Suryaa.co.in

Editorial

ఉన్నమాటంటే ఉలుకెందుకు నాయకా?

– ఆంధ్రాలో రోడ్లన్నీ అద్దమేనట
– నీళ్లు గంగాప్రవాహమేనట
-వీధులన్నీ విద్యుత్ కాంతులేనట
– తారకరాముడికి తత్వం తెలిసింది
– సత్యం తెలియాల్సిందిక సచివులకే
( మార్తి సుబ్రహ్మణ్యం)

K-Taraka-Ramarao-1‘పక్కనున్న రాష్ట్రంలో కరెంట్, నీటి సౌకర్యం లేదని రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని అక్కడికి వెళ్లొచ్చిన నా స్నేహితులు నాకు చెప్పారు. అక్కడ ఉంటే నరకంగా ఉందని చెప్పారు. అనుమానం ఉంటే బస్సులేసుకుని అక్కడికి వెళ్లిరండి. ఆ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణలోనే రోడ్లు, మౌలిక సదుపాయాలు

ఎక్కువ’.. ఇదీ తెలంగాణ మంత్రి, టీఆర్‌ఎస్ ఉత్తరాధికారి కల్వకుంట్ల తారకరామారావు, క్రెడాయ్ ప్రాపర్టీ షోలో చేసిన తాజా వ్యాఖ్య. అంటే ఆలస్యంగానయినా తారకరాముడికి తత్వం తెలిసొచ్చింది. సంతోషం.

తారకరాముడు అలా ఆ వ్యాఖ్య చేశారో లేదో.. వెంటనే ఆంధ్రా నుంచి మంత్రులు, వైసీపీ నేతలు తారకరాముడిని వరసగా తగులుకున్నారు. ఆంధ్రాలో నీళ్లు గంగా ప్రవాహంలా ప్రవహిస్తుంటాయని, వీధిలైట్లన్నీ విద్యుత్ కాంతులతో వెలిగిపోతుంటాయని, రోడ్లన్నీ అద్దంలా మెరిసి.. బాపూ సినిమా హీరోయిన్ మాదిరిగా, వంగి ముద్దుపెట్టుకోవాలంత ముద్దొచ్చేస్తాయన్నది వారి అనుగ్రహ భాషణం. హబ్బో.. హబ్బో.. హబ్బోబ్బో. పైనుంచి వచ్చే ఆదేశాల ప్రకారం మంత్రులు ఆ ప్రకారం కత్తులూ, కటార్లతో కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించి స్వామి భక్తి ప్రదర్శించారు. తప్పు లేదు. ఎవరి భక్తి వారిది. ఎవరి మార్కులు వారికి.

సరే రోజా, గుడివాడ అమర్నాధ్, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్ లాంటి కొత్తమంత్రులు మాట్లాడార ంటే అర్ధం ఉంది. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ వంటి సీనియర్లు కూడా కేటీఆర్ వ్యాఖ్యలను మరీ మితిమీరిన స్వామిభక్తితో విమర్శించడమే విడ్డూరం. అందులో సత్తిబాబు ఫ్యామిలీ హైదరాబాద్‌లోనే ఉంటుంది. అలాంటి ఆయన తన ఇంటికి కరెంటుపోతే జనరేటరు వేయాల్సి వచ్చిందని, అసలు నగరంలో కరెంటే ఉండ దని సెలవివ్వడమే వింత.

min-prasanth-reddy-tsనిజానికి ఒకప్పుడు హైదరాబాద్‌లో కరెంటు కోతలు ఉంటే వార్త. ఇప్పుడు కరెంటు కోతలు లేకపోతే వార్త. ఇప్పటివరకూ రాజధాని నగరంలో పవర్ కట్ అనేది కనిపించదు. బహుశా తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి చెప్పినట్లు.. బొత్స తన ఇంటికి కరెంటు బిల్లు కట్టకపోతే, కరెంటు కట్ చేసి ఉండొచ్చేమో?

