Suryaa.co.in

Andhra Pradesh

వివేకాపై కాదు…”ఎన్టీఆర్‌ను తడిగుడ్డతో గొంతు ఎలా కోశారు” అన్న పుస్తకం వేయండి

– చంద్రబాబు వేసిన పుస్తకం చలిమంటకు కూడా పనికి రాదు
– మామను చంపితే చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి, పార్టీ అధ్యక్ష పదవి వచ్చింది…
– వివేకా ఆస్తులు.. కూతురు, అల్లుడి పేరుమీదకు ఎలా వచ్చాయ్‌..?
– ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో మేమే గెలుస్తాం
– ఎన్నికల్లో విజయంపై మా నాయకుడు వైఎస్‌ జగన్‌ దిశానిర్ధేశం చేశారు
– 175 నియోజకవర్గాల గెలుపే ధ్యేయంగా గడప గడపకూ ప్రభుత్వం
– నూటికి నూరు శాతం 175 నియోజకవర్గాల్లో మేమే గెలుస్తాం
– జగనన్న అంటే ఏంటో 2024 ఎన్నికల్లో చూపిస్తాం
– జగన్మోహన్‌రెడ్డితోనే రాష్ట్రానికి భవిష్యత్తు..
– ఎన్టీఆర్‌ గొంతు కాదు…లోకేశ్ కు ఖర్జూరనాయుడు గొంతు వచ్చి ఉంటుంది..
– : మాజీ మంత్రి శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు(నాని)

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాలూ మావే:
– రాష్ట్రంలో 9 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. అవన్నీ మేమే గెలుచుకుంటాం
– స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది
– మూడు పట్టభద్రుల నియోజకవర్గాలు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికలు ఉన్నాయి
– వీటిలో కూడా ఎట్టిపరిస్థితుల్లో గెలవాలని మా నాయకుడు మాకు దిశానిర్ధేశం చేశారు
– సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు దీనిపై దృష్టి పెట్టాలి
– ప్రజలకు సంబంధం లేని ఎన్నికలైనా మనం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సిఎం చెప్పారు
– గడప గడపకు వెళ్తున్న నేపథ్యంలో 175 నియోజకవర్గాలు గెలిచేలా ప్రతి ఒక్క ఎమ్మెల్యే పనిచేయాలని చెప్పారు
– కొంత మంది కొంత తక్కువగా తిరుగుతున్న నేపథ్యంలో దాన్ని కూడా సరిచేసుకోవాలని చెప్పారు
– ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేనపథ్యంలో 175కి 175 నియోజకవర్గాల్లో గెలవాలని ముఖ్యమంత్రి దృఢ నిశ్చయంతో ఉన్నారు
– పోటీ చేసే వారు, ఉన్న ఎమ్మెల్యేలు దీనిపై పూర్తి స్థాయి దృష్టి పెట్టాలని సూచించారు
– మాకున్న సర్వేల ప్రకారం 175 సీట్లు గెలవడానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది

175కి 175 సీట్లు గెలిచి చూపిస్తాం:
– చంద్రబాబు, లోకేశ్, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు లాంటి పనికి మాలిన వాళ్లు సర్వేలంటూ మొరుగుతారు
– ఎవరికీ తెలియని సమాచారం కూడా ఏబీఎన్‌కు తెలిసినట్లు రాసేస్తాడు
– ఐప్యాక్‌ వాళ్లు సర్వే చేస్తారా..చేస్తారని రాధాకృష్ణకు ఎవరు చెప్పారు..?
– ఐప్యాక్‌ వాళ్లు స్ట్రాటజీ ఇస్తారు…ఎలా సరిచేసుకోవాలి అనేది చెప్తారు
– ముఖ్యమంత్రి ఇచ్చిన టాస్క్‌ను మేం కంప్లీట్‌ చేస్తాం
– 175కి 175 సీట్లు గెలిచి చూపిస్తాం
– కుక్కకాటుకు చెప్పుదెబ్బలా.. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌తో పాటు పచ్చమీడియాకి జగనన్న అంటే ఏంటో 2024 ఎన్నికల్లో చూపిస్తాం

చంద్రబాబు గ్రాఫిక్స్‌తో ఎలా మభ్యపెట్టాడో కూడా చెప్తాం:
– మార్చి 18 నుంచి 26 వరకు జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాం
– ఇప్పటికే గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు నియామకం చేపట్టాము
– జగన్మోహన్‌రెడ్డి ఉంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది
– మన హాయాంలో ఎటువంటి మార్పులు చేపట్టామో ప్రజల్లోకి తీసుకెళ్లామనేది గృహ సారథులు ప్రతి ఒక్క కుటుంబానికి వివరిస్తారు
– గతంలో చంద్రబాబు గ్రాఫిక్స్‌ తో ఎలా మభ్యపెట్టాడో కూడా వివరిస్తాం
– రాష్ట్రంలో దోచుకున్న డబ్బును అతని వాళ్లకు ఎలా పంచిపెట్టాడు అనేది కూడా చెప్తాం
– కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ లేదు..
– అంతేకాకుండా కోడ్‌ ఉన్న జిల్లాల్లో కొన్ని చోట్ల 23వ తేదీ నాటికి ఏకగ్రీవం అయిపోతాయి
– ఈ లోపు గృహసారథుల నియామకం, సమావేశాలు, శిక్షణ వంటి పనులు పూర్తి చేసుకుంటాం
– వీటితో పాటు పట్టభద్రులు, టీచర్స్‌ నియోజకవర్గాల్లోనూ మేం తిరిగి ప్రచారం చేస్తాం

