– తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటే పండుగ బతుకమ్మ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (కేటీఆర్) రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఆడబిడ్డలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.