– మీరు పెంచిన ఈ చెట్టును నరికేందుకు కేసీఆర్, మోదీ భుజాన గొడ్డలి వేసేందుకు బయలుదేరిండ్రు
– హరీష్ రావు నోటిదూల, కేసీఆర్ అతి తెలివి వల్ల… రైతు బంధు ఆగింది
– రైతు బంధు రాకపోవడానికి కారణమైన బీఆరెస్ నేతలను తరిమికొట్టండి
– కేసీఆర్ కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించడం ఖాయం
– అల్లుడు హరీష్ వల్లే రూ.5వేల కోట్లు ఆగిపోయినాయ్
– టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
కొడంగల్/డోర్నకల్ : ఈ కొడంగల్ నాకు అస్థిత్వాన్ని ఇచ్చింది.. పోరాటాన్ని నేర్పింది. 20 ఏండ్లు రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాడా. ఈ కొడంగల్ గడ్డ… నా అడ్డా. మీ బిడ్డ.. మీరు నాటిన మొక్క… రాష్ట్రానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగింది. మీరు పెంచిన ఈ చెట్టును నరికేందుకు కేసీఆర్, మోదీ భుజాన గొడ్డలి వేసేందుకు బయలుదేరిండ్రు. కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు.. పది వేల ఎకరాలు దోచుకుండు.
కొడంగల్ సాక్షిగా చెబుతున్నా..కేసీఆర్ కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించడం ఖాయం. రాష్ట్రంలో దొరల, గడీల పాలన పోవాలి… ఇందిరమ్మ రాజ్యం రావాలి. రెడ్యా నాయక్ కు, ఆయన కూతురుకు కాంగ్రెస్ అవకాశం ఇస్తే.. కార్యకర్తల గుండెలపై తన్ని పార్టీ ఫిరాయించారు.ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకురాకుండా బీఆరెస్ అన్యాయం చేసింది.ఈ ప్రాంతంలోని లంబాడా బిడ్డలను విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతోంది.
ఇక్కడ ఇసుకదందా, బియ్యం దందా.. అన్ని దందాలు రెడ్యా నాయక్ కుటుంబానివే.ఈ ప్రాంతంలో కేసీఆర్ కుటుంబంలా రెడ్యా నాయక్ కుటుంబం దోపిడీని పంచుకుంటోంది.డోర్నకల్ లో కాంగ్రెస్ ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది.రైతుబంధు రైతుల ఖాతాలో వేయాలని ఈసీ కి మేం విజ్ఞప్తి చేసాం. ఈసీ అనుమతి ఇచ్చినా.. హరీష్ రావు నోటిదూల, కేసీఆర్ అతి తెలివి వల్ల… రైతు బంధు ఆగింది.
రైతుల ఖాతాల్లో పడాల్సిన రూ.5వేల కోట్లు ఆగిపోయాయి. మా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా… రైతు బంధు రాకపోవడానికి కారణమైన బీఆరెస్ నేతలను తరిమికొట్టండి.బీఆరెస్ కుట్ర వల్లే రైతుల ఖాతాలో పడాల్సిన నిధులు ఆగిపోయాయి. అల్లుడు హరీష్ వల్లే రూ.5వేల కోట్లు ఆగిపోయినాయ్… దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలి.
నవంబర్ 30 న అల్లుడు హరీష్ కు.. మామ కేసీఆర్ కు బుద్ది చెప్పాలి. ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు ఏటా ప్రతీ ఎకరాకు రూ.15వేలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ది. నవంబర్ 30 న అల్లుడు హరీష్ కు.. మామ కేసీఆర్ కు బుద్ది చెప్పాలి. ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు ఏటా ప్రతీ ఎకరాకు రూ.15వేలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ది.