Suryaa.co.in

Telangana

అచ్చే దిన్ కు స్వాగతం

– తెలంగాణ ప్రజలకు సేవ చేయడంలో సంతోషంగా ఉన్నా
– బిజెపి అంటే బెచో జనతా జనతాకి ప్రాపర్టీ
– మోదీ పాలనపై కేటీఆర్ ఎద్దేవా
– కేసీఆర్ తర్వాత నా అభిమాన నేత అబ్దుల్ కలామ్
– నెటిజన్లతో కేటీఆర్ చిట్‌చాట్

మంత్రి తారకరామారావు ట్విట్టర్లో నెటిజన్ల తో సంభాషించారు. ఆస్క్ కేటీఆర్ పేరుతో జరిగిన ఈ సంభాషణలో అనేక అంశాల పైన స్పందించారు.
మంత్రి కేటీఆర్ ట్విట్టర్ సంభాషణ ముఖ్యాంశాలు

ఎల్పిజి సిలిండర్ ధర 50 రూపాయలు పెరిగినప్పుడు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రభుత్వాన్ని విమర్శించిన మంత్రి ఇప్పుడు, స్పందించకపోవడం హిపోక్రసీ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ పైన రాష్ట్ర ప్రభుత్వ టాక్స్ లు తగ్గించాలని ప్రధానమంత్రి చెప్పిన మాట ఆయన ద్వంద ప్రమాణాలకు అద్దం పడుతుంది 2014లో 410 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఈరోజు వెయ్యి రూపాయలకు చేరిందని, ఇది కేవలం మోడీ పరిపాలన వల్లనే సాధ్యం అయిందని, అచ్చే దిన్ కు స్వాగతం అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

పెట్రోల్ డీజిల్ తో పాటు ఎల్పిజి ధరల విషయంలో భారత దేశాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. 2024 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అనేక ప్రతిపక్షాల నుంచి కాంగ్రెస్ బిజెపి నుంచి పోటీ ఉంటుందన్నారు. అయితే ప్రజల ఆశీర్వాదం తో తమ సుపరిపాలన కొనసాగేలా విజయం దక్కుతుందని అన్నారు.

ఈరోజు కాంగ్రెస్ కన్నా గట్టిగా బీజేపీని, ప్రధాని మోడీ విధానాలను టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో నిలదీస్తున్నదని, అయితే ఈ విషయంలో జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించే అవకాశం ఉన్నదా అన్న ప్రశ్నకు సమాధానంగా స్పందించిన కేటీఆర్ భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు అన్నారు

మీ సేవలు, మీ నాయకత్వం జాతీయస్థాయిలో కావాలని ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, తెలంగాణ ప్రజలకు సేవ చేయడంలో సంతోషంగా ఉన్నానని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వదని ఇప్పటికే తేలిపోయిందని, వారి పైన ఆశలు వదులుకున్నానని మా సొంతంగా ఉద్యోగాల కల్పనపై ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా తెలంగాణకు ఐఐఎమ్, IISER, NID, ఐ ఐ ఐ టి వంటి ఉన్నత విద్యా సంస్థలను, ఒక్క దానిని కూడా తెలంగాణకు కేటాయించలేదని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డగోలుగా అమ్ముతున్న బిజెపి అంటే బెచో జనతా జనతాకి ప్రాపర్టీ అని అభివర్ణించారు. ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ను పునః ప్రారంభించాలని మీరు కేంద్రానికి లేఖ రాశారు కదా దానికి ఏమైనా స్పందన వచ్చిందా అన్న ప్రశ్నకు సమాధానంగా.. కేంద్ర ప్రభుత్వం బేచో ఇండియా పథకం కింద అద్భుతంగా పనిచేస్తుందని, ఇప్పటిదాకా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పైన కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు అన్నారు.

2500 కోట్లు ఇచ్చి కర్ణాటకలో ముఖ్యమంత్రి సీటు కొనుక్కోమని చెప్పారన్న బిజెపి ఎమ్మెల్యే వ్యాఖ్యలు , బిజెపి రియల్ ఫేస్ ని చూపిస్తుందన్నారు. హర్యానాలో బిజెపికి చెందిన సొంత ఎంపీలు, ఎమ్మెల్యేలే మూడు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం చేసిందని బయట చెబుతున్నదాని కన్నా ఏం చెప్తాం అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు పరిశుభ్రమైన త్రాగు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్పందిస్తూ, మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ సమస్య తొలగిపోయిందని, ఒకవేళ ఎక్కడైనా కొరత ఉంటే మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తామన్నారు.

