Suryaa.co.in

Andhra Pradesh

రైతుల ప్రయోజనాల కోసం మోదీని ఎందుకు నిలదీయలేకపోతున్నాడు?

– కేసీఆర్ కేంద్రంతోపోరాడుతుంటే, జగన్మోహన్ రెడ్డి పిల్లిలా ఇంట్లో పడుకుంటున్నాడు.
• రాష్ట్రరైతాంగ ప్రయోజనాలకోసం ముఖ్యమంత్రి, కేంద్రంతో పోరాడితే ఆయనకు మద్ధతుగా తాము కూడా నిలుస్తాం.
• అన్నవరివేయొద్దంటే, తమ్ముడుకూడా వేయొద్దని చెబితే ఎలా? వరి వేయకుండా గంజాయి వేయమంటారా?
– మాజీ మంత్రి కే.ఎస్.జవహర్
రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలువబడే ఆంధ్రప్రదేశ్ లో, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వరిపంటకు విరామంప్రకటించాల్సిన దుస్థితి తలెత్తిందని, ఒకపక్క విపత్తులు, మరోపక్క అనుకూలించనవాతావరణంతో కుదేలైన వ్యవసాయరంగాన్ని, జగన్మోహన్ రెడ్డి న విధానాలతో మరింత అస్తవ్యస్తంగా మారుస్తున్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కే.ఎస్.జవహర్ స్పష్టంచేశారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే… కౌలురైతులఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే రెండోస్థానంలోఉంటే, రైతులఆత్మహత్యల్లో మూడోస్థానంలోఉంది. వ్యవసాయరంగంపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఈ ప్రభుత్వం రైతులకుఇస్తున్న ప్రాధాన్యత ఎలాఉన్నాయో చెప్పడానికి అన్నదాతల ఆత్మహత్యల్లో రాష్ట్రం అగ్రస్థానంలోఉండటమే నిదర్శనం. రైతుబిడ్డనని ఘనంగా చెప్పుకుంటున్నవారే, ఆరైతుల్ని గాలికి వదిలేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం యాసంగిలో వరివేయొద్దని చెబుతుంటే, ఈ ముఖ్యమంత్రి రాష్ట్రంలో బోర్లకింద వరివేయొద్దని చెబుతున్నారు. అన్న ఏదో చెప్పాడని తమ్ముడు కూడా అదే మాటఅంటేఎలా? రాష్ట్రంలోఉన్నవనరులను వ్యవసాయరంగానికి ఎలా ఉపయోగించాలనే ఆలోచనలు ఈముఖ్యమంత్రి చేయడంలేదు. ముఖ్యమంత్రికి ముందస్తు ఆలోచనలేనందునే తుఫాన్లు, వరదలకు రైతాంగం తీవ్రంగానష్టపోయింది. తెలంగాణ ప్రభుత్వం యాసంగిలో వరివేయొద్దంటుంటే, ఈ ముఖ్యమంత్రి, మంత్రులు ఏపీలో బోర్లకింద వరి వేయొద్దంటున్నారు. తన ఎంపీలనుమాటిమాటికీ రఘురామరాజుపైకి పంపుతున్న ముఖ్య మంత్రి, రాష్ట్రంలోని రైతులప్రయోజనాలకోసం కేంద్రంపైకి పంపే ధైర్యంచేయలేకపోతున్నాడు?
వ్యవసాయరంగంపై ముఖ్యమంత్రికి ముందుచూపులేదు. దానిఫలితమే రైతుఆత్మహత్యల్లో రాష్ట్రందేశంలో మందంజలో ఉండటం. వరి వేయొద్దంటున్న ముఖ్యమంత్రి, మంత్రులు ఏపైరు వేయాలో చెప్పాలికదా… గంజాయి వేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశమా? బయట మార్కెట్లో కేజీ బియ్యం రూ.50వరకు అమ్ముతుంటే, రైతులుపండించే ధాన్యం కొనకుండా ఈప్రభుత్వం వారి చావులకు కారణమవుతోంది. మోటార్లకు మీటర్లు బిగించడం, గిట్టుబాటు ధరలేకుండా చేయడం, ధరలస్థిరీకరణనిధి ఇవ్వకుండా, పంటలు వేయద్దని చెప్పడంద్వారా ఈ ప్రభుత్వం అంతిమంగా వ్యవసాయాన్ని, రైతుల్ని నట్టేటముంచుతోంది. జగన్మోహన్ రెడ్డి దృష్టంతా సూట్ కేస్ కంపెనీలు, షెల్ కంపెనీలపై ఉంది తప్ప, రైతాంగంపై లేదు.
రైతు ఉద్యమానికి నరేంద్రమోదీ లాంటి వ్యక్తే తలవంచాడని జగన్మోహన్ రెడ్డి గుర్తించాలి. పాదయాత్రలో ఉన్న రైతులనుకూడా జగన్మోహన్ రెడ్డి ఎలా ఇబ్బందిపెడుతున్నాడో చూస్తున్నాం. కేసీఆర్ కాస్త అప్పుడప్పుడైనా గంభీరంగా కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాడు.. జగన్ అదికూడా చేయడంలేదుకదా? కేసీఆర్ కేంద్రంతో పోరాడుతుంటే, ఈ ముఖ్యమంత్రి పిల్లిలాగా ఇంట్లో పడుకుంటున్నాడు. ఈ ముఖ్యమంత్రి వైఖరితో అంతిమంగా రాష్ట్రం, రాష్ట్రరైతాంగమే నష్టపోతోంది.
రైతులప్రయోజనాలు కాపాడటానికి ఈముఖ్యమంత్రి ఎంచుకున్న మార్గమేంటో చెప్పాలి. రైతులకు కోపంవచ్చి, వారు తిరగబడిన నాడు ఏప్రభుత్వమూ ఎక్కవకాలం నిలవలేదు. రైస్ మిల్లులు, బియ్యం వ్యాపారులతో కుమ్మక్కైన జగన్ ప్రభుత్వం , అంతిమంగా ధాన్యాన్ని రోడ్లపై పారబోసే దుస్థితిని అన్నదాతలకు కల్పించారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్లుతెరిచి, రైతుల వేదన,రోదన పట్టించుకోవాలి. ఆయనకు ప్రతిపక్షాన్ని తిట్టడానికే సమయం ఉంటుంది గానీ, రైతులు, ప్రజలను పట్టించుకోవడానికి ఉండదు. తడిచినధాన్యమని, రంగుమారిందని, తేమలేదని వివిధకారణాలుచెబుతూ, జగన్ ప్రభుత్వం కావాలనే ధాన్యం కొనకుండా కాలయాపనచేస్తోంది.
మంత్రి కన్నబాబు , ముఖ్యమంత్రి తక్షణమే ఒకకమిటీవేసి, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతాయి.. ఏ పంటలు వేస్తే రైతులకు లాభంకలుగుతుందో, కొనుగోలు కేంద్రాల పరిస్థితేమిటో తేల్చాలి. అలానే 13జిల్లాల్లో ఎంతపంటనష్టం జరిగిందనేదికూడా తేల్చాలి. రైతులకు గోనెసంచులిచ్చి, వారివద్దఉన్న ధాన్యాన్ని కొనే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేకపోవడం సిగ్గుచేటు. ఆఖరికి ధాన్యం గోతాల్లో కూడా కుంభకోణానికి పాల్పడ్డారు. రైతులకోసం జగన్మోహన్ రెడ్డి, ప్రధానినరేంద్రమోదీని ప్రశ్నిస్తే, ఆయనకు తాముకూడా మద్ధతిస్తాం.
తనపార్టీ ఎంపీలను రఘురామకృష్ణంరాజుపైకి పంపుతున్న ముఖ్యమంత్రి, ప్రధానిమోదీవద్దకు ఎందుకు పంపడు? మా రాష్ట్రంలోని రైతులకు ఇవికావాలి.. ఏపీకి ఇవి ఇవ్వాలని ఎందుకు ఈ ముఖ్యమంత్రి డిమాండ్ చేయలేకపోతున్నాడు? ముఖ్యమంత్రి పలాయనవాదంలో ఉంటే, రైతులకు ఏం మేలుచేస్తాడు? కేంద్రాన్ని, మోదీని ప్రశ్నించలేని వ్యక్తి, రాయలసీమలో చెరువలు, డ్యామ్ లు తెగిపోతుంటే చోద్యంచూస్తున్నాడు. పైకేమో పోలవరం కడతామంటూ బీరాలు పలుకుతున్నాడు. తమప్రభుత్వంలో పంటలవిస్తీర్ణం బాగాపెంచామని చెబుతున్న ముఖ్యమంత్రి, రైతులనుంచి సకాలంలో పంటఉత్పత్తులను ఎందుకు కొనుగోలు చేయలేకపో తున్నాడు? ముఖ్యమంత్రి తన బాధ్యతలనుంచి తప్పించుకోవాలనిచూస్తే, అంత తేలిగ్గా ప్రతిపక్షంగా తాము వదిలిపెట్టము.

LEAVE A RESPONSE