– బీజేపీ నేత లంకా దినకర్
175/175 కి గెలిచినా అసెంబ్లీ చేసిన చట్టం చెల్లాలి అంటే ప్రాధమిక హక్కుల భంగం కలగకూడదని ధర్మాన ప్రసాదరావు అంటూనే ప్రజలను తప్పు దోవ పట్టించారు.
మరి ఎవరి ప్రాధమిక హక్కుల భంగం జరగలేదు అని జగన్ చెప్పగలరా? రేపు 151 గెలిచాం కాబట్టి, ముఖ్యమంత్రి పైన ఉన్న పాత కేసులు రద్దు అయిపోతాయి అని శాసనసభలో భవిష్యత్తులో చర్చ పెడతారా? కోర్టు డైరక్షన్ పైన జగన్ కు అసహనంతో కుడిన, ఫ్యాక్షన్ భావజాలం బయటకు వచ్చి కోర్టుల పైన విషం చిమ్మడం రాక్షస పాలన మాత్రమే.
మంత్రి పదవి కోసం పోటీపడి జగన్ ని సంతోష పెట్టడానికి సభలో తాపత్రయపడి న్యాయస్థాన పరిధిలోకి చొరబడ్డానికి ప్రయత్నం చేసి అభాసుపాలు అయ్యారు.