Suryaa.co.in

Andhra Pradesh

పరిపాలనా రాజధాని కాకముందే విశాఖలో పెచ్చరిల్లిన భూకబ్జాలు

– ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో, విజయసాయిరెడ్డి నేతృత్వంలో, విలువైనభూములను కబ్జాచేస్తున్న వైసీపీ నేతలు.
విశాఖలోని విలువైనభూములతోపాటు, రాయలసీమలోని ఎర్రచందనం, గ్రావెల్, ఇతరఖనిజాలదోపీడీలో మునిగితేలుతున్న జగన్మోహన్ రెడ్డి అండ్ కో.
• జగన్మోహన్ రెడ్డి తనభూదోపిడీ, కబ్జాలకోసమే విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారు.
• జగన్ అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా, నిబంధనలకు విరుద్దంగా విశాఖలో సాగిన, సాగుతున్న భూక్రయవిక్రయాలన్నీ వన్ సైడ్ ట్రేడింగ్ కిందకురావా?
• విశాఖలో సాగుతున్న భూఆక్రమణలు, కబ్జాలు అన్నీ ముఖ్యమంత్రి, విజయసాయిరెడ్డికి తెలిసిజరుగుతున్నవే.
• రాజశేఖర్ రెడ్డి హయాంలో వృద్ధాశ్రమానికి ఇచ్చిన 12.5ఎకరాలభూమిని విశాఖఎంపీ సత్యనారాయణ నిర్వాహకులనుంచి ఎలా రాయించుకుంటాడు?
• హయగ్రీవ్ ఫామ్స్ అండ్ డెవలపర్స్ యజమాని జగదీశ్వరుడి కింద ఉన్నభూమిని గన్నమనేని వెంకటేశ్వరరావు అనేవ్యక్తికి జీపీ ఎలాచేస్తారు?
• 12ఏళ్లక్రితం, ఎకరం రూ.45లక్షలచొప్పున హయగ్రీవ ఫామ్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు కట్టబెట్టిన భూమి ఇప్పుడుఎకరం ఎకరం రూ.2.5కోట్లకు చేరింది.
• దాన్ని కాజేయడానికే వైసీపీనేతలు కాగితాల్లో లే అవుట్లు సృష్టించి విక్రయాలకు తెరలేపారు.
• 2019 నుంచి ఇప్పటివరకు విశాఖనగరంలో భూక్రయవిక్రయాలకు సంబంధించి 72వేలకు పైగా డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి.
• విశాఖలో భూకబ్జాలతోపాటు, రాయలసీమలో ఎర్రచందనం స్మగ్లింగ్, రవాణా, గ్రావెల్ వ్యాపారంలో వైసీపీనేతల హస్తముంది.
• వైసీపీకి చెందిన ఎంపీటీసీనేత 17ఎర్రచందనం దుంగలతో పట్టుబట్టాడు. పైకి చిన్నచేపలు మాత్రమే దొరుకుతున్నాయి. పెద్దచేపల ఆటకట్టించేస్థితిలో ఈ ప్రభుత్వం లేదు.
– మాజీ శాసనసభ్యులు కూన రవికుమార్

మూడురాజధానుల మాటున విశాఖజిల్లాలో జగన్మోహన్ రెడ్డి భూదోపిడీకి తెరతీశాడని, కేవలం ఉత్తరాంధ్రలోని విలువైన భూములనుకొల్లగొట్టడానికే ఈ ముఖ్యమంత్రి విశాఖ పట్టణాన్ని క్యాపిటట్ రాజధానిగా ప్రకటించాడని తాముగతంలోనే చెప్పామని, ఇప్పుడు సాగరనగరంలో ప్రభుత్వపెద్దలు, అధికారపార్టీనేతల ఆధ్వర్యలో సాగుతున్న భూకబ్జాలే అందుకు నిదర్శనమని టీడీపీ సీనియర్ నేత, మాజీశాసనసభ్యులు కూన రవికుమార్ స్పష్టంచేశారు. శనివారం ఆయన జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

తమదేహాలను, ఆలోచనలను అవినీతిబురదలో కుళ్లబెట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఆ బురదను టీడీపీవారికి కూడా అంటించాలని చూస్తున్నారు. వారిద్దరూ భూకబ్జాలకోసమే విశాఖనగరంపై, ఉత్తరాంధ్రప్రాంతంపై సవతితల్లిప్రేమ చూపుతున్నారని, టీడీపీ తొలినుంచీ చెబుతున్న మాటలు, నేడు

వాస్తవాలుఅయ్యాయి. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో విజయసాయిరెడ్డి నాయకత్వంలో విశాఖపట్నంలో వన్ సైడ్ ట్రేడింగ్ జరుగుతోంది. భూములకబ్జాలు, వాటిఅమ్మకాలపేరుతో వేలకోట్లను కాజేస్తున్నారు. టీడీపీహాయాంలో విశాఖనగరంలో ఎక్కడా ఎలాంటిభూఆక్రమణలు, కబ్జాలు లేకపోయినా, ఆ విధంగా దుష్ప్రచారంచేసిన జగన్మోహన్ రెడ్డి అండ్ కో తమదోపిడీకి ఆ విధమైన దుష్ప్రచారం చేశారు.

