తాడేపల్లి ప్యాలెస్ ‘సంకల్పం’తో 1100కోట్ల పేదల సొమ్ము స్వాహా చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీ
• సంకల్పసిద్ధి సంస్థ పేరుతో గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్ని నిలువునా దోచేసిన జగన్ రెడ్డి సోదర ద్వయం
• వంశీ ప్రధానఅనుచరుడు ఓలుపల్లిరంగా ఆధ్వర్యంలో భారీస్కామ్
• కేవలం రూ.లక్షపెట్టుబడితో రూ.1100కోట్ల ప్రజలసొమ్ము హాంఫట్
• కొట్టేసిన సొమ్ముతో హైదరాబాద్, బెంగుళూరులో నానీ,వంశీలు బినామీలపేర్లతో భూకొనుగోళ్ల జరిపారు
• మే నెలలో సంకల్పసిద్ధి సంస్థ రిజిస్టరయ్యాక, 3నెలలు ఎవరికీ కనిపించకుండా వంశీ ఎందుకు అదృశ్యమయ్యాడు
• రాష్ట్రంనడిబొడ్డున జరిగిన భారీకుంభకోణం తాడేపల్లి ప్యాలెస్ కి తెలియదా? పంపకాల్లో తేడాలొచ్చే జగన్ రెడ్డి, కొడాలిపదవికి పంగనామం పెట్టాడా?
• పేదలసొమ్ము దిగమింగిన వైసీపీఎమ్మెల్యే బాగోతంపై, తాడేపల్లి జీతగాడు సజ్జల, సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఏం సమాధానంచెబుతారు?
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
అవినీతిచక్రవర్తి జగన్ రెడ్డి కుంభకోణాలపాలనలో రాష్ట్రంలో మరోనయాకుంభకోణం బయటపడిందని, సంకల్పసిద్ధిసంస్థ ముసుగులో రూ.1100కోట్లపేదలసొమ్ముకొట్టేసిన నయాస్కామ్ లోని సూత్రధారులు, పాత్రధారులకు, వైసీపీఎమ్మెల్యేలు కొడాలినాని, వల్లభనేనివంశీలతో ఉన్న సంబంధబాంధవ్యాలేమిటో తక్షణమే ప్రభుత్వం, సీఐడీ తేల్చాలని టీడీపీజాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
“ఆర్థికఉగ్రవాది జగన్ రెడ్డి ఏలుబడిలో వైసీపీనేతల భాగస్వామ్యంతో, రాష్ట్రంలో జరిగే, అవినీతి కుంభకోణాలకు అంతేలేకుండా పోయింది. పేదల భూములుకబ్జాచేయడమేగాక, వారిని పీక్కుతింటున్న వైసీపీనేతల అవినీతికథలు కోకొల్లల్లుగా రాష్ట్రంలో నిత్యంకనిపిస్తున్నాయి. ఈ కోవలో వైసీపీశాసనసభ్యుడు, పదవి,సంపాదనకోసం టీడీపీనుంచి వైసీపీలోకి వెళ్లిన మరోశాసనసభ్యుడి బాగోతం బట్టబయలైంది. గుడివాడ ఎమ్మెల్యే కొడాలినాని, వల్లభనేని వంశీలు కలిసి వారిద్దరిప్రధాన అనుచరుడైన ఓలుపల్లి రంగా ఆధ్వర్యంలో సంకల్పసిద్ధి అనే బోగస్ సంస్థను తెరిపించి, దానిద్వారా రూ.1100కోట్ల పేదలసొమ్ముని బొక్కేశారు.
