Suryaa.co.in

Andhra Pradesh

పోలీసుల పౌరుషం ప్రతిపక్షాలపై నేనా ?

– అనంతపురం జిల్లా గుల్జర్పేట సేబ్ పోలీస్ స్టేషన్ వైసిపి కార్పొరేటర్ దాడి పై కొల్లు రవీంద్ర

పోలీసు కానిస్టేబుల్ అయిన రాధమ్మ పై దాడి చేస్తే పోలీసులకి పౌరుషం రాధా..?మహిళా కానిస్టేబుల్ రాధమ్మకు అన్యాయం జరిగితే పోలీస్ సంఘాలకు పౌరుషం రాదా..?అనంతపురం జిల్లా గుల్జర్పేట సబ్ పోలీస్ స్టేషన్ పై ఒక కార్పొరేటర్ దాడి చేస్తే పోలీసులకు చలనం లేదు తెలుగుదేశం మీద మొరిగే వాళ్ళ చెవులకు ఇవి వినిపించావా..?స్టేషన్ మీద, సిబ్బంది మీద దాడి జరిగితే మహిళ కానిస్టేబుల్ రాధమ్మ ధైర్యంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..?

బాధితురాలైన మహిళా కానిస్టేబుల్ రాధమ్మను ఎందుకు వేధింపులకు గురిచేసి కేసును వాపాసు తీసుకునేలా ఒత్తిడి చేస్తున్నారు.అవసరమైతే బాధితురాలైన కానిస్టేబుల్ రాధమ్మ దంపై ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని భయపెడుతున్న ఈ వ్యవస్థను దేనితో కడగాలి?

వైసీపీ ప్రభుత్వ అరాచకం స్మృతి మించిపోతుంది ప్రతిపక్ష పార్టీలపై దాడులకు తెగబడుతున్నారు ఈరోజు ఇప్పుడు పోలీస్ స్టేషన్ల మీదే దాడికి దిగబడుతున్నారు అయినా ఈ ప్రభుత్వానికి ఈ వ్యవస్థలకు చీమకుట్టినట్టు కూడా లేదు. ఈ ప్రభుత్వం అధికార మదంతో చేస్తున్న అరాచకాలకు చమరగీతం పడాల్సిన సమయం ఆసన్నమైంది.

LEAVE A RESPONSE