Suryaa.co.in

Andhra Pradesh

రికార్డుల దహనం వెనుక కొల్లి రఘురామిరెడ్డి

– రఘురామిరెడ్డి ఆదేశాలతోనే రికార్డుల కాల్చివేత
– సిట్ కార్యాలయంలో దర్యాప్తు పత్రాల కాల్చివేతపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు
– పత్రాల కాల్చివేతపై అనుమానం ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్న నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా
-సీఐడీ అధికారి కొల్లి రఘురామిరెడ్డి ఆదేశాలతోనే తగలబెట్టించారని ఫిర్యాదు
-ఘటనపై విచారణ చేయించాలని కోరిన దేవినేని ఉమ, వర్ల రామయ్య

సిట్ కార్యాలయంలో ఫైల్ కాల్చివేత వెనుక ఐపిఎస్ అధికారి కొల్లిరఘురామిరెడ్డి ఉన్నారని టీడీపీ ఆరోపించింది. ఆయన ఆదేశాలు లేనిదే సిబ్బంది ఆ రికార్డులు తగులబెట్టరని స్పష్టం చేసింది. చేసిన సిగ్గుమాలిన పనికి సిగ్గుపడాల్సిందిపోయి, మళ్లీ పత్రికాప్రకటనల ఇవ్వడానికి ముఖం ఎలా వచ్చిందని మాజీ మంత్రి దేవినేని ఉమ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. ఆ మేరకు వారు రికార్డుల దహనంపై ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వారు మీడియాతో ఏ మాట్లాడారంటే..సిఐడి చీఫ్ కొల్లి రఘురామరెడ్డి నిస్సిగ్గుగా ఇచ్చిన రిజైన్డర్ కాపీ రాష్ట్ర ప్రజానీకాన్ని నివ్వెరపరిచింది. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడానికి సిఐడి చీఫ్ చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు విషయం, మళ్లీ ఈరోజు హెరిటేజ్ సంస్థ ఫైల్స్ దగ్ధం విషయంలో ఇచ్చిన రీజైండర్లో అదే అత్యుత్సాహం ప్రదర్శించారు.

ఏ రికార్డు ఏం చేయాలన్నా ఒక పబ్లిక్ ఆఫీసర్ రికార్డు ఆఫీసర్ ఉంటారు. రఘురామిరెడ్డి అత్యుత్సాహం.. ఆయన పీకకు చుట్టుకుంది. ఆయన తీసిన గోతిలో ఆయనే పడ్డాడు. సచివాలయంలో ఈ వైసీపీ దొంగలు ఇదేవిధంగా ఫైల్స్ తగలబెడతారు .. ఎందుకంటే ఈరోజు నాసిరకం మద్యం డిజిటల్ పేమెంట్లు లేకుండా క్యాష్ అండ్ క్యారీ తో లక్షల కోట్లు అమ్మకాలు జరిగాయి ఇసుక కుంభకోణాలు జరిగాయి.

ల్యాండు శాండు వైను మైను సెంటు పట్టాల్లో లక్షల కోట్ల దోపిడీ జరిగింది వాటికి సంబంధించిన ఫైల్స్ అన్ని తగలబెట్టబోతున్నారు. ఈరోజు సిఐడి కార్యాలయంలో జరిగిన సంఘటన ఆరంభం మాత్రమే. లోకేష్ కి సంబంధించిన మరియు బ్రాహ్మణి కి సంబంధించిన ఐటీ రిటర్న్స్ ఎలా వచ్చాయి అంటే సమాధానం లేదు. ఈరోజు తగలబెట్టిన ఫైల్స్ లో మంగళగిరి ఎమ్మెల్యే పెట్టిన కంప్లైంట్ ఫైల్స్ అన్ని స్పష్టంగా కనబడ్డాయి.

ఇటువంటి సంఘటనలు కాకుండా చర్యలు తీసుకోవాలని నిందితులపై కూడా చర్యలు తీసుకోవాలని సీఈఓ కి తెలియజేయడం జరిగింది. మంగళగిరిటీడిపి ప్రధాన కార్యాలయం మీద చంద్రబాబు నాయుడు ఇంటి మీద జరిగిన దాడి సంవత్సరాల తరబడి ఈరోజుకు కూడా నిందితులను అరెస్టు చేయలేదు నిందితుల పేర్లు నమోదు కాలేదు.

తక్షణమే సంబంధిత ఎస్పీలు కలెక్టర్లతో మాట్లాడి నిందితుల మీద కేసులు బుక్ చేయాలి. తెలుగుదేశం నాయకులు ఇచ్చిన ఫిర్యాదులు తీసుకోకుండా, అక్కడ వీఆర్వో తో ఫిర్యాదులు తీసుకోవడం జరిగింది ప్రభుత్వ కనుసన్నల్లోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

LEAVE A RESPONSE