Suryaa.co.in

Editorial

ఒంటరయిన కోడెల కొడుకు!

– ఏకమవుతున్న కోడెల వ్యతిరేక వర్గం
– ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో శివరామ్‌కు అందని ఆహ్వానం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాదరావు తనయుడు టీడీపీలో ఒంటరయ్యారు.సొంత నియోజకవర్గంలో జరిగిన పార్టీ కార్యక్రమానికి సైతం ఆహ్వానం లేకుండా అవమానం పాలయ్యారు.సత్తెనపల్లి
kodela-siva నియోజకవర్గ ఇన్చార్జి పదవి ఆశిస్తున్న డాక్టర్ కోడెల శివరామ్ లేకుండానే, ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరగడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సత్తెనపల్లి నియోజకవర్గం కుంకలగుంట మండల కేంద్రంలో ఆదివారం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరిగింది. పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మలరామానాయుడు,
kodela-siva3కార్పొరేషన్ మాజీ చైర్మన్ గోనెగుంట్ల కోటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయిన ఆ కార్యక్రమానికి, దివంగత కోడెల తనయుడు, పార్టీ నేత శివరామ్‌ను ఆహ్వానించకపోవడం చర్చనీయాంశమయింది. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరిగిన కుంకులగుంట, కోడెల సొంత మండలం కావడం గమనార్హం.

రెండున్నరేళ్ల తర్వాత జరిగిన పార్టీ కార్యక్రమానికి అంచనాలకు మించి జనం, కార్యకర్తలు హాజరయ్యారు. వారితోపాటు కోడెల శివరామ్ వ్యతిరేకవర్గం మొత్తం హాజరుకాగా, అసలు శివరామ్‌కు సమాచారమే
kodela-siva5ఇవ్వకపోవడం మరో విశేషం. పార్టీ సీనియర్ నేత శౌరయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో.. నరసరావుపేట, సత్తెనపల్లి నియోకవర్గాలకు చెందిన పాతతరం టీడీపీ నేతలంతా హాజరవడంతో పార్టీవర్గాల్లో కొత్త ఆశలు చిగురించాయి.

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ముగిసిన తర్వాత.. నర్సరావుపేటలో డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు నివాసంలో జరిగిన గెట్ టు గెదర్‌లో, ఇప్పటివరకూ పార్టీకి దూరంగా ఉన్న వైద్య ప్రముఖులు, కమ్మ
kodela-siva1 సామాజికవర్గానికి చెందిన ప్రముఖ నేతలంతా హాజరయ్యారు. వీరంతా కోడెల శివరామ్, నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ అరవిందబాబు వ్యతిరేకవర్గమే కావడం చర్చనీయాంశమమయింది.

కాగా కోడెల శివరామ్ తాజాగా టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను కలిసిన నేపథ్యంలో, శివరామ్‌కు సత్తెనపల్లి ఇన్చార్జి పదవి ఇస్తారన్న ప్రచారం ప్రారంభమయింది. దివంగత కోడెలతో సన్నిహితంగా ఉండే ఒక పత్రికాధిపతి సిఫార్సుతో, శివరామ్‌కు ఇన్చార్జి ఇస్తారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. సరిగ్గా అదే
kodela-siva4 సమయంలో ఆయనను ఆహ్వానించకుండానే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరగడంతో, సొంత నియోజకవర్గంలో కోడెల శివరామ్ ఒంటరివాడయినట్లయింది.

ప్రస్తుతం పార్టీకి సంబంధించిన ఆయన బాధితులంతా శౌరయ్య వర్గంలో ఉండటం, సత్తెనపల్లిలో రెండు వర్గాలూ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం ఆసక్తికరంగా మారింది. శివరామ్‌కు ఎట్టి పరిస్థితిలో ఇన్చార్జి పదవి ఇవ్వవద్దని, ఒకవేళ ఇస్తే తామెవరూ పార్టీలో పనిచేసేదిలేదని ఆయన ప్రత్యర్థి వర్గం పార్టీ నాయకత్వానికి స్పష్టం చేసింది. అటు నాయకత్వానికి సైతం సత్తెనపల్లి ఇన్చార్జి వ్యవహారం తలనొప్పిగా పరిణమించింది.

LEAVE A RESPONSE