకులే ఆత్మహత్యలు చేసుకుంటుంటే చేతకాక చూస్తూ ఊరుకున్న వ్యక్తి కొడాలి నాని. తిన్నింటి వాసాలు లెక్కపెట్టం కొనాటి నాని నైజం. నూజివీడులో టీడీపీ ఆవిర్భావం తరువాత ఇంత పెద్ద సభ ఎప్పుడూ జరగలేదు. ఇది చూసి కొడాలి నానికి ప్రస్టేషన్ పీక్ కు వెళ్లింది. పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యాన్ని కూడా అమ్ముకున్న వ్యక్తి. రాబోయే పది నెలల్లో ప్రజలు కొడాలి నాని కి సినిమా చూపించబోతున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మద్ది పట్ల సూర్య ప్రకాష్ జోస్యం చెప్పారు.

LEAVE A RESPONSE