ఇక పెద్దిరెడ్డి కూడా విచిత్రమైన విమర్శ చేయడమే విడ్డూరం. తెలంగాణలో ఎన్నికలున్నందున, కేటీఆర్ రాజకీయ ప్రయోజనం కోసమే ఆ వ్యాఖ్య చేశారట. తెలంగాణలో ఎన్నికలున్నాయన్న విషయం ఆయన చెప్పిన తర్వాతే తెలిసింది. మరి ఎన్నికలు ఎప్పుడు పెట్టిస్తున్నారో కూడా చెబితే ఆయన పుణ్యం
ycp-min ఊరకపోదు. ప్రజలు, పార్టీ నేతలు సంతోషిస్తారు. ఏపీలో కరెంట్ సమస్యలు లేవని, ఒకవేళ ఏదైనా అంతరాయం కలిగినా అరగంటలోనే దానిని తీరుస్తున్నారన్నది ఆయన వెల్లడించిన కొత్త నిజం.

సలహాదారు సజ్జల మరో అడుగుముందుకేసి..కేటీఆరయినా, మరొకరయినా ముందు వాళ్ల సంగతి, ఇతరుల సంగతి మాట్లాడాలని హితవు పలికారు. ‘‘ఉమ్మడి హైదరాబాద్‌లోనే నగరం అభివృద్ధి చెందింది. పీవీ ఎక్స్‌ప్రెస్‌వే వైఎస్ హయాంలో ప్రారంభించారు. ఏపీలో అధిక వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయి. తెలంగాణలోనూ రోడ్లు బాగోలేవు. మొన్నటివరకూ తెలంగాణలోనూ కరెంటు కోతలున్నాయ’’న్నది సజ్జల వాదన.

అయితే పీవీ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం జరిగింది కాంగ్రెస్ హయంలో. అయితే, వైసీపీకి దానితో ఏం సంబంధం? వైఎస్ కాంగ్రెస్‌లో కదా సీఎం అయింది? అంటే అప్పుడు ఆ పని కాంగ్రెస్ చేసినట్లుకదా? మరి దానిని వైసీపీ ఖాతాలో ఎలా వేసుకుంటారన్నది బుద్ధిజీవుల సందేహం. దాన్నలా పక్కకుపెడితే.. మొన్నటివరకూ తెలంగాణలో కూడా కరెంటు కోతలున్నాయని సజ్జల వ్యాఖ్యానించారంటే.. ఇప్పుడు లేనట్లే కదా దాని అర్ధం?! మరి ఆ ప్రకారం హైదరాబాద్‌లో కరెంటు ఉండటం లేదంటూ సత్తిబాబు చేసిన ఆరోపణ అబద్ధమన్నట్లేకదా? అన్నది మరో లాజిక్కు పాయింటు.

ఓ పక్క వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని స్వయంగా అంత లావు సజ్జలనే స్వయంగా చెబుతుంటే.. కొత్త మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాత్రం తన నియోజకవర్గంలో 200 కోట్లతో రోడ్ల
ap-roads మరమ్మతులు చేస్తున్నామని సెలవిచ్చారు. మరి దెబ్బతిన్న రోడ్లకే కదా మరమ్మతు చేసేది? అంటే రోడ్లు అధ్వానంగా ఉన్నట్లే కదా? ఆరకంగా చూసినా కేటీఆర్ చెప్పింది కరస్టేగా కారుమూరి నాగేశ్వరా?

పైగా జగనన్నకు జగమంతా మంచి పేరు వస్తుండం వల్ల.. ఆయనను ఓమాట అంటే తాను పెద్దవాడినయిపోవచ్చని, కేటీఆర్ అలా జగనన్న పాలనను కావాలనే విమర్శించారట. హమ్మా.. కేటీఆర్ అంత కుట్ర చేస్తున్నారా? అసలు మా ఆంధ్రాలో రోడ్లు, కరెంటు సంగతి పక్కనపెట్టి, మీ రాష్ట్రంలో మీరు ఇస్తారన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కతేమిటో తేల్చమని కేటీఆర్‌పై కారుమూరి కారాలుమిరియాలు నూరుతున్నారు. ఫర్వాలేదు. పిట్ట కూతకొచ్చింది!

