Suryaa.co.in

Telangana

జగన్ కు బిర్యానీ పెట్టి శ్రీశైలం, సాగర్ ను ఎండబెట్టిందే కేసిఆర్

– కవిత కుటుంబం దురాజ్ పల్లిలో ఎందుకు బోనమెత్తలేదు ?
– దురాజ్ పల్లి పెద్దగట్టు జాతరకు ఘాట్ రోడ్డు, గెస్ట్ హౌజులు నిర్మిస్తాం
– పెద్దగట్టు జాతర లో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్: మేడారం జారత తర్వాత అతిపెద్ద రెండో జాతర.. దాదాపు 40 లక్షల మంది దర్శించుకుంటారు. పదేండ్ల తర్వాత తెలంగాణలో ప్రజాప్రభుత్వం వచ్చింది. పేదవాండ్లకు ఇళ్లు కట్టించే శక్తిని ప్రసాదించాలని వేడుకుంటున్నాను. పదేండ్లు కుటుంబ పాలనతో తెలంగాణ దోపిడికి గురైంది. అందుకే నల్గొండ ప్రజలు ఒక్కో చోట 50-60 వేల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించారు.

తెలంగాణలో సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలతో, రైతులు, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లిని కోరుకోవడం జరిగింది. ఎస్.ఎల్.బీ.సీ, బ్రహ్మణవెల్లంల, శ్రీరాంసాగర్ కాలువలు తియ్యలే సూర్యపేటకు నీళ్లు ఇయ్యలే, గంధమల్ల ప్రాజెక్టు పూర్తి చెయ్యక ఆలేరును ఎండబెట్టారు. 50-60 కోట్ల ఖర్చైనా, ఘాట్ రోడ్డు, గెస్ట్ హౌజులను, జాతర సమయంలో భక్తులు ఇబ్బందులు పడకుండా బాత్ రూం లు ఇతర సౌకర్యాలు కల్పిస్తాం.

సాధారణ సమయంలోనూ వేలాదిగా భక్తులు తరలివచ్చే మహిమాన్విత జాతర పెద్దగట్టు జాతర. పదేండ్లు కల్వకుంట్ల కవిత కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు ఆస్ట్రేలియా, అమెరికా, లండన్ లో కాకుండా దురాజ్ పల్లిలో ఎందుకు బోనమెత్తలేదు ? అధికారం పోయినంక దురాజ్ పల్లి గుర్తుకు వచ్చిందా? దామోదర్ రెడ్డి త్యాగాన్ని చూసి అనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తుంగతుర్తికి, సూర్యాపేటకు నీళ్లు వచ్చేలా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీరు లేకుండా, కేవలం మా పాత ప్రాజెక్టులతోనే రికార్డుస్థాయిలో 1 కోటి 52 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించాం.

70 శాతం వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానిది. బీఆర్ఎస్ పార్టీ మంచి చేసుంటే 11 సీట్లల్లో డిపాజిట్లు పోయేంత దారుణంగా ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించిన మంత్రి ? రెండు పార్లమెంట్ స్థానాల్లో డిపాజిట్లు పోయినయి, ఒక సీటు అయితే దక్షిణ భారతదేశంలోనే అత్యంత భారీ మెజార్టీతో గెలిచాం. జగదీష్ రెడ్డికి ప్రజల్ని చూసే ఓపిక లేదు, ఆయనకు డబ్బు తప్పా మరో యావలేదు. లక్ష రుణమాఫీని 5సార్లు చేసినోళ్ల రైతుల గురించి మాట్లాడటం సిగ్గచేటు.

జగన్ కు ప్రగతిభవన్ లో విందు భోజనం ఇచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలకు తెలంగాణ నీళ్లను కానుకగా ఇచ్చిండు. పోతిరెడ్డిపాటు నుంచి 88 వేల క్యూసెక్కుల నీళ్లను తీసుకుపోయేందుకు జగన్ తో కలిసి ములాఖత్ అయ్యింది కేసిఆర్. జగన్ కు బిర్యానీ పెట్టి శ్రీశైలం, సాగర్ ను ఎండబెట్టిందే కేసిఆర్జగన్ కు అమ్ముడు పోకపోతే మీరు ఎందుకు ఓడిపోతరని కల్వకుంట్ల కవితను ప్రశ్నించిన మంత్రి..నల్గొండను బంగారు కొండను చేసే టన్నెల్ బోరింగ్ మిషన్ కోసం ముఖ్యమంత్రి నన్ను అమెరికాకు పంపించారు.

అరిచి గీ పెట్టినా కేటీఆర్, హరీష్ రావును పట్టించుకోం. మేం ఉద్యమం చేస్తున్నన్ననాడు అమెరికాలో ఉన్న చిన్నపిలగాడు కేటీఆర్. మాకు లింగమంతులస్వామిది, తెలంగాణ ప్రజలది ఆశీర్వాదం ఉంది. మంత్రితో పాటు స్వామివారిని దర్శించుకున్న నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశం, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి,రాష్ట్ర నాయకులు సర్వోతంరెడ్డి, వేనారెడ్డి లతో తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE