Suryaa.co.in

Andhra Pradesh

కార్మిక శాఖలో బదిలీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు

-సంబంధిత మంత్రి, జాయింట్ సెక్రటరీలపై చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వర్ల రామయ్య లేఖ

గుంటూరు కార్మికశాఖ బదిలీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, దీనిపై విచారణ జరిపి బాద్యులపై చర్యలు చేపట్టాలని కోరుతూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. లేబర్ కమీషనర్ కార్తికేయ మిశ్రా ఇచ్చిన బదిలీల ఉత్తర్వులు పక్కన పెట్టి మంత్రి గుమ్మనూరు జయరాం ఒత్తిడి మేరకు గుంటూరు జోన్ 3 జాయింట్ కమిషనర్ వేరే బదిలీలు చేశారని, ఇది సర్వీస్ నిభంధనలు ఉల్లంఘించడమేనని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు. బదిలీల్లో అక్రమాలకు పాల్పడి ఎంతో మంది అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ల వద్ద రూ. లక్షల్లో వసూలు చేసినట్టుగా ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ బాద్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికశాఖ బదిలీలపై వచ్చిన అవినీతి ఆరోపణలపై, మంత్రి జోక్యం పై, జాయింట్ కమీషనర్ క్రమశిక్షణా రాహిత్యంపైనా చర్యలు తీసుకోవాలని లేఖలో వర్ల రామయ్య కోరారు.

LEAVE A RESPONSE