Suryaa.co.in

Andhra Pradesh

మూడు ముక్కలాట అంటే జగన్ కి ఇష్టం

– బీజేపీ ఫీడ్‌బ్యాక్ ప్రముఖ్ లంకా దినకర్

కొత్త జిల్లాల కూర్పు కి సంబంధం లేకుండా పశ్చిమ ప్రకాశం ప్రజల కోరిక మార్కాపురం జిల్లా ఏర్పాటు తొక్కి వేయడం మూర్ఖత్వం.జగన్ అనాలోచిత నిర్ణయం రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు తెలియని అసమర్థ పాలనకు నిదర్శనం కొత్త జిల్లాల ఏర్పాటు.

అద్దంకి -కందుకూరులను ఒంగోలు నుండి విడదీయుడం అంటే తల్లి నుండి బిడ్డలను విడదీయుడమే.జగన్ ది తలకు మాసిన నిర్ణయం కాబట్టే 26 జిల్లాలున్న జేడ్.పీ చైర్మన్లు 13 మంది మాత్రమే ఉంటారు అంటా.

మూడు ముక్కలాట అంటే జగన్ కి ఇష్టంలా ఉంది కాబట్టే రాష్ట్రాన్ని మరియు ప్రకాశం జిల్లాని మూడు ముక్కలు ఆట అనుకుంటున్నాడు. రాష్ట్రంలో ఇటువంటి పరిస్తితి నలుమూలలా ఉండడంతో భవిష్యత్ రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బందులు తప్పవు. భవిష్యత్ పునర్విభజన వల్ల పార్లమెంట్ స్థానాల పరిధి మారితే ప్రతి పార్లమెంట్ ఒక జిల్లా అనే వాదన కుడా తప్పు అవుతుంది.

LEAVE A RESPONSE