పరిపాలనా రాజధాని ముసుగులో భూమార్కెట్ నుకబ్జాచేసి, వేలకోట్ల అవినీతికి తెర లేపారు. గడచిన రెండున్నరేళ్ల నుంచి జరిగిన భూములరిజిస్ట్రేషన్లను గమనిస్తే, అసలు వాస్త వాలు ఏమిటో రాష్ట్రప్రజలకు అర్థమవుతాయి. విశాఖనగరం నుంచి భీమిలి భోగాపురం బీచ్ కారిడార్ రోడ్ వెంబడి ఇరువైపులా ప్రైవేట్ వ్యక్తులభూములను అధికారాన్ని ఉపయోగించి అప్పనంగా లాక్కుంటున్నారు. ఎటువంటి ఆసరాలేనివృద్ధులకోసం వృద్ధాశ్రమం పెట్టడం కోసం రాజశేఖర్ రెడ్డిహాయాంలో యండాడలోని సర్వేనెంబర్ 92/3లో 12.5ఎకరాలభూమిని, ఎకరం రూ.45లక్షలచొప్పున హయగ్రీవ ఫామ్స్ అండ్ డెవలపర్స్ అనేసంస్థకు కట్టబెట్టారు.

12 ఏళ్లక్రితం ఎకరం రూ.45లక్షలున్నభూమి, ఇప్పుడు ఎకరం రూ.2.5కోట్లకు చేరింది. వృద్ధాశ్రమం పెడతామన్నసదరుభూమి మొత్తం ఇప్పుడు జగదీశ్వర్ నుంచి వైసీపీనేతల చేతుల్లోకి మారింది. గన్నమనేని వెంకటేశ్వరరావు(జీవీ) సదరు 12.5ఎకరాల భూమిపై జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ పొందారు. అది ఎలాసాధ్యమైందని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా జగదీశ్వర్ కి రూ.15కోట్లుఅప్పిచ్చిన విశాఖఎంపీ, ఆయననుంచి అదే12.5ఎకరాల్లో నుంచి 500గజాలభూమిని రాయించుకున్నారు.

వృద్ధాశ్రమ నిర్మాణంకోసం గతప్రభుత్వం ఒక సదుద్దేశంతో కేటాయించిన భూమి ప్రైవేట్ వ్యక్తులచేతుల్లోకి ఎలావెళ్లిందో, దానివెనక ఎవరున్నారో ప్రభుత్వమే సమాధానంచెప్పాలి. వృద్ధులకు నీడకల్పించడంకోసం గతంలో ఉన్న ప్రభుత్వం తక్కువధరకు భూమినిఇస్తే, దాన్ని ఇప్పుడు విశాఖఎంపీగా ఉన్న వైసీపీనేత ఎలా అప్పుకింద రాయించుకుంటారు? కొండపై లే అవుట్లు వేయకుండా, వాటిని కాగితాలపై చూపించి, కాగితాలపైనేవాటినికూడా అమ్మేస్తున్నారు. విజయసాయిరెడ్డి నేతృ త్వంలో ఇంతజరుగుతుంటే, అది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరుగుతోందా?

జగన్మో హన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 2019లో 55,221 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయితే, 2020 ఆగస్ట్ నాటికి కరోనాప్రభావంఉన్నప్పటికీ 16,900 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. 2019 నుంచి ఇప్పటివరకు మొత్తంగా 72వేలపైచిలుకు డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. 2019 లో ఆనందపురం, భీమిలి, మధురవాడ ప్రాంతాల్లో ప్రభుత్వపెద్దలే పెద్దఎత్తున భూములు కొన్నారు.వారిలో విజయసాయిరెడ్డి, విశాఖఎంపీ సత్యనారాయణ కూడా ఉన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా, నిబంధనలకు విరుద్దంగా సాగిన భూములక్రయవిక్రయా లన్నీ వన్ సైడ్ ట్రేడింగ్ కిందకురావా?