జబర్దస్తు మానేసిన కొత్త మంత్రి రోజక్క కూడా.. మా రాష్ట్రంలో ‘‘పంచకల్యాణి గుర్రం కూడా ఈర్ష్యపడేలా’’ జరుగుతున్న అభివృద్ధి పనులను చూసేందుకు, స్వయంగా కేటీఆర్ తన ఫ్రెండ్సుతో రావాలని ఆహ్వానించింది. అదేదో సినిమాలో బాలకృష్ణ చెప్పనట్లు… డేటు, టైమూ ఫిక్సు చేయమని చెప్పింది. అప్పుడు ఆ అభివృద్ధి చూసి కేటీఆర్ మాట్లాడాలని సవాల్ చేశారు. అవును. రోజక్క చెప్పింది నిజమే. ఓసారి ఆంధ్రాకు వెళ్లొస్తే, తారకరాముడికీ తత్వం స్వయంగా తెలుస్తుంది. కాకపోతే రోజక్క ఏపీ పరువు నిలబెట్టాలంటే.. కేటీఆర్ అండ్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, కాస్త నేషనల్ హైవేల మీదుగా వారిని తీసుకువెళితే మంచిదన్నది రోజక్క అభిమానుల సలహా.

మరో విశేషమేమిటంటే… తనకు మంత్రి పదవి వచ్చిన తర్వాత తొలిసారిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లిన రోజక్క, అక్కడ
roja-kcr కవితతో సంప్రదాయబద్ధంగా మర్యాదలు చేయించుకున్నారు. ఆ తర్వాత.. బయటకొచ్చి కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించడమే గమ్మతు. దేని దారి దానిదే!

మరో మహిళా మంత్రి వనితయితే, కేటీఆర్ భుజంపై గురిపెట్టి తెలంగాణపై తుపాకీ పేల్చే ప్రయత్నం చేయటం కొంత ఆసక్తికరం. ఆమె కేటీఆర్ వ్యాఖ్యలను సూటిగా కాకుండా, వ్యంగ్యాస్త్రాలతో ఖండించారు. ‘తెలంగాణతో పోలిస్తే అభివృద్ధి అంశాల్లో మేం నెమ్మదిగా వెళుతున్నాం. తెలంగాణ తరహాలో ఏపీలో మాదకద్రవ్యాల వినియోగం, పబ్ కల్చర్ లేదు’ అని సెటైర్లేశారు. అంటే తెలంగాణలో డ్రగ్స్ ఎక్కువగా ఉన్నాయన్నది మహిళా మంత్రి కవి హృదయమన్నమాట.

వాకే… వాకే.. కేటీఆర్ వ్యాఖ్యలను ఏకబిగిన ఖండించిన ఏపీ మంత్రులంతా … ఏపీలో శిధిలావస్థకు చేరిన రోడ్లను బాగుచేయడానికి, కాంట్రాక్టర్లు ఎందుకు రావడంలేదో సెలవిస్తే బాగుండేది. మొన్నామధ్య జనసేనాధిపతి పవన్ కల్యాణ్ పిలుపు మేరకు.. రాష్ట్రంలో ఎక్కడ
pavan-roadsరోడ్లపై గుంతలు పడ్డాయో, అక్కడ పార్టీ జెండా ఎందుకు ఎగరేశారు? పవన్ కూడా స్వయంగా ఏయే జిల్లాల్లో రోడ్లుబాగోలేవో, ఆ ఫోటోలను ఎందుకు ప్రదర్శించారో కూడా సెలవిస్తే ఇంకా బాగుండేది.

అలాగయితే..ఏపీలో 8,970 కిలోమీటర్ల మేరకు రహదారులన్నీ గుంతలు పడినందున.. వాటి మరమ్మతు-నిర్వహణకు, 2 వేల కోట్ల రుణం కోసం ఆర్‌అండ్‌బీ పడిగాపులు కాస్తోందని.. 200 కోట్లకు మించి
kolika ఇవ్వలేమని ప్రైవేటు బ్యాంకులు చెప్పాయని.. పెట్రోల్ అమ్మకాలపై విధించే సెస్సును తాకట్టు పెట్టి అప్పుచేసుకోమని ఆర్‌అండ్‌బీకి సర్కారు సలహా ఇచ్చిందని.. వస్తున్న వార్తలన్నీ నిజమా? అబద్ధమా? జగన్నాధుడికెరుక?

LEAVE A RESPONSE