గన్నవరం, గుడివాడ నియోజకవర్గాలలో నిత్యం ప్రజలఛీత్కారాలు ఎదుర్కొంటున్న నానీ, వంశీలు రాబోయేఎన్నికల్లో తమకు ఓటమి ఖాయమని గ్రహించి, అక్రమంగా ప్రజల సొమ్ముని కొల్లగొట్టి నోట్లకట్టలతో ఓట్లుకొనుగోలుచేసి, గెలుపుసొంతం చేసుకోవాలనే కుట్రలో భాగంగానే ఇంతభారీ స్కామ్ కు తెరలేపారు. ఓలుపల్లిరంగా నేత్రత్వంలో గుత్తా వేణుగోపాలకృష్ణ, గుత్తా కిరణ్ లు బినామీలుగా, సంకల్పసిద్ధి ఈమార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గుడివాడ, గన్నవరం కేంద్రంగా రాష్ట్రవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహించింది.
రూ.లక్ష పెట్టుబడితో ప్రారంభించి, రూ.1100కోట్లు కొల్లగొట్టారు…
సదరు సంస్థ కేవలం రూ.లక్ష పెయిడ్ అప్ క్యాపిటల్ తో 17 మే 2022న రిజిస్టర్ కాబడింది. రూ.లక్షతో ప్రారంభమైన సంకల్పసిద్ధిసంస్థ నేడు రూ.1100కోట్ల భారీకుంభకోణానికి పాల్పడింది అంటే సంస్థనిర్వాహకులు, వారివెనకున్న గుడివాడనాని, వల్లభనేని వంశీలు ఎంతపెద్ద ఘరానాదొంగలో ప్రత్యేకంగాచెప్పాల్సిన పనిలేదు. కొడాలినానికి అత్యంత సన్నిహితుడు, వల్లభనేని వంశీకి అంతాతానై వ్యవహరించే ఆయనఆత్మ ఓలుపల్లిరంగా సంకల్పసిద్ధి సంస్థను తెరవెనకనుండి నడిపే కార్యక్రమం చేపట్టాడు. ఓలుపల్లి రంగాసాయం తో, గుత్తా వేణుగోపాలకృష్ణ, గుత్తా కిరణ్ లను బినామీలుగాపెట్టి, గుడివాడ, గన్నవరం ఎమ్మెల్యేలు నానీ, వంశీలు రూ.1100కోట్ల ప్రజల సొమ్ము స్వాహాచేశారు.
రూ.20వేలుచెల్లిస్తే, 10నెలల్లో రూ.60వేలని జనాన్ని వంచించారు…
తొలుత రూ.20వేలు సంస్థలో పెట్టుబడిపెడితే, రోజుకి రూ.200చొప్పున 10నెలల్లో రూ.60వేలు తిరిగిస్తారని, సంకల్పసిద్ధి ఈకార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏజెంట్లు ప్రజల్ని మోసగించారు. ఆ విధంగా అనేకస్కీమ్ లపేరుతో పేదలనుంచి రూ.1100కోట్లు కొట్టేశారు. ప్రజలకు అనుమానం రాకూడదని సంకల్పసిద్ధి మార్ట్ లపేరుతో దుకాణాలుతెరిచారు. అగ్రోఫామ్స్ అని, గంధపుచెట్ల పెంపకమని, రియల్ ఎస్టేట్ వెంచర్లు నిర్వహణనిచెప్పి, ఆ విధంగా వచ్చే సొమ్ముని పెట్టుబడిపెట్టిన వారికి పంచుతామని పేదప్రజల్ని మోసగించారు. 25 సెంట్ల భూమి అమ్మితే, స్పాట్ లో వెంటనే రూ.50వేల కమీషన్ తో పాటు, రోజుకి రూ.500చొప్పున 300రోజులు డబ్బులిస్తామని సంస్థనిర్వాహకులు, ఏజెంట్లకు ఆశచూపి వారిని బుట్టలో పడేశారు. ఈ విధంగా పేదల బలహీనతను పెట్టుబడిగా మార్చుకున్న, జగన్ రెడ్డి ఎమ్మెల్యేలు కొడాలినానీ, వల్లభనేని వంశీలు ఓలుపల్లిరంగా సహకారంతో మొత్తంగా రూ.1100కోట్లు కొట్టేశారు.
