Suryaa.co.in

Telangana

మరో నందిగ్రామ్ లాగా లగచర్ల

– రేవంత్ అల్లుడి కోసం కొడంగల్ లో రైతుల భూములు లాక్కున్నారు
– తిరుపతి రెడ్డికి ఎందుకు ఎస్కార్ట్ వాహనం ఇస్తున్నారో డీజీపీ,సిఎస్ సమాధానం చెప్పాలి
– స్థానిక ఎంపీ వెళ్తే ఎస్కార్ట్ ఇవ్వలేదు
– లగచర్ల తండాల్లో రజాకార్ల పాలన
– రజాకార్ల నాయకుడు రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి
– ఏడవ గ్యారెంటీ కింద రాష్ట్రంలో రజాకార్ల పాలన
– రేవంత్ రెడ్డి,బండి సంజయ్ ది ఫెవికాల్ బంధం
– ఆర్.ఎస్.బ్రదర్స్ లాగా ఇద్దరు పని చేస్తున్నారు
– డి.కె.అరుణను లగచర్ల గ్రామానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటే బండి సంజయ్ ఎందుకు మాట్లాడలేదు?
– కేటీఆర్ బామ్మర్ధి ఇంట్లో పార్టీ జరిగితే రేవంత్ రెడ్డి ఫోన్ చేయగానే సంజయ్
స్పందించారు
-బిఆర్ఎస్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద ,కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్

హైదరాబాద్: రాష్ట్రంలో 11 నెలలుగా ఆటవిక పాలన నడుస్తోంది. అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు తన మార్క్ ను చూపలేకపోయారు. అక్రమ కేసులు,అక్రమ అరెస్టులు చేస్తున్నారు. కేటీఆర్,హరీష్ రావు పై బురదచల్లుతున్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలహీనపర్చాలని కుట్ర చేస్తున్నారు.

కాంగ్రెస్,బీజేపీ రాష్ట్రంలో ఒక్కటి అయ్యాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ రేవంత్ రెడ్డి సహాయమంత్రిగా పని చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని దించే ప్రయత్నం చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలని బండి సంజయ్ అన్నారు. రేవంత్ రెడ్డి,బండి సంజయ్ కలిసి బిఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని చూస్తున్నారు. రేవంత్ రెడ్డి,బండి సంజయ్ బంధం ఫెవికాల్ బంధంలా మారింది. ఆర్.ఎస్.బ్రదర్స్ లాగా ఇద్దరు పని చేస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఘటన జరిగితే బండి సంజయ్ ఎందుకు నోరు విప్పడం లేదు? స్వంత ఎంపీ డి.కె.అరుణను లగచర్ల గ్రామానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటే బండి సంజయ్ ఎందుకు మాట్లాడలేదు? లగచర్లలో గిరిజన రైతులను అరెస్టు చేస్తే బండి సంజయ్ ఏం చేస్తున్నారు?

రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సహకరిస్తున్నారు. కొడంగల్ అగ్నిగుండంగా మారితే బండి సంజయ్ ఎక్కడ నిద్రపోయారు?కేటీఆర్ బామ్మర్ధి ఇంట్లో పార్టీ జరిగితే రేవంత్ రెడ్డి ఫోన్ చేయగానే బండి సంజయ్ స్పం స్పందించారు. బండి సంజయ్ కు నెట్ లేదు వర్క్ లేదు వర్త్ లేదు. కేటీఆర్ ను వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి,బండి సంజయ్టార్గెట్ చేస్తున్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో లూటీ చేయాలని అనుకున్నారు. స్వంత అల్లుడి కోసం కొడంగల్ లో రైతుల భూములు లాక్కున్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి, బండి సంజయ్ అగ్నిగుండంలా మారుస్తున్నారు. తన ప్రయివేటు సైన్యంలా పోలీసులను వాడుకుంటున్నారు. లగచర్ల ఘటనకు ప్రభుత్వ వైఫల్యం కారణం. అధికారులపై దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. పార్టీలకు అతీతంగా భూములు ఇవ్వమని తిరుగుబాటు చేశారు.

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి స్క్రిప్టును కాంగ్రెస్ నేతలు చదువుతున్నారు. బిఆర్ఎస్ నేతలను ఇరికించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సార్లు ప్రయత్నాలు చేసింది. కాళేశ్వరం కొట్టుకు పోయిందని ప్రచారం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో డ్రామాలు చేస్తున్నారు. బండి సంజయ్ రేవంత్ రెడ్డితో చేతులు కలిపారు.

లగచర్ల మరో నందిగ్రామ్ లాగా మారుతోంది. కొడంగల్ నియోజకవర్గంలో 144 సెక్షన్ ఉంది. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి వార్డు మెంబర్ కాదు. ఎందుకు తిరుపతి రెడ్డికి ఎస్కార్ట్ వాహనం ఇస్తున్నారో డీజీపీ,సిఎస్ సమాధానం చెప్పాలి? లగచర్ల తండాల్లో రజాకార్ల పాలన సాగిస్తున్నారు. రజాకార్ల నాయకుడు రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి. స్థానిక ఎంపీ వెళ్తే ఎస్కార్ట్ ఇవ్వలేదు.

లగ చర్ల లో రైతుల నిరసన వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు. లగచర్ల గిరిజనులపై రాత్రికి,రాత్రి దాడులు చేసి వారిని కొట్టారు. ఏడవ గ్యారెంటీ కింద రాష్ట్రంలో రజాకార్ల పాలన నడుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇచ్చింది. ఒక్కో గిరిజనుడిని గంట సేపు పోలీసులు కొట్టారు. సమైక్య పాలనలో ఇలాంటి సంఘటనలు జరగలేదు.

కేసీఆర్ ఉన్నంత సేపు రేవంత్ రెడ్డి ఆటలు సాగవు. రేవంత్ రెడ్డి పాలసీలు బాగాలేక కేసులు పెడుతున్నారు. ప్రభుత్వం దగ్గర విషం తప్ప విషయం లేదు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకపోవడం అంటే తెలంగాణను లేకుండా చేయడమే. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం 2013 భూసేకరణ చట్టం అమలు చేశాము.

లగచర్లలో రైతులు తిరగబడితే దీని వెనుక బిఆర్ఎస్ ఉందని అసత్య ప్రచారం చేసిం. ది ప్రభుత్వం రైతులను రెచ్చగొట్టి బిఆర్ఎస్ పార్టీపై నెపం నెట్టింది. లగచర్ల గిరిజనుల పక్షాన బిఆర్ఎస్ ఉంటుంది.

LEAVE A RESPONSE