Suryaa.co.in

Andhra Pradesh

సామాజిక గౌర‌వం క‌ల్పించిన సీఎం జ‌గ‌న్‌కు జేజేలు

నంద్యాల‌లో టిడ్కో ఇళ్ల పంపిణీలో ముఖ్య‌మంత్రికి ధ‌న్య‌వాదాలు తెలిపిన ల‌బ్ధిదారులు

నంద్యాల‌: సామాజిక గౌరవం కల్పించిన ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డికి టిడ్కో ఇళ్ల ల‌బ్ధిదారులు హర్షధ్వానాల మధ్య జేజేలు పలికారు. నవరత్నాలు పేదలు అందరికీ ఇళ్లు వై.య‌స్.ఆర్.జగనన్న జి+3 పథకం క్రింద ఏ.పి. టిడ్కో ద్వారా రికార్డు స్థాయిలో రూ. 850 కోట్ల వ్యయంతో నంద్యాల పట్టణంలో భారీగా 8,700 మంది లబ్దిదారులు శ‌నివారం టిడ్కో గృహ ప్రవేశాలు చేశారు. టిడ్కో ఇళ్ల స‌ముదాయాల‌ను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , మైనారిటీ వెల్ఫేర్ శాఖ మంత్రి అంజాద్‌బాషా, ఏ.పి.టిడ్కో చైర్మెన్ జమ్మాన ప్రసన్న కుమార్, ఎంపీ పోచా బ్ర‌హ్మానంద‌రెడ్డి, శాసన సభ్యులు శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించారు.

నంద్యాల పట్టణ పురపాలక సంఘం లో నిర్మిస్తున్న 10,000 గృహాలలో ఇవాళ‌ 8700 మంది లబ్ధిదారులకు ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు తో పాటుగా ఇంటి తాళాలను మంత్రులు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఆదిమూల‌పు సురేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినదని తెలిపారు. టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులకు సంబందించి రిజిస్ట్రేషన్ ఫీజు మొత్తం ప్రభుత్వమే భరించే విధముగా నిర్ణయం తీసుకోవడం అనేది పేదల పట్ల ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అభిమానానికి నిదర్శనమన్నారు. మార్చి 2023 నాటికి రాష్ట్రం మొత్తం మీద సుమారుగా 2 .62 లక్షల గృహాలను లబ్ధిదారులకు అందించే విధంగా కార్యాచరణను రూపొందిస్తున్నామని తెలిపారు.

పేదల సంక్షేమం, అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేసి దేశములో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధముగా ఒక్క రూపాయి కే హౌసింగ్ పధకంలో పేదలకు మేలు జరిగే విధంగా అనేక సంక్షేమ పథకాలలో విప్లాత్మకమైన మార్పులు తీసుకువచ్చి పేదల గుండెల్లో చెరగని ముద్ర వేశారని, అటువంటి ముఖ్యమంత్రి రాబోయే మూడు దశాబ్దల పాటు అధికారంలో ఉండాల‌ని కోరారు. కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ ఇస్సాక్‌, టిడ్కో మేనేజింగ్ డైరెక్టర్ సి.హెచ్.శ్రీధర్ (ఐ.ఏ.ఎస్), చీఫ్ ఇంజనీర్ గోపాలక్రిష్ణా రెడ్డి , టిడ్కో డైరెక్టర్స్ కానురి నాగేశ్వరి , మునిసిపల్ కమిషనర్ చింతా రవి చంద్రా రెడ్డి , టిడ్కో సూపరెంటెండింగ్ ఇంజనీర్ జి.రాజశేఖర్, ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్ర శేఖర్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE