-స్వచ్చందంగా కుటుంబ సభ్యులతో సహా తరలి వచ్చిన రైతాంగం
-ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉంటాం
-సస్యశ్యామలం అయిన పంటల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపిస్తున్నారు
-కాలువగట్ల మీద ముక్త కంఠంతో నినదించిన అన్నదాతలు
-ఏకకాలంలో కాళేశ్వరం జలాలకు లక్షజన హారతి
-ఏడు మండలాలు 126 గ్రామాలు 68 కిలోమీటర్ల దూరం మానవహారం
-ప్రతి చోట బోడ్రాయి పండుగలను మై మరిపించిన వైనం
-గోదారమ్మ కు చీర ,సారె,పసుపు కుంకుమలతో హారతి పట్టిన రైతాంగం
-కాలువగట్ల పైనే వంటా వార్పు,సహపంక్తి భోజనాలు
-సూర్యాపేట నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ లు
-తుంగతుర్తి నియోజకవర్గంలో శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్,జడ్ పి చైర్మన్ గుజ్జ దీపికా యుగందర్ రావులు
-కోదాడ లో బొల్లం మల్లయ్య యాదవ్ ల ప్రత్యేక పూజలు
-మంగళవారం నుండి సమీక్షలు,వీడియో కాన్ఫరెన్స్ లతో మంత్రి జగదీష్ రెడ్డి పర్యవేక్షణ
-వైద్య బృందాలతో సహా అన్ని ఏర్పాట్లు
-కార్యక్రమాన్ని ఆసాంతం మానిటరింగ్ చేసిన కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు
ఎస్ పి రాజేంద్రప్రసాద్, నీటి పారుదల అధికారి రమేష్ బాబు
-గ్రామాల వారీగా ఏర్పాట్లు చేసిన ప్రజాప్రతినిధులు, బి ఆర్ ఎస్ శ్రేణులు
-టార్గెట్ లక్ష పాల్గొన్నది లక్షా 16 వేల 142 మంది రైతులు
తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలు సూర్యాపేట జిల్లాలో ఘనంగా కొనసాగుతున్నాయి. దశాబ్దిఉత్సవాల సందర్భంగా శాఖల వారీగా జరుపుతున్న విజయోత్సవాలలో బాగంగా బుధవారం నిర్వహించిన నీటిపారుదల దినోత్సవ వేడుకలను రైతాంగం పెద్ద ఎత్తున నిర్వహించారు. కాకపోతే నీటి పారుదల దినోత్సవాన్ని కాళేశ్వరం జలానికి-లక్ష జనహారతి పేరుతో మంత్రి జగదీష్ రెడ్డి వినూత్న పద్ధతిలో డిజైన్ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పాలి అను కుంటూ ఉవ్విళ్లూరుతున్న రైతాంగానికి అమోఘమైన అవకాశాన్ని కల్పించారు.
రైతాంగం కూడా వచ్చిన అవకాశాన్ని అద్భుతమైన రీతిలో వినియోగించుకున్నారు.సమైక్య పాలనలో బీళ్ళుగా మారిన పంట పొలాలు సస్యశ్యామలంగా మారడంతో ఆనందబారితులైన రైతాంగం కాళేశ్వరం జలానికి లక్ష జనహారతి లో పాల్గొనిముక్త కంఠం తో ముఖ్యమంత్రి కేసీఆర్ జైజైలు పలకడంతో పాటు గొదావరమ్మకు నీరాజనం పట్టారు.కాళేశ్వరం నీటితో మొట్ట మొదలు లబ్ది పొందిన తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగరం మండలం ఈటూరు నుండి చివరికున్న పెన్ పహాడ్ మండలం రావి చెరువుకు 68 కిలొ మీటర్ల మేర 7 మండలాల్లోనీ 126 గ్రామాల్లో ఏక కాలంలో లక్షా 16 వేల పై చిలుకు పాల్గొని అభిమాన నేత కు పబ్బతి పట్టారు.
కుటుంబ సభ్యులతో సహా స్వచ్చందంగా తరలి వచ్చిన అన్న దాతలు ముక్త కంఠం తో ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉంటామంటు నినదించారు.ప్రతి చోటా బోడ్రాయి పండుగను మై మరిపించే రీతిలో సాగిన కార్యక్రమం ఆసాంతం పండుగ వాతావరణాన్ని తలపించింది. యావత్ భారత దేశంలోనే వరిదిగుబడిలో రికార్డ్ సృష్టించిన సూర్యాపేట జిల్లా రైతాంగం అందుకు కారణమైన గోదావరమ్మకు చీర, సారె, పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు రైతాంగం హారతి పెట్టారు.
కాలువ గట్ల మీదనే వంటా వార్పు,సహాపంక్తి బోజనాలతో జరిగిన వినూత్న కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వేంల మండలం 71 డి బి యం వద్ద, తుంగతుర్తి శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్,జడ్ పి చైర్మన్ గుజ్జ దీపికాలు యుగంధర్ రావు నాగరం మండలం ఈటూరు గ్రామంలో మోతే మండలంలో గోదావరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞత చెప్పేందుకు గాను రైతాంగం కోరిక మేరకు ఏర్పాటు చేసిన మంత్రి జగదీష్ రెడ్డి మంగళవారం నుండే సమీక్షలు, ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ లు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని విజయ వంతం చేసేలా రూట్ మ్యాప్ గీశారు.
అందుకు అనుగుణంగా మంత్రి జగదీష్ రెడ్డి అదేశానుసారం కలెక్టర్ వెంకట్రావు, ఎస్ పి రాజేంద్రప్రసాద్, ఆదనవు కలెక్టర్ స్థానిక సంస్థలు హేమంత్ కేశవ్ పాటిల్,నీటి పారుదల అధికారి రమేష్ బాబులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, బి ఆర్ ఎస్ శ్రేణులు గ్రామాల వారిగా ఏర్పాట్లను పర్యవేక్షించారు.