కొట్టేసిన సొమ్ముతో హైదరాబాద్, బెంగుళూరులో భూకొనుగోళ్లు…
ఈమధ్య గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తననియోజకవర్గంలో కనిపించకుండా పోయాడు. ఇటీవల తాను, తనపార్టీవారితో కలిసి జూలైలో డయేరియాతో బాధపడుతున్న తెంపల్లి గ్రామవాసుల్ని పరామర్శించడానికి వెళ్లినప్పుడు, అక్కడ వల్లభనేని వంశీగురించి అడిగితే, తమఎమ్మెల్యే గత 2,3 నెలలుగా అసలు కనిపించడంలేదని ఎటువెళ్లాడో తెలియడంలేదని తెంపల్లిగ్రామస్తులు చెప్పారు. మేనెలలో సంకల్పసిద్ధి సంస్థను తెరిపించిన వంశీ, తరువాత 2, 3నెలలు ఎక్కడా ఎందుకు కనిపించలేదు? కొత్తకంపెనీని ప్రమోట్ చేయడం.. పేదలనుంచి ఎంతెంత వసూలుచేయాలి..ఎలా దోపిడీచేయాలి.. ఆసొమ్ముని ఇతరరాష్ట్రాలకు తరలించే వ్యవహారాల్లో అప్పట్లోఆయన బిజీగా ఉన్నాడని, ఇప్పుడు అర్థమైంది. తన నియోజకవర్గంలో రోగాలతో ప్రజలుప్రాణాలు కోల్పోతున్నాకూడా పట్టించుకోకుండా, కనీసంవారివైపు కన్నెత్తైనా చూడకుండా, వంశీ సంకల్పసిద్ధి స్కామ్ లో మునిగితేలాడు. పేదలనుంచి కొట్టేసిన రూ.1100కోట్ల సొమ్మతో హైదరాబాద్ , బెంగుళూరు చుట్టుపక్కల నానీ వంశీలు, వారి బినామీరంగా మరియు ఇతరబినామీలపేర్లతో భూములు కొన్నారు. సంకల్పసిద్ధి సంస్థ కుంభకోణంపై తాడేపల్లి జీతగాడు, విజయవాడ పోలీస్ కమిషనర్ తక్షణమే సమాధానంచెప్పాలి. పేదలనుంచి కొట్టేసినసొమ్ము ఏరకంగా బెంగుళూ రు చేరింది…అక్కడేం ఆస్తులుకొన్నారు…. వల్లభనేనివంశీ నియోజకవర్గాన్ని వదిలేసిమరీ 3, 4నెలలు హైదరాబాద్, బెంగుళూరులో ఎందుకున్నాడో తేల్చాలి.
వైసీపీ ఎమ్మెల్యేల రూ.1100కోట్ల కుంభకోణం సీఐడీ చీఫ్ కి కనిపించడంలేదా?
రాష్ట్రం కేంద్రంగా ఇంతపెద్ద దోపిడీ అధికారపార్టీ ఎమ్మెల్యేలు చేశాక ఏపీ సీఐడీ ఏంచేస్తోంది? స్వచ్ఛందంగా ఎవరూచెప్పకుండానే, ప్రతిపక్షనేతలపై తప్పుడుకేసులుపెట్టి, వారినోళ్లు మూయించడంలో ముందుండే సీఐడీచీఫ్ సునీల్ కుమార్ కి సంకల్పసిద్ధి బోగస్ సంస్థ కనిపించడంలేదా? అసలు సీఐడీ అనేవ్యవస్థను ఏర్పాటుచేసిందే ఇలాంటి కుంభకోణాలు వెలికితీసి, అవినీతిపరుల్నికట్టడిచేసి, ప్రజల్నివారిబారినుంచి కాపాడటానికే కదా సునీల్ కుమార్. కానీ నేడు మీరుచేస్తున్నది ఏమిటి… సీఐడీవిభాగం యొక్కప్రాథమిక లక్ష్యాన్ని నీరుగారుస్తూ, ఆసంస్థను కేవలం ప్రతిపక్షనేతలు, గిట్టనివారిపై దాడులుచేయించేందుకే వినియోగించడం మీస్వామిభక్తికి నిదర్శనంకాదా సునీల్ కుమార్?