చంద్రబాబు వేసిన పుస్తకం చలిమంటకు కూడా పనికి రాదు:
– ఇప్పుడు సోషల్‌ మీడియా యుగం వచ్చింది..ఇంకా ఐటీ నావల్లే వచ్చిందని చంద్రబాబు చెబితే ఎవరూ నమ్మరు.
– మరో వైపు చెత్త పుస్తకాలు వేస్తే ఎవడు చూస్తాడు..అవి చలిమంట వేసుకోడానికి కూడా పనికిరావు
– ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రోజూ రాసేది అదే కదా..!
– గతంలో ఇలాంటివి రాసీ రాసీ, వీళ్లంతా జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా చేయగలిగారా..?
– “ఎన్టీఆర్‌ని తడిగుడ్డతో గొంతు ఎలా కోశారు… “అన్నది రాయమనండి
– తడి గుడ్డ ఇచ్చింది రామోజీరావు .. కాళ్లు పట్టుకుంది రాధాకృష్ణ… అనేదానిపై పుస్తకాలు వేయమనండి
– గొంతు నులిమింది చంద్రబాబు నాయుడు అనేది రాయాలి
– తండ్రికి వెన్నుపోటు పొడుస్తుంటే చూసి… ఆనందించింది ఎవరు? అనేది పుస్తకాలు వేయాల్సింది.

మామను చంపితే చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది…:
– మామను చంపితే చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది, తెలుగుదేశం పార్టీ ని లాక్కున్నాడు..
– దేనికీ పనికి రాని పప్పుగాడిని ఓ నాయకుడిలా ప్రజల మీదకు వదిలాడు
– రామారావుని చంపితే.. ఇవన్నీ చంద్రబాబుకు వచ్చాయి.
– మరి ఇవన్నీ రావడానికి, వైఎస్సార్సీపీని వివేకానందరెడ్డి స్థాపించారా..?… లేదు కదా..?.
– పార్టీని జగన్మోహన్‌రెడ్డి పెడితే.. వివేకానందరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో ఉండి…విజయమ్మ పైనే పోటీ చేశారు.
-అయినా వివేకానంద రెడ్డి లాంటి మంచి మనిషిని, మనసున్న నాయకుడిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది?

వివేకా ఆస్తులు కూతురు, అల్లుడి పేరు మీదకు ఎలా వచ్చాయ్‌..?:
– ఆయన చనిపోయిన రోజుకి వివేకా పేరున ఐదుపైసలు ఆస్థి ఉందా..?
– ఆయన ఆస్థి మొత్తం కూతురు, భార్య, అల్లుడి పేర్ల మీద ఎలా బదిలీ అయ్యాయి?
– ఎందుకు ఆ ఆస్తులన్నీ బదిలీ అయ్యాయో తెలియాలి.
– చంద్రబాబు లాంటి లఫూట్‌ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి, కేసును తారుమారు చేస్తాడని సీబీఐ విచారణ కోరాం.
– మా ప్రభుత్వం వచ్చాక మేం విచారించుకుంటాం అని సీబీఐ విచారణ వద్దన్నాం
– సీబీఐ ఊళ్లోకి రావద్దంటూ చెప్పింది, జీవో ఇచ్చింది చంద్రబాబే..
– అలా సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా వివేకానందరెడ్డిని చంపించింది చంద్రబాబే అని మా అనుమానం.

ఎన్టీఆర్‌ గొంతు కాదు…లోకేశ్ కు ఖర్జూరనాయుడు గొంతు వచ్చి ఉంటుంది..:
– తాత గొంతు వచ్చిందా లోకేష్ …? రామారావు బతికి ఉంటే ఆత్మహత్య చేసుకుని ఉంటాడు
– పొరపాటున కర్జూరనాయుడు గొంతు వచ్చింది అని చెప్పబోయి రామారావు పేరు చెప్పి ఉంటాడు
– లోకేశ్‌ మందమతి కదా…ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్పి ఉంటాడు
– టీచర్స్‌లో వ్యతిరేకత ఉందని ఎవరైనా టీచర్స్‌ వచ్చి చెప్పారా..?
– వారిలో అనేక యూనియన్లు ఉన్నాయి…టీడీపీకి అనుబంధ యూనియన్లు ఉంటాయి..వైఎస్సార్సీపీ యూనియన్లూ ఉంటాయి
– అందరూ కలిసి వచ్చింది ఎప్పుడు..? మాకు కావాల్సిన మెజార్టీ ఓటు
– నూటికి నూరు శాతం ఓట్లు ఎవరికీ రాదు కదా

LEAVE A RESPONSE