– ఏలూరు, నంద్యాల పార్లమెంటు ప్రజాప్రతినిధులకు మంత్రి నారా లోకేష్ విందు
కృష్ణా తీరం..ఆత్మీయ సంబరానికి వేదికైంది. ఉండవల్లి నివాసంలో బుధవారం కృష్ణానది ఒడ్డున మంత్రి నారా లోకేష్ ఇచ్చిన విందు సమావేశానికి కృష్ణా నదీ జలాల వినియోగ ప్రాంతాలైన నంద్యాల, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కుటుంబసభ్యులతో కలిసి హాజరై సందడి చేశారు. యాదృచ్ఛికంగా వీరి మధ్య కృష్ణా నీటి గురించి ఆసక్తికర సంభాషణ నడిచింది.
అన్న ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వాసి అయినా ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమ అవసరాలు గుర్తించి వారికే ముందు నీరివ్వాలని పట్టుబట్టి మరీ ప్రాజెక్టులు పూర్తిచేశారని నాటి సంగతులను సీనియర్ నేతలు గుర్తు చేశారు. అందరినీ ఆత్మీయంగా పలకరించిన లోకేష్, యోగక్షేమాలు తెలుసుకున్నారు. నంద్యాల ప్రజాప్రతినిధులు విల్లంబులు తీసుకొచ్చి లోకేష్ కు కానుకగా ఇచ్చారు. సరదాగా లోకేష్ విల్లు ఎక్కుపెట్టారు.
అందరూ విజయనినాదం చేస్తూ ఫోటోలు దిగారు. పార్లమెంట్ల వారీగా నేతలతో ఫోటోలు దిగారు. కుటుంబాలతో మాట్లాడుతూ వారిచ్చిన కానుకలు స్వీకరించి, ప్రతిగా మంగళగిరి పట్టుచీరలు పెట్టారు. నేతలు తనకు ఇచ్చిన గ్రీవెన్స్ స్టేటస్ రిపోర్టు వారికి అందజేశారు. చాలా చక్కని సంప్రదాయం నెలకొల్పిన మంత్రి లోకేష్ ను కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆశీర్వదించారు.
ఈ ఆత్మీయ సమావేశానికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యేలు మంత్రి కొలుసు పార్థసారధి (నూజివీడు), చింతమనేని ప్రభాకర్ (దెందులూరు), బడేటి రాధాకృష్ణయ్య (ఏలూరు), సొంగా రోషన్ (చింతలపూడి), కామినేని శ్రీనివాస్ (కైకలూరు), పత్సమట్ల ధర్మరాజు (ఉంగుటూరు), ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ (నంద్యాల), మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి (బనగానపల్లె), భూమా అఖిలప్రియ(ఆళ్లగడ్డ), కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి (డోన్), బుడ్డా రాజశేఖర్ రెడ్డి (శ్రీశైలం), గిత్తా జయసూర్య (నందికొట్కూరు), గౌరు చరితారెడ్డి (పాణ్యం) కుటుంబసభ్యులతో హాజరయ్యారు.