గత మూడున్నర సంవత్సరాలుగా మీరుచేసిన పనులతో ఎంతోఅపప్రథ మూటగట్టుకున్న మీకు సంకల్పసిద్ధి సంస్థరూపంలో మీ నిజాయితీని నిరూపించుకునే మంచిఅవకాశం దక్కిందని తెలుసుకోండి. కాబట్టి తక్షణమే సంకల్పసిద్ధి సంస్థ కేసువిచారణచేపట్టి, కుంభకోణం వెనకున్న వైసీపీదొంగలముఠా సభ్యుల్ని పట్టుకొని సీఐడీవ్యవస్థపై విశ్వాసంకోల్పోయిన ప్రజల్లో తిరిగి నమ్మకంకల్పించాలని కోరుతు న్నాం. సంకల్పసిద్ధి సంస్థఏమిటి.. ఎలాపుట్టింది… దానివెన కున్నవారెవరు, ఓలుపల్లిరంగా ఎవరు, 2ఏళ్లక్రితం అతనికున్న ఆస్తులు ఇప్పుడున్న ఆస్తులు, అతనిబ్యాంకు అకౌంట్లవివరాలు, లావాదేవీలు, ఇతరత్రా సమాచారంపై తక్షణమే సీఐడీ దృష్టిపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మంచినిష్ణాతులైన సిబ్బందిని చేతిలో పెట్టుకున్న సునీల్ కుమార్ కు రంగా వ్యవహారం తెలుసుకోవడం సీఐడీ కి నిమిషం పని.
తాడేపల్లి ప్యాలెస్ సంకల్పంతోనే సంకల్పసిద్ధి స్కామ్…
సంకల్పసిద్ధి సంస్థ కుంభకోణంవెనుక తాడేపల్లికొంప ప్రమేయంలేదనుకోవడం నిజంగాభ్రమే. ఇదిపూర్తిగా తాడేపల్లి జీతగాడి కనుసన్నల్లో జరిగిన భారీకుంభకోణమే. రూ.1100 కోట్ల కుంభకోణంలో తాడేపల్లి ప్యాలెస్ కి వాటాలుసరిగా దక్కకపోవడంతో ఆగ్రహించిన జగన్ రెడ్డి కొడాలినానికి ఉన్న పార్టీజిల్లాల సమన్వయకర్త అనేఆఖరిపదవికూడా పీకేశాడన్న అనుమా నం ప్రజలకు కలుగుతోంది.