గతంలో టీడీపీప్రభుత్వంలో అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని పచ్చిఅబద్ధాలు చెప్పి, ప్రజల్లోకి అసత్యప్రచారాన్ని చొప్పించినవారు, ఇప్పుడు పరిపాలనారాజధాని కాక ముందే విశాఖపట్నంలో జరుగుతున్న భూదోపిడీపై ఏంసమాధానం చెబుతారు?విశాఖ నడిబొడ్డున 500గజాల భూమి విలువ వేలకోట్లు పలుకుతున్నప్రాంతాల్లోకూడా వందల ఎకరాల క్రయవిక్రయాలు ఎలాజరిగాయి. అవన్నీ ఏ ట్రేడింగ్ కిందకు వస్తాయో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. అక్రమఎర్రచందనం రవాణాని కట్టడిచేస్తున్నామని చెబుతున్న వైసీపీనేతలు, ప్రభుత్వం దానిముసుగులో వేలకోట్లను దోచుకుంటున్నారు. గతంలో టీడీపీప్రభుత్వంలో ఎర్రచందనం విక్రయాలద్వారా వచ్చినసొమ్ముని, చంద్రబాబునాయుడుగారు రైతులరుణాలు మాఫీచేయ డానికి వినియోగిస్తే, అదేసొమ్ముని ఇప్పుడు వైసీపీనేతలు తమఖజానాలో వేసుకుంటున్నారు.

ఎర్రచందనంతోపాటు ఇసుక, గ్రావెల్ అమ్మకాలద్వారావస్తున్న సొమ్మంతా కూడా ముఖ్యమంత్రి, ఆయనప్రభుత్వంలోని వారి ఖజానాలకే చేరుతోంది. అవన్నీచాలవన్నట్లు గంజాయి, ఇతరమాదకద్రవ్యాల వ్యాపారాన్నికూడా వైసీపీనేతలు యథేచ్ఛగా నిర్వహిస్తు న్నారు. రాయలసీమలోని అడవులనుంచి తీసుకెళ్లిన రూ.48కోట్ల విలువైన ఎర్రచందనాన్ని విదేశాల్లో విక్రయించారని ముంబై హైకోర్ట్ చెప్పింది నిజంకాదా? ఎర్రచందనం ప్రపంచంలోని ఇతరదేశాల్లో విక్రయిస్తున్నారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ న్యాయస్థానాలకు చెప్పింది నిజంకాదా?

చిత్తూరుజిల్లా చిన్నగొట్టికల్లు జడ్పీటీసీగా ఉన్నవైసీపీనేత, కూరపర్తి మహేంద ర్ రెడ్డి 17ఎర్రచందనం దుంగలు తరలిస్తూ పోలీసులకు పట్టుబడింది నిజంకాదా? దానిపై వైసీపీ నేతలు, ముఖ్యమంత్రి ఏంసమాధానంచెబుతారు? ముఖ్యమంత్రికి తెలియకుండానే వైసీపీనేతలకనుస్నల్లో చిత్తూరుజిల్లాసహా, రాయలసీమకేంద్రంగా ఎర్రచందనం, గ్రావెల్, ఇతరముడిఖనిజాల వ్యాపారం జరుగుతోందా?

టీడీపీ హయాంలో చంద్రబాబునాయుడు ప్రజారాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రారం భించి,దాని ప్రక్రియను సజావుగా, సక్రమంగా నిర్వహిస్తే దానిపై బురదజల్లారు. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల ప్రకటనచేసి, ప్రజలందరి రాజధాని అయిన అమరావతిని నిర్వీర్యం చేశారు. రాజధాని ఎక్కడపెడుతున్నామో ఆనాటిప్రభుత్వంచెప్పినతరువాతనే కొందరురైతుల, కొన్నిరియల్ ఎస్టేట్ సంస్థలు భూములుకొంటే, దాన్ని భూతద్దంలోచూపి ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు. కానీ ఇప్పుడు ఈముఖ్యమంత్రి, ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా విశాఖనుంచి కార్యకలాపాలు ప్రారంభించకముందే కొన్నివేలకోట్ల భూక్రయవిక్ర యాలు ఎలాజరిగాయి.

ఎవరి అండదండలతో జరుగుతున్నాయి?
అమరావతిలో గతంలో ఎక్కడా బినామీ ట్రాన్సాక్షన్లు, భూదోపిడీలు జరగలేదు. కానీ ఇప్పుడు విశాఖలో భూబకాసు రుల భూదోపిడీదెబ్బకు రాష్ట్రమే వణికిపోతోంది. ఇంతజరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి తనపార్టీ వారిని ఎందుకు ప్రశ్నించడంలేదు? టీడీపీప్రశ్నలకు సమాధానంచెప్పకుండా, ప్రశ్నించినవారిపై తప్పుడుకేసులు పెడుతూ,ఎన్నాళ్లు వేధిస్తారు?

అసెంబ్లీలోనే వికేంద్రీకరణ బిల్లుపెట్టిన జగన్ ప్రభుత్వం, దాన్ని తిరిగి వెనక్కుతీసుకుంది. మూడురాజధానులబిల్లుని అసెంబ్లీలో ఆమోదించినప్పటినుంచి ఇప్పటివరకు విశాఖలోజరిగిన భూలావాదేవీలు, జరిగి న రిజిస్ట్రేషన్ల వివరాలను బహిర్గతంచేయాలి. వృద్ధాశ్రమంకోసం ఇచ్చినభూములను ఆక్రమిం చుకున్నవారిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE