-త్వరలో మేనిఫెస్టో విడుదల
-నెల్లూరు సమన్వయకర్తగా నియమించినందుకు ధన్యవాదాలు
-సిద్ధం పోస్టర్, ప్రచార పాట ఆవిష్కరించిన రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి
సిద్దం సభలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, దీంతో వైఎస్సార్సీపీ గ్రాఫ్ అమాంతం పెరిగిందని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు, నెల్లూరు ఎంపీ అభ్యర్థి వి విజయసాయి రెడ్డి అన్నారు. ఒంగోలులోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం నాడు సిద్ధం సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం సిద్ధం పోస్టర్ ఆవిష్కరించారు. అలాగే ప్రచారం పాటను కూడా విడుదల చేశారు.
అనంతరం మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ… సిద్ధం సభలకు ముందు, సిద్ధం సభల అనంతరం నిర్వహించిన సర్వేలు వైఎస్సార్సీపీ గ్రాఫ్ అమాంతం పెరిగినట్లు పేర్కొన్నాయని తెలిపారు. సిద్ధం సభలకు ప్రజల నుంచి లభిస్తున్న స్పందన చూస్తే ఎన్నికల్లో 175 కి 175 అసెంబ్లీ సీట్లు, 25కి 25 పార్లమెంటు సీట్లు గెలుస్తామని నమ్మకం మరింత బలపడుతోందని అన్నారు. ఈ నెల 10న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల వద్ద చివరిది నాల్గవ సిద్దం మహా సభ జరగనుందని,ఈ సభకు తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల పరిధిలోని మొత్తం 43 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 15 లక్షల మంది హాజరు కానున్నట్లు తెలిపారు.
తనపై నమ్మకంతో నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మంత్రులు మేరుగు నాగార్జున, కాకాని గోవర్ధనరెడ్డి,అంబటి రాంబాబు, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు,లోక్ సభ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, గురుమూర్తి, తలశిల రఘురాం, లేళ్ల అప్పీరెడ్డి,విజయనగరం జెడ్పి చైర్మన్ మజ్జీ శ్రీనివాసరావు,తిరుపతి జిల్లా పార్టీ అధ్యక్షుడు నేదురుమల్లి రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు