Suryaa.co.in

Telangana

ఏదో రోజు బాల్క సుమన్ కు కూడా అదే గతి

– ఇంకెన్నాళ్లు కల్వకుంట్ల ఫ్యామిలీకి బానిసగా బతుకుతారు?
– ఉద్యమకారుడి గొంతుకోసి టికెట్ తీసుకున్న కేటీఆర్ గురించి ఏమి చెబుతావ్
– బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా

టీఆర్ఎస్ మిడతల దండు ఈటల రాజేందర్ పై , బీజేపీ నాయుకులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. బీజేపీ నాయకులను విమర్శించే అర్హత బాల్క్ సుమన్ కు గాని, ఇతర ఎమ్మెల్యేలకు కాని లేదు. టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులకు స్థానం లేదని గుర్తించే ఈటల రాజేందర్ పార్టీని వీడి బయటకు వచ్చారు. ఉద్యమ కారులందరినీ కల్వకుంట్ల ఫ్యామిలీ అణగ తొక్కేస్తోంది. క్రమంగా తెలంగాణ ఉద్యమకారులంతా బయటకు వచ్చి బీజేపీలో చేరుతున్నారు. త్వరలో మీ గతి కూడా ఇట్లాగే ఉండబోతోంది.

ఇంకెన్నాళ్లు కల్వకుంట్ల ఫ్యామిలీకి మీరు బానిసగా బతుకుతారు? ఆనాడు, ఈనాడు ఎప్పుడూ బీజేపీ మాత్రమే తెలంగాణ పక్షపాతియే. ఉద్యమ సమయంలో, పార్లమెంట్ లో తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ సహకరించింది. ఈటల రాజేందర్ రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థిగా కమలం గుర్తుపై పోటీ చేసి గెలిచారు. ఆయన కు దమ్ము గురించి ప్రశ్నించే ముందు, కల్వకుంట ఫ్యామిలి కి మీరు బానిసగా ఇంకా ఎన్నాళ్లుంటారో మీరు ఆలోచించుకోండి.అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసేసి కల్వకుంట్ల రాజ్యాంగాన్ని రాయాలని కేసీఆర్ అన్నప్పుడు ఈ బాల్క సుమన్ ఎక్కుడున్నాడని నేను ప్రశ్నిస్తున్నా.

బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన అవకాశంతో చదువుకొని, ఆయన కల్పించిన రాజకీయాల్లో రిజర్వేషన్ వల్ల నువ్వు ఎమ్మెల్మే అయినావన్న విషయాన్ని బాల్క సుమన్, ఇతర నాయకులు గుర్తుంచుకోవాలి. అట్లాంటిది బాబా సాహెబ్ రాసిన రాజ్యాంగాన్నే మార్చాలని కేసీఆర్ చెబుతుంటే, ఇంకా ఆ పంచన చేరి వాళ్లకోసం చెక్క భజన చేయాలనుకోవడం మీ బానిస మనస్తత్వానికి నిదర్శనం.

మా పార్టీలో చిన్న కార్యకర్త కూడా ఉన్నత స్థానానికి పోగలడు… కాని టీఆర్ఎస్ కల్వకుంట్ల ప్యామీకి బానిసగా బతకకుంటే టీఆర్ఎస్ లో క్షణం కూడా చీపురు పుల్లకంటే హీనంగా చూస్తారన్న విషయం ఇప్పటికే చాలా మంది బయటకు వచ్చి చెప్పారు. ఏదో రోజు బాల్క సుమన్ కు కూడా అదే గతి పట్టడం ఖాయం.

బండి సంజయ్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీ వీధుల్లో పోరాడారు. వాటర్ కెనాన్లకు ఎదురొడ్డి ముందుకు వేళ్లారు. ఆయన గురించి మాట్లాడే ముందు అమెరికా నుంచి వచ్చి తెలంగాణ ఉద్యమకారుడి గొంతుకోసి టికెట్ తీసుకున్న కేటీఆర్ గురించి ఏమి చెబుతావ్? పార్లమెంట్ లో సుష్మా స్వరాజ్ గారు బిల్లుకు సపోర్ట్ చేయడమే కాకుండా ఎన్నో సార్లు తెలంగాణా ఏర్పాటుకు సపోర్ట్ గా మాట్లాడిన విషయం యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు.

మళ్లో సారి గవర్నర్ గురించి గాని, బీజేపీ నాయకుల గురించి కాని మాట్లాడే ముందు వెనుకా ముందు ఆలోచేంచుకోవాలని హెచ్చరిస్తున్నా. ఇప్పటికే ప్రజల్లో టీఆఎస్ ఎమ్మెల్యేలు, మంత్రలంతా చులకనయ్యారు. ఇక ముందు జనంలో తిరిగే పరిస్థితి కూడా రాదన్న విషయం గుర్తుంచుకోవాలి.

LEAVE A RESPONSE