అమరావతి: దొంగ సర్టిఫికెట్‌తో అశోక్‌బాబు ప్రమోషన్ పొందాడని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ పెట్టి ప్రమోషన్లు సంపాదించాడని మండిపడ్డారు.
అశోక్‌బాబుపై ఫిర్యాదు చేసింది వైఎస్సార్‌సీపీ కాదని, సాటి ఉద్యోగే అశోక్‌బాబుపై ఫిర్యాదు చేశారన్నారు. ‘‘అశోక్‌బాబు అరెస్ట్‌పై టీడీపీ గగ్గొలు పెడుతోంది. అవినీతి పరుడు కోసం టీడీపీ తాపత్రయపడుతోంది. అశోక్‌బాబైనా చంద్రబాబైనా చట్టం ముందు సమానమే. దొంగలను వెనుకేసుకొస్తున్న ముఠా నాయకుడు చంద్రబాబు. అశోక్‌బాబు కేసును లోకాయుక్త సీఐడీకి అప్పగించింది.
ఇంటర్ చదివి.. డిగ్రీ చదివినట్టు అశోక్‌బాబు దొంగ సర్టిఫికెట్లు సృష్టించాడు. అశోక్‌బాబు ఏం తప్పు చేశాడని చంద్రబాబు నిస్సిగ్గుగా అడుగుతున్నారు. తప్పు చేశాడు కాబట్టే సీఐడీ అరెస్ట్ చేసిందని’’ మంత్రి కొడాలి నాని అన్నారు.