దోపిడీదారుల్ని వదిలేసి, గౌరవంగా వ్యాపారం చేసే వారిపై దాడిచేస్తున్నారు…
ఇష్టానుసారం ప్రజలసొమ్ముని దోచుకుంటున్న సంకల్పసిద్ధిలాంటి సంస్థలను వెనకేసు కొస్తున్న జగన్ రెడ్డి, రాష్ట్రంలో ప్రజలసొమ్ముపైసాకాజేయకుండా, గౌరవప్రదంగా వ్యాపారం చేసుకునే సంస్థలు, వ్యక్తులపైకి అంబటి రాంబాబులాంటి ఆంబోతుల్ని ఉసిగొల్పుతున్నాడు. సక్రమంగాసజావుగా, చట్టప్రకారం ఎలాంటితప్పులులేకుండా వ్యాపారాలు చేసేవారంతా తప్పుడు మనుషులన్నట్లు దిక్కుమాలిన పకోడిపేపర్లో విషపురాతలు రాయించే జగన్ రెడ్డికి, తనపార్టీఎమ్మెల్యేలు చేసిన రూ.1100కోట్ల కుంభకోణం ఇసుకరేణువులా కనిపించిం దా? సంకల్పసిద్ధి సంస్థ కుంభకోణం, దానివెనకున్న తనపార్టీ ఎమ్మెల్యేల బాగోతం ప్రజలకు అర్థ మైన తర్వాత, నేడువారినిర్వాకం గురించి నీబురదపత్రికలో రాసేధైర్యం ఉందా జగన్ రెడ్డి? ప్రభుత్వం తరుపున తక్షణం విచారణకు ఆదేశించి, తనపరబేధంలేకుండా దోషులను శిక్షించే చిత్తశుద్ధి నీకుఉందా? సంకల్పసిద్ధి సంస్థ కుంభకోణంపై డీజీపీ ఇప్పటివరకు ఎందుకుస్పందించలేదని, విచారణ వివరాలు నేటికీ ఎందుకుబయటపెట్టలేదని ప్రశ్నిస్తున్నాం. పోలీసుల విచారణలో ఎటువంటి ఆధారాలు రాబట్టారు… ఏంతేల్చారో ప్రజలకు తెలియాల్సిన అవసరముంది. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ లో ఏమాత్రం నిజాయితీ ఉన్నాకూడా తక్షణమే సంకల్పసిద్ధి సంస్థ కుంభకోణంపై సీఐడీతో దర్యాప్తు ప్రారంభించాలి. కొడాలినానీ, వల్లభనేనివంశీల బాగోతంతో పాటు, వారిబినామీ ఓలుపల్లి రంగా వ్యవహారంతేల్చాలి.
గుత్తా వేణుగోపాలకృష్ణ, గుత్తా కిరణ్ లు కూడా గన్నవరం ప్రాంత వాసులే. కొడాలినాని, వల్లభనేని వంశీలు వారిద్దరిని ఓలుపల్లిరంగా అనేవ్యక్తికి అప్పగించి, ఒక బోగస్ సంస్థముసుగులో పేదలసొమ్ము కొట్టేశారు. ఈ విధంగా ప్రజలసొమ్ముకాజేసి, ఆడబ్బుతో ఓట్లుకొనుగోలుచేసి, వచ్చేఎన్నికలను హైజాక్ చేసి మరలా ఎమ్మెల్యేలుగా గెలవాలనే నానీ, వంశీలు ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. ఓలుపల్లి రంగా అనే వ్యక్తి గుత్తావేణుగోపాలకృష్ణ, గుత్తా కిరణ్ లకు అత్యంత సన్నిహితుడు. అదేరంగా గన్నవరం ఎమ్మెల్యే, గుడివాడ శాసనసభ్యులకు ముఖ్య అనుచరుడు. అతన్ని ముందుపెట్టే నాని,వంశీలు వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. సంకల్పసిద్ధి సంస్థ కుంభకోణం లో నాని, వంశీల పాత్రలేకపోతే, ప్రభుత్వం తక్షణమే సీఐడీతో విచారణ జరిపించి అసలు దోషులేవరో తేల్చాలి. ప్రభుత్వం చిత్తశుద్ధితోవిచారిస్తే, అసలుదొంగలెవరో బయటకు వస్తుంది. సంకల్పసిద్ధి కుంభకోణం గురించి గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లోని ప్రజల్ని అడిగితే, గుత్తా వేణుగోపాలకృష్ణ, గుత్తా కిరణ్ లు ఎవరు…నాలుగేళ్లక్రితం వారికున్న ఆస్తులు, వారికి ఓలుపల్లికి రంగాకు ఉన్న సంబంధం.. రంగాకు కొడాలినాని, వల్లభనేని వంశీలతో ఉన్న అనుబంధం అన్నీ బయటకొస్తాయి” అని పట్టాభిరామ్ తేల్చిచెప్పారు.