– గట్టి మేళాలు మోగుతున్నాయి ..వట్టి మాటలు ఇంకెన్నాళ్లు?
– గోల్డ్ షాపుల్లో స్టాక్ లేదా?
– ఆడబిడ్డలు బాధపడితే అరిష్టం
– సీఎం రేవంత్‌కు ఎక్స్ వేదిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నాస్త్రాలు
హైదరాబాద్: లక్షలాది లగ్గాలు జరిగే మ్యారేజ్ సీజన్ మళ్లా వచ్చింది..ఈ సారి కూడా తులం బంగారం తూచ్ తూచేనా ముఖ్యమంత్రీ ?శుభ ముహుర్తాలతో పెళ్లి సందడి మొదలైంది.. మరి మీ కల్యాణ మస్తు కానుక అమలుకు సుముహూర్తం దొరకట్లేదా ? పదిగ్రాముల పసిడి ఆశజూపి ఆడబిడ్డల ఓట్లు వేయించుకున్నావ్.. ఆడిన మాట తప్పి పచ్చని పందిళ్ల సాక్షిగా పచ్చి దగా చేస్తున్నావ్.
కనకపు సింహాసనమున కూర్చున్నాక…కనకం హామీని మర్చిపోయావా? లంకె బిందెలు దొరకలేదన్న నైరాశ్యంతో నవ వధువులకు ఇవ్వాల్సిన పుత్తడిని ఎగ్గొట్టడం భావ్యమా?పేదింటి పెండ్లి కూతుళ్లకు టన్నుల కొద్ది గోల్డ్ బాకీ పడ్డావ్ నీవు… ఒలంపిక్స్ లో మోసాల పోటీలు పెడితే నీకు గోల్డ్ మెడల్ గ్యారెంటీ..!
గట్టి మేళాలు మోగుతున్నాయి ..వట్టి మాటలు ఇంకెన్నాళ్లు..గోల్డ్ షాపుల్లో స్టాక్ లేదా..? బంగారు గనుల్లో తవ్వకాలు ఆగిపోయినయా? వాగ్దానం చేసి వంచించడం మంచిది కాదు..ఆడబిడ్డలు బాధపడితే అరిష్టం..ఈ సీజన్‌లోనైనా తులం బంగారం పథకాన్ని ప్రారంభించండి..!