-వైసీపీ ప్రభుత్వ అండదండలతో వైసీపీ నాయకులు భూ ఆక్రమణలతో చెలరేగిపోయారు
-భూ ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అన్ని వ్యవస్థలు వైసీపీ ప్రభుత్వం లో చతికిల పడ్డాయి
-వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూ ఉద్యోగులు సైతం దగా పడ్డారు
-సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ఇచ్చే ప్రతి వినతిపత్రంపై సంబంధిత అధికారులు స్పందిస్తారు
-రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు “ప్రజా దర్బార్” కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయం, మంగళగిరి లో మంత్రి అనగానీ సత్యప్రసాద్, టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ……వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై, వైసీపీ నేతల భూ ఆక్రమణలపై ప్రజల నుండి వినతి పత్రాలు పెద్ద ఎత్తున వచ్చాయి. వైసీపీ ప్రభుత్వ సాయం తో భూములను 22A లో పెట్టి, భూ యజమానులను బెదిరించి వారి నుండి భూములను వైసీపీ నేతలు అక్రమంగా లాక్కున్నారు.
భూ సర్వేల పేరిట రైతుల పై ఒత్తిడి తెచ్చి వారి భూములను దోచుకున్న పాపం వైసీపీ నాయకులదే. భూ ఆక్రమణలపై వచ్చిన వినతి పత్రాలలో అధికం వైజాగ్ ప్రాంతానివే. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వీర్వోలకు జీతాలు, టీఏలు, డీఏలు అందాయి. కానీ వాటిని రద్దు చేసి ఉద్యోగులను మోసగించిన ఘనత మాత్రం వైసీపీ ప్రభుత్వానిదే.
ఉద్యోగులకు టీఏలు, డీఏలు కూడా ఇవ్వని అసమర్థ ప్రభుత్వం గా వైసీపీ ప్రభుత్వం నిలిచింది. జీతాలు దొరికితే చాలనే దుర్భర స్థితికి ఉద్యోగులను చేర్చింది.
మీటర్ రీడర్స్ కు టిడిపి ప్రభుత్వం రూ.3.60 పై.లు ఇస్తే వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.3లకే పరిమితం అయింది. ఆ 60 పైసలు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో వైసీపీ నేతలు చెప్పాలి. భూ సమస్యలతో పాటు ఎలక్ట్రిక్ సిటీ, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టర్ ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యలను ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజలు ఇస్తున్న వినతి పత్రాలను చూస్తుంటే గత ఐదేళ్ల పాలనలో ప్రజలు, మహిళలు, వృద్దులు పడిన ఇబ్బందులు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. ప్రజలు ఇచ్చే ప్రతి వినతి పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖలకు పంపి ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.