Suryaa.co.in

Andhra Pradesh

ఆంధ్రాలో హక్కులు హరీ

-మంటకలుస్తున్న మానవ హక్కులు
-జగన్ సర్కారుపై చర్యల కొరడా ఝళిపించండి
-గన్నవరం ఘటనపై న్యూఢిల్లీలోని జాతీయ మానవహక్కుల కమీషన్ లో పిర్యాదు చేసిన తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం

గన్నవరం టిడిపి కార్యాలయంపై వైసీపీ మూకలు దాడి చేయడమే కాకుండా తనను అక్రమ అరెస్టు చేసి తీవ్ర మానసిన, భౌతిక క్షోభకు గురిచేశారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం న్యూఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమీషన్ లో పిర్యాదు చేశారు. ఆ మేరకు కమీషన్ సభ్యులు రాజీవ్ జైన్ ను కుటుంబంతో సహా కలిసి తన పిర్యాదును అందజేశారు.

పిర్యాదులోని అంశాలు ఆయన మాటల్లోనే….. కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాలతో నన్ను అక్రమ అరెస్టు చేసి సెల్ ఫోన్ బలవంతంగా లాక్కున్నారు. గంటల తరబడి పోలీస్ వాహనంలో త్రిప్పుతూ నిర్మానుష్య ప్రదేశాల్లో ఆపుతూ గుడివాడ పరిసర ప్రాంతాల్లో తిప్పారు. చివరగా ఎస్సీ ఆదేశాలతో తొట్లవల్లూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విద్యుత్ సరఫరా తొలగించి.. సిబ్బందిని బయటకు పంపి.. ముగ్గురు మాస్క్ ధరించిన వ్యక్తులతో దాదాపు 40 నిముషాల పాటు భౌతికంగా హింసించారు. 20 వ తేదీన అరెస్టు చేసి 21వ సాయంత్రం వరకు అరెస్టు విషయాన్ని నా కుటుంబ సభ్యులకు చెప్పలేదు. వైద్యపరీక్షల్లో ఎం.ఆర్.ఐ స్కాన్ చేయించాలని అభ్యర్ధించినా అనుమతించలేదు.

నా సతీమణిని కూడా గృహనిర్భంధం చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా బయట పోలీసులను పెట్టి భయాందోళనలకు గురిచేశారు. ఇప్పటికి నాలుగు సార్లు నాపైన, మా ఇంటిపైన దాడి చేశారు. చిన్నబిడ్డ అయిన నా కుమార్తెను కూడా భయాందోళనలకు గురిచేశారని కమీషన్ సభ్యులు శ్రీ రాజీవ్ జైన్ గారికి వివరించారు. రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాల కాలంలో ప్రతిపక్షపార్టీ నాయకులపైన జరిగిన దాడులు, అక్రమ అరెస్టుల ఉదంతాలను రాజీవ్ జైన్ కి తెలియపరిచారు. దాదాపు అరగంట పాటు జరిగిన సమావేశంలో రాజీవ్ జైన్  రాష్ట్రంలో నెలకొన్న దారుణమైన పరిస్థితులను పూర్తిగా అవగాహన చేసుకుని నేను అందించిన పిర్యాదుపై తక్షణమే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వెంటనే తన సిబ్బందిని పిలిచి పిర్యాదును రిజిస్టర్ చేయాలని ఆదేశించి అక్కడికక్కడే ఆ పని పూర్తి చేయించారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) లో పౌరులకు ప్రసాధించిన ప్రాధమిక హక్కులను ఉల్లంఘించారని, ఏ కారణం చేత నన్ను అరెస్టు చేస్తున్నారో కనీస సమాచారం ఇవ్వలేదని, అరెస్టుల సమయంలో గౌరవ సుప్రీంకోర్టు జితేంధర్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, డి.కె బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసుల్లో ఇచ్చిన మార్గదర్శకాలను గానీ, మానవ హక్కుల కమీషన్ నిబంధనలు గానీ పాటించలేదని పిర్యాదులో పేర్కొన్నారు. మానవ హక్కులను ఉల్లంఘించి, నన్ను శారీరకంగా మానసికంగా తీవ్ర విషాదంలోకి నెట్టి చిత్రహింసలకు గురిచేసిన పోలీసు అధికారులపై సమగ్ర విచారణ చేసి తగు చర్యలు తీసుకోగలరని కమీషన్ పట్టాభిరామ్ కోరడమైంది.

LEAVE A RESPONSE