హైదరాబాద్: బజరంగ్ సేన మహిళా విభాగం తెలంగాణ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా వోరుగంటి కృష్ణవేణిని నియమిస్తూ బజరంగ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.ఆర్. లక్ష్మణ్ రావు నియామకపు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కాచిగూడ లోని బజరంగ్ సేన రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో కృష్ణవేణిని ప్రియాచారి, మొగిలిగిద్ది మనోజ్, ఉమా బిరాదార్, ఉప, తదితరులు సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం కృష్ణవేణి మాట్లాడుతూ హిందూ మహిళల రక్షణకు, సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. బజరంగ్ సేన లక్ష్యాలను సాధించడానికి ఎంతటి పోరాటాలకైనా సిద్ధమని ఆమె తెలిపారు.