– బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి ప్రసాద్ గౌడ్
హైదరాబాద్: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని బౌద్ధ నగర్ దుకాణ యజమానుల సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి ప్రసాద్ గౌడ్ పాల్గొని ఆయన చిత్రం పటం వద్ద పూలమాలతో నివాళులర్పించి మాట్లాడుతూ నిరంకుశ నిజాం దురాగతాలను ఎదురించిన ధీరుడు, తెలంగాణ విముక్తి కోసం మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా త్యజించిన త్యాగధనుడు, స్వాతంత్య్రోద్యమకారుడు మనందరి స్పూర్తి ప్రదాత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని తెలిపారు.