• ఆళ్లగడ్డ నియోజకవర్గం పెద్దచింతకుంట గ్రామంలో ఉపాధి హామీ కూలీలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామం గతంలో పంచాయతీలో ఉండేది, ఉపాధిహామీ పనులు ఉండేవి.
• ఆళ్లగడ్డ మున్సిపాలిటీ కావడంతో మా గ్రామానికి ఉపాధి హామీ పనులు నిలిచిపోయాయి.
• దేవరాయపురం దళితులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలి.దేవ రాయపురం వార్డులో డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్ జమానాలో ఉపాధి హామీ పథకాన్ని సైతం వైసిపినేతలు ఆదాయవనరుగా మార్చకున్నారు.
• గత నాలుగేళ్లలో దేశం మొత్తమ్మీద ఎపిలోనే అత్యధిక రూ.261 కోట్ల రూపాయల నరేగా నిధులు దుర్వినియోగమయ్యాయి.
• విలీన గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పథకం అమలుపై కేంద్రానికి లేఖరాస్తాం.
• జగన్ ప్రభుత్వం వచ్చాక కేవలం పన్నుల కోసమే శివారు గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేశారు.
• విలీనం చేసిన గ్రామాల్లో సౌకర్యాలను మాత్రం గాలికొదిలేశారు.
• దేవరాయపురంలో దళితులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. గ్రామంలో డ్రైనేజి, ఇతర మౌలిక సదుపాయలు అభివృద్ధి చేస్తాం.