– కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ పై మాజీ మంత్రి కేటీఆర్ ఉపయోగించిన భాష పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
హైదరాబాద్: రాహుల్ గాంధీని ఆ భాష లో విమర్శిస్తున్నారంటే కేటీఆర్ అసహనం పరాకాష్ట కి చేరింది. అసహనం లో మీ ఓపికను కోల్పోయి, మీ ఓటముల పరంపర కొనసాగుతున్న సందర్భంలో రాహుల్ గాంధీ ని విమర్శించడం ద్వారా పెద్దోడు అయిత అనుకుంటున్నావ్? రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం. స్వేచ్ఛ,స్వాతంత్య్రం కోసం , అనంతరం దేశ ఐక్యత కోసం ప్రాణాలర్పించిన కుటుంబం.
రాహుల్ గాంధీ మనసు కి సంబంధించిన విషయంలో ఇటువంటి భాష వాడి గొప్ప వాడివి కావు. నీ గౌరవాన్ని పోగొట్టుకుంటున్నావ్ కేటీఆర్. రాహుల్ గాంధీ ని ఈవిధంగా విమర్శించడం మానుకో.
రాజకీయాల్లో విమర్శలు ,ప్రతి విమర్శలు ఉంటాయి.. కానీ ఈవిధంగా భాషను ఉపయోగించి మీకు ఉన్న అసహనాన్ని ప్రస్టేషన్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు దానిని మానుకోవాలి. జాగ్రత్త.. రాహుల్ ని ఈవిధంగా విమర్శిస్తే ప్రజలే మీకు బుద్ధి చెబుతారు. ఇప్పటికే ప్రజలు అనేకసార్లు బుద్ధి చెప్పారు కేటీఆర్ అని హెచ్చరిస్తున్న.