రీజినల్ రింగ్ రోడ్ కి సంబంధించి భూసేకరణ త్వరలో ప్రారంభం అవుతుందన్నారు. జహీరాబాద్లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి సంబంధించిన ప్రాజెక్టు భూసేకరణ అత్యంత కీలకమైనదని అయితే ఇప్పటికే అనేక మంది పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.

హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల ఈకో సిస్టం అభివృద్ధి పైనts redco కార్యక్రమాలు రూపొందిస్తుందని కేటీఆర్ తెలిపారు. నగరంలో డబుల్ డెక్కర్ బస్సులకు సంబంధించిన ఏర్పాట్లపైన హెచ్ఎండిఎ, టి ఎస్ ఆర్ టి సి ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు.

బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ హైకోర్టులో పెండింగ్లో ఉందని దాన్ని త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరం త్వరలోనే వంద శాతం మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్లను కలిగి ఉండబోతుందని, ఆ తర్వాత నగరంలోని హుస్సేన్ సాగర్ తో పాటు ఇతర చెరువులు కలుషితం అయ్యే అవకాశం తగ్గుతుందన్నారు.

హైదరాబాద్ నగరంలో పవర్, డ్రింకింగ్ వాటర్, రహదారుల నిర్వహణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని, నగరంలో మౌలిక వసతుల కల్పన అనేది నిరంతరం కొనసాగే కార్యక్రమం అని కేటీఆర్ తెలిపారు.

కరోనా సంక్షోభం తర్వాత ఆరోగ్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున మౌలిక వసతులు నిర్మాణం కోసం నిధులను కేటాయించిందని, ఇప్పటికే హైదరాబాదులో 3 నూతన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రులను, వరంగల్లో ఎంజీఎం ఆస్పత్రిలో నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు మొత్తం 33 జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రారంభం కానున్నాయని తెలిపారు.

నాగోల్ ఫ్లైఓవర్ ఈ ఆగస్ట్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. సమగ్రమైన ప్రజా రవాణా వ్యవస్థ ద్వారానే ప్రధాన సమస్యలను తొలగిస్తుందని, fly overs ఇందుకు సహకరిస్తామన్నారు.

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం నగర పౌరుల బాధ్యత కూడా ఉందని పోలీసులు కేవలం వాటిని అమలు చేసేలా ప్రయత్నం చేయగలుగుతారని అంతిమంగా సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది అన్నారు.

ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ విలువలు ఉండాల్సిందే అని, వాక్ స్వాతంత్రం పేరిట ఇతరులను ఇబ్బంది పెట్టడం సరైనది కాదన్నారు. హైదరాబాదులో క్రికెట్ మ్యాచ్లు జరగడంలేదని, ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లు జరిగేలా చూడాలనుకుంటున్నామన్న అభిమాని ప్రశ్నకు సమాధానం కోసం bcci కి చెందిన జేషా, సౌరవ్ గంగూలీలని అడగాలన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల క్రీడలకు సమగ్రమైన సహకారం అందిస్తూ క్రీడా రంగాన్ని బలోపేతం చేసేందుకు తెలంగాణ నూతన క్రీడా పాలసీని సిద్ధం చేస్తున్నాం. ఒకప్పుడు కరువుకాటకాలతో తల్లడిల్లిన పాలమూరు జిల్లా ఈరోజు పచ్చగా మారడం సంతోషంగా ఉందన్నారు. గత ఏడు సంవత్సరాల 120 శాతానికిపైగా తెలంగాణలో ఫార్మింగ్ పెరిగిందని, ఇందుకు ప్రధానంగా 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, మిషన్ కాకతీయ, రైతు బీమా, సాగునీటి ప్రాజెక్టులు ప్రధాన కారణమన్నారు.

రాజకీయాల్లోకి రావాలనుకుంటే యువత, అత్యంత సహనంతో కఠినంగా వర్క్ చేయాలని సలహా ఇస్తున్నారు. తన కుమారుడు హిమాన్షు పాఠశాలలో క్రియేటివ్ యాక్షన్ ప్లాన్ కి ప్రాతినిధ్యం వహించడం పట్ల ఒక తండ్రిగా గర్వపడుతున్నా అన్నారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ అకాల మరణం పాలయ్యారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గారి తర్వాత భారతదేశంలో తనకు అత్యంతమైన నాయకుడు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్నారు.

LEAVE A RESPONSE