Suryaa.co.in

Andhra Pradesh

సొంత రాష్ట్రంలోని బీసీలను ఆర్.కృష్ణయ్య గాలికి వదిలేశారు

-ఏపీ బీసీల్లో ఐక్యత చెడగొట్టేందుకు దిగజారాడు
-నాలుగున్నరేళ్ల పాలనలో బీసీలకు అన్యాయం, దగా తప్ప చేసిందేంటి?
-ఈ ప్రశ్నలకు ఆర్.కృష్ణయ్య గానీ, జగన్ రెడ్డి గానీ సమాధానం చెప్పగలరా?
-సీఎం జగన్‌కు మాజీ మంత్రి కొల్లు లేఖాస్త్రం

22.11.2023
శ్రీ.వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు.

సొంత రాష్ట్రంలోని బీసీలను ఆర్.కృష్ణయ్య గాలికి వదిలేశారు. ఆయనొక్కడి వ్యక్తిగత లబ్దికోసం మీ కుట్రలో పావుగా మారి ఏపీ బీసీల్లో ఐక్యత చెడగొట్టేందుకు దిగజారాడు. నాలుగున్నరేళ్ల పాలనలో బీసీలకు అన్యాయం, దగా తప్ప చేసిందేంటి? రాష్ట్రంలోని బీసీలు ఈ కింది అంశాలకు ఆర్.కృష్ణయ్య గానీ, జగన్ రెడ్డి గానీ సమాధానం చెప్పగలరా?

1. రూ.75,760 కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు.
2. ఆదరణ లాంటి 30కి పైగా బీసీ సంక్షేమ పథకాలు రద్దు చేశారు.
3. రిజర్వేషన్లు 34% నుండి 24%కి తగ్గించి 16,800 రాజ్యాంగబద్ద పదవులు దూరం చేశారు.
4. 14 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు కబ్జా చేస్తున్నారు. అందులో అత్యధిక భాగం బీసీలవే.
5. 70వేలకు పైగా బీసీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయలేదు.
6. 74 మంది బీసీలను హత్య చేశారు. వేల మందిపై తప్పుడు కేసులు పెట్టి, దాడులు చేసి వేధించారు.
7. 13 బీసీ భవనాలు, 1187 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను నిలిపివేశారు.
8. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దుకు సుప్రీంకోర్టుకు వెళ్లి చీవాట్లు తిన్నారు. విదేశీ విద్య, పెళ్లి కానుకలు, చంద్రన్న బీమా వంటి పథకాలు రద్దు చేశారు.
9. మద్యం ధరలు పెంచి, నాసిరకమైన మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాన్ని పాడుచేసి, 30వేల మంది ప్రాణాలు తీసి వారి భార్యల మాంగళ్యాలు తెంచారు. మద్యం బాధితుల్లో అత్యధికులు బీసీలే
10. ధరలు, ఛార్జీల బాదుడుతో ఒక్కో కుటుంబంపై రూ.2.80లక్షల భారం వేశారు.
11. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడంతో కేంద్ర నిధులు రూ.16వేల కోట్లు పోయాయి.
12. 16 యూనివర్శిటీల్లో వీసీలుగా ఒక్కరే బీసీ. మిగిలిన వాటిలో సొంత సామాజిక వర్గంతో నింపారు.
13. నామినేటెడ్ పదవుల్లో 90 శాతం సొంత వర్గమే. సలహాదారుల్లో ఒక్క బీసీ కూడా లేడు.
14. అమరావతిలో 10 ఎకరాల్లో జ్యోతిరావుపూలే విగ్రహం, మెమోరియల్ ఏర్పాటును రద్దు చేశారు.
15. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన, నిధులు ఇవ్వకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చారు.
16. టీడీపీకి చెందిన బీసీ నేతలు కింజరాపు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, కిమిడి కళా వెంకట్రావు, కొల్లు రవీంద్ర, బీదా రవిచంద్ర యాదవ్, కాలవ శ్రీనివాసులు, బండారు సత్యన్నారాయణమూర్తి, కూన రవికుమార్, పల్లా శ్రీనివాస్ యాదవ్, ఆదిరెడ్డి అప్పారావు కుటుంబం, పంచుమర్తి అనురాధ, గౌతు శిరీష లాంటి వారిపై కేసులు పెట్టి వేధించారు. ఈ అంశాలపై సమాధానం చెప్పగలరా?

-కొల్లు రవీంద్ర
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు

LEAVE A RESPONSE