Suryaa.co.in

Telangana

మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు మాత్రం సంపెంగ నూనె

– రేవంత్ పాలనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా

హైదరాబాద్: మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావాలె అన్నట్టుంది రేవంత్ వైఖరి. తెల్లారి లేస్తే బీద అరుపులు. రాష్ట్రం అప్పులపాలైంది అని, డబ్బులు లేవని. మరొకవైపు మూసి పేరిట ఈ లక్ష యాభై వేల కోట్ల సోకులు, ఆర్భాటం ఎవరికోసం?

రైతు రుణమాఫీకి డబ్బులు లేవు. రైతుబంధుకి డబ్బులు లేవు. రైతు కూలీలకు డబ్బులు లేవు. కౌలు రైతులకు డబ్బులు లేవు. నిరుద్యోగ భృతికి డబ్బులు లేవు. పేదవాళ్లకు పెన్షన్లకు డబ్బులు లేవు. మహిళలకు మహాలక్ష్మి పథకం అమలుకు డబ్బులు లేవు. ఆడపిల్లలకు స్కూటీలకు డబ్బులు లేవు. ఉద్యోగస్తులకు DAలకు డబ్బులు లేవు.

మునిసిపాలిటీలలో పారిశుధ్య కార్మికులకు జీతాలకు డబ్బులు లేవు. గ్రామాలలో పిచికారీ మందులకు డబ్బులు లేవు. బడిపిల్లలకు చాక్ పీసులకు డబ్బులు లేవు. దవాఖానలో మందులకు డబ్బులు లేవు. దళితబందుకు డబ్బులు లేవు. విద్యార్థుల స్కాలర్ షిప్లకు డబ్బులు లేవు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు లేవు. తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లేవు. చెరువుల్లో చేపపిల్లలు పెంచడానికి డబ్బులు లేవు. రెండో విడత గొర్రెల పంపిణీకి డబ్బులు లేవు.

LEAVE